Chest pain: ఛాతి నొప్పితో బాధపడేవారు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను అస్సలు వేసుకోకూడదు..
Chest pain: కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడేవారికి ఛాతిలో మంట, నొప్పి వస్తుంటుంది. అయితే కొన్ని ఇతర కారణాల వల్ల కూడా ఛాతిలో నొప్పి పుడుతుంది. ఇలాంటి వారు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను వేసుకోకూడదు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Chest pain: ఎండాకాలంలో కడుపులో గ్యాస్ సమస్యతో బాధపడేవారు చాలా మందే ఉంటారు. గ్యాస్ ప్రాబ్లం నుంచి ఛాతిలో మంట, నొప్పి వంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. అయితే ఈ నొప్పి, మంట గ్యాస్ ప్రాబ్లం వల్లే కాకుండా ఇతర కారణాల వల్ల కూడా వస్తుంటుంది.
ఈ నొప్పి తగ్గేందుకు చాలా మంది పెయిన్ కిల్లర్ టాబ్లెట్లను ఎక్కువగా వాడుతుంటారు. కానీ ఈ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను ఎక్కువగా వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కలగొచ్చు. ముఖ్యంగా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను ఛాతిలో నొప్పి వచ్చే వారు వేసుకోవడం ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని వేసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముందని చెబుతున్నారు.
నిజానికి ఛాతిలో మంట గుండెపోటుకు సంకేతం కూడా. అయితే కొంతమంది మాత్రం ఇది గ్యాస్ ప్రాబ్లం వల్లే వచ్చిందని సొంత వైద్యం చేసుకుంటారు. అందుకు ఎన్నో మందులను కూడా వాడుతుంటారు. ఛాతిలో మంటతో పాటుగా శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడేవారు డాక్టర్లను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను ఎక్కువగా వేసుకోవడం వల్ల కాలెయం, కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ లో ఉంది.
పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్లను వేసుకోవడం వల్ల మూత్రపిండాల సామర్థ్యం తగ్గుతుందట. గుండె పై చెడు ప్రభావం పడుతుంది. దీంతో హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల గుండె కొట్టుకు వేగంలో హెచ్చు తగ్గులు రావొచ్చు. దీతో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి ఛాతి నొప్పి ఉన్నవారు పెయిన్ కిల్లర్స్ ను వాడకపోవడమే మంచిది. ఒకవేళ వాడాలనుకుంటే ముందుగా వైద్యలను సంప్రదించాలి. ఒకవేళ ఈ మందుబిల్లలను వేసుకున్నా ఛాతిలో నొప్పి అలాగే వస్తుంటే మాత్రం ఆలస్యం చేయకుండా హాస్పటల్ కు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.
pain killers
హార్ట్ పేషెంట్స్ తో పాటుగా చిన్న పిల్లలు, గర్భిణులు కూడా ఈ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను అస్సలు వేసుకోకూడదు. వీటివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.