MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • కొత్తిమీరను రెగ్యులర్ గా తింటున్నారా? అయితే ఈ విషయాలను మీరు తెలుసుకోవాల్సిందే..

కొత్తిమీరను రెగ్యులర్ గా తింటున్నారా? అయితే ఈ విషయాలను మీరు తెలుసుకోవాల్సిందే..

Healthy Food: కొత్తిమీర లేని కూరవండుడు కష్టమే కదా.. అవును చాలా మంది కూరలో ఏది ఉన్నా.. లేకున్నా.. కొత్తిమీరను మాత్రం పక్కాగా వేస్తుంటారు. కొత్తిమీరతో కూరలు రుచికరంగానే కాదు.. వీటి వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది కూడా.. 

1 Min read
Mahesh Rajamoni
Published : Mar 19 2022, 09:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

coriander leaves benefits: ప్రతి కూరలో పక్కాగా కొత్తిమీరను వేయాల్సిందే అంటుంటారు చాలా మంది. ఎందుకంటే ఈ కొత్తిమీరతో కూరలు రుచికరంగా మారుతుంటాయి. అయితే చాలా మంది కొత్తిమీర కేవలం వంటలను రుచికరంగానే మారుస్తుంది తప్ప మరే లాభం లేదని అంటుంటారు. 

27
Asianet Image

నిజానికి అది అపోహ మాత్రమే.  కొత్తిమీర వల్ల మనకు ఎన్నో లాభాలు జరుగుతాయి. దీనిని కొన్ని రకాల బ్యూటీ టిప్స్ కోసం కూడా ఉపయోగిస్తుంటారు. అంతేకాదు ఇది మన శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అవేంటో తెలుసుకుందాం పదండి.. 

37
Asianet Image

కొత్తిమీర ఆకుల్లో విటమిన్ ఎ మెండుగా ఉంటుంది. ఈ విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే కంటి చూపు సరిగ్గా లేని వారు కొత్తిమీరను రెగ్యులర్ గా తింటూ ఉండాలని వైద్యులు చెబుతుంటారు. అలాటే కంటి నొప్పి సమస్య నుంచి ఉపశమనం కూడా కలిగిస్తుంది. 

47
Asianet Image

కొత్తిమీరలో విటమిన్ ఎ, విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీర పోషణకు ఎంతో సహకరిస్తాయి. అంతేకాదు ఇవన్నీ మన ఆరోగ్యానికి కూడా తోడ్పడుతాయి. 

57
Asianet Image

కొత్తిమీర ఆకులో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. కాబట్టి కొత్తిమీరను రెగ్యులర్ గా తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

67
Asianet Image

రెగ్యులర్ గా కొత్తిమీరను కూరల్లో వేసుకుని తినే వారికి జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. అంతేకాదు మలబద్దకం, అజీర్థి, గ్యాస్ట్రిక్ వంటి సమస్యను తగ్గిస్తుంది. 

77
Asianet Image

కొత్తిమీర ఆకుల్లో.. రక్తంలోని షుగర్ లెవెల్స్ ను తగ్గించే లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇది డయాబెటిక్ పేషెంట్లకు మంచి ఆహారమే చెప్పాలి. అలాగే కొత్తిమీరతో ఇన్సులిన్ కూడా నియంత్రణలో ఉంటుంది . కాబట్టి ఈ కొత్తిమీర ఆకులను రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది. 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved