MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • సెక్స్ విషయంలో పురుషులు ఎందుకు అభద్రతా భావానికి లోనవుతారంటే?

సెక్స్ విషయంలో పురుషులు ఎందుకు అభద్రతా భావానికి లోనవుతారంటే?

మహిళలే కాదు పురుషులు కూడా సెక్స్ విషయంలో అభద్రతా భావాలనికి లోనవుతారని నిపుణులు అంటున్నారు. పురుషాంగం పరిమాణం, లైంగిక సామర్థ్యం, లైంగిక పనితీరు, భాగస్వామిని మెప్పించగలనా అంటూ ఎన్నో విషయాల్లో పురుషులు అభద్రతా భావానికి లోనవుతారు. 
 

Mahesh Rajamoni | Published : Jun 02 2023, 10:38 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

సాధారణంగా ఆడవారే అభద్రతా భావానికి లోనవుతారు. శరీరం మరీ సన్నగా, లేదా మరీ ఎక్కువ లావుగా ఉండటం, రొమ్ముల పరిమాణం చిన్నగా ఉండటం వంటి విషయాల్లో ఆడవారు అభద్రతా భావానికి లోనవుతారు. ఇవి పురుషులను ఆకర్శించలేవు లేదా వారు సంతోషించేలా చేయవని భావిస్తుంటారు. ఆడవాళ్ల మాదిరిగానే మగవారు కూడా సెక్స్ విషయంలో ఎన్నో అభద్రతా భావానికి లోనవుతారు. వీళ్లు మంచంపై ఎలా పనిచేస్తారు? తమ భాగస్వామిని మెప్పించగలరా లేదా అనే దాని గురించి చాలా ఇబ్బందికరంగా, విచిత్రంగా భావిస్తారు. ఈ సాధారణ అభద్రత భావాలు పురుషుల ఆత్మవిశ్వాస స్థాయిలను, ఆత్మగౌరవాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. లైంగిక పనితీరు విషయానికి వస్తే పురుషులు ఎదుర్కొనే సాధారణ అభద్రత భావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

26
Asianet Image

పురుషాంగం పరిమాణం

పురుషులకున్న అత్యంత సాధారణ లైంగిక అభద్రతల్లో వారి పురుషాంగం పరిమాణం ఒకటి. చాలా మంది పురుషులు తమ పురుషాంగం తమ భాగస్వాములను సంతృప్తిపరచడానికి తగినంత పెద్దదిగా లేదని ఆందోళన చెందుతారు. చాలా మంది పురుషులు తమ పురుషాంగం పరిమాణాన్ని వారి లైంగిక పనితీరుతో ముడిపెడతారు. మగవారు తమ పురుషాంగం పరిమాణం వారి లైంగిక ఆనందాన్ని నిర్ణయించదని తెలుసుకోలేకపోతుంటారు. పురుషాంగం పరిమాణం లైంగిక పనితీరును, ఆనందాన్ని కలిగించవని నిపుణులు చెబుతున్నారు. 
 

 

36
sex life

sex life

భారీ పనితీరు గురించి ఆందోళన 

చాలా మంది మగవారు వారి లైంగిక పనితీరు గురించి ఆందోళన చెందుతుంటారు. ఇది అంగస్తంభనను  పొందడం లేదా నిర్వహించే సామర్థ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఈ ఆందోళన వల్ల వీరు త్వరగా స్ఖలనం చేయొచ్చు. అంటే వీర్యం తొందరగా బయటపడొచ్చు. లేదా వారి భాగస్వామిని సంతృప్తిపరచలేకపోవచ్చు. లైంగిక పనితీరు ఆందోళన ఒత్తిడి, శరీర ఇమేజ్ ఆందోళనలు వంటి వివిధ కారకాల ద్వారా ప్రేరేపించబడుతుంది. అయితే కొన్ని పద్దతులతో ఈ సమస్యను పరిష్కరించొచ్చు.
 

46
Asianet Image

బాడీ ఇమేజ్ సమస్యలు

మహిళల మాదిరిగానే పురుషులు కూడా వారి లైంగిక సామర్థ్యాన్ని బాడీ ఇమేజ్ తో ముడిపెడతారు. బరువు, కండరాల పరిమాణం, జుట్టు రాలడం లేదా శారీరక రూపం గురించి ఆందోళనలు చెందే వారు లైంగిక అభద్రతా భావాలను కలిగుంటారు. ప్రత్యేకించి వీళ్లు మరొక వ్యక్తి ముందు నగ్నంగా ఉన్నప్పుడు, ఫోర్ ప్లే లేదా సెక్స్ సమయంలో ఎక్కువ ఆందోళన చెందుతుంటారు. మీ బాడీ గురించి ఆందోళన చెందడం మానేస్తే మీరు సెక్స్ విషయంలో చురుగ్గా ఉంటారు. 

56
Image: Getty Images

Image: Getty Images

గత లైంగిక అనుభవాలు

అనుభవం లేని పురుషులు తమ భాగస్వాములతో పోలిస్తే వారి లైంగిక నైపుణ్యాల గురించి ఎక్కువ అభద్రతా భావానికి లోనవుతారు. సమాజం పురుషుల లైంగిక పనితీరు, అనుభవానికి చాలా ప్రాధాన్యతనిస్తుంది. పురుషులు సాధారణంగా చాలా అనుభవం ఉన్నవారు, బెడ్ రూంలో ఎంతో రెచ్చిపోతారని ఊహించుకుంటారు. ఈ అంచనాలకు అనుగుణంగా బతకడం పురుషులకు పెద్ద భారం కావొచ్చు.
 

66
Asianet Image

తమ భాగస్వామిని మెప్పించలేకపోవడం

చాలా మంది పురుషులు తమ భాగస్వామిని లైంగికంగా సంతృప్తి పరచగలనా?  లేదా? అనే విషయం గురించి ఆందోళన చెందుతారు. తమ భాగస్వామిని భావప్రాప్తికి తీసుకురాలేరని లేదా వారి కోరికలను తీర్చలేరని ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు. ఇది ఆందోళన, స్వీయ సందేహానికి దారితీస్తుంది. 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
 
Recommended Stories
Ghee Coffee Benefits: నెయ్యి కాఫీతో ఎన్ని లాభాలో తెలిస్తే.. తాగకుండా ఉండరు!
Ghee Coffee Benefits: నెయ్యి కాఫీతో ఎన్ని లాభాలో తెలిస్తే.. తాగకుండా ఉండరు!
AskDISHA 2.0: వాయిస్ కమాండ్ తో క్షణాల్లో రైలు టికెట్.. అందుబాటులోకి ఆస్క్ దిశ ఏఐ ఫీచర్
AskDISHA 2.0: వాయిస్ కమాండ్ తో క్షణాల్లో రైలు టికెట్.. అందుబాటులోకి ఆస్క్ దిశ ఏఐ ఫీచర్
Stress: మహిళలకు ఒత్తిడి ఎక్కువ గా ఉంటే ఏమౌతుందో తెలుసా?
Stress: మహిళలకు ఒత్తిడి ఎక్కువ గా ఉంటే ఏమౌతుందో తెలుసా?
Top Stories
Telugu news live updates: IPL 2025 - ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచేది ఎవరు? సునీల్ గవాస్కర్ అంచనా జట్టు ఇదే
Telugu news live updates: IPL 2025 - ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచేది ఎవరు? సునీల్ గవాస్కర్ అంచనా జట్టు ఇదే
Sangeetha mobiles: సంగీత మొబైల్స్‌ 51 ఏళ్ల పండ‌గ‌.. క‌ళ్లు చెదిరే డిస్కౌంట్స్‌
Sangeetha mobiles: సంగీత మొబైల్స్‌ 51 ఏళ్ల పండ‌గ‌.. క‌ళ్లు చెదిరే డిస్కౌంట్స్‌
Acharya :  చదువులోనే కాదు కెరీర్ లోనూ సక్సెస్ అయ్యేలా విద్యార్థులను తీర్చిదిద్దే విద్యాసంస్థ
Acharya : చదువులోనే కాదు కెరీర్ లోనూ సక్సెస్ అయ్యేలా విద్యార్థులను తీర్చిదిద్దే విద్యాసంస్థ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
  • Language Editions
  • newsable(english)
  • മലയാളം(malayalam)
  • தமிழ்(tamil)
  • ಕನ್ನಡ(kannada)
  • తెలుగు(telugu)
  • বাংলা(bangla)
  • हिन्दी(hindi)
  • मराठी(marathi)
  • Hot on Web
  • Nara Chandrababu Naidu
  • Pawan Kalyan
  • Telugu News
  • District News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Nellore News
  • Guntur News
  • Hyderabad News
  • Popular Categories
  • Life Style
  • International News
  • Entertainment
  • Fact Check
  • Sports
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved