మగాళ్లూ.. వీటిని తింటే మీ బట్టతలను ఎవరూ ఆపలేరు.. జాగ్రత్త..
షాంపూలు, నూనెలే కాదు.. మీరు తినే ఆహారం కూడా మీ జుట్టు ఎలా ఉండాలో డిసైడ్ చేస్తుంది. ముఖ్యంగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బ్రెడ్, చక్కెర వంటి ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే పక్కాగా బట్టతల వస్తుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు.

అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా అందంగా కనిపించాలని ఆరాటపడుతుంటారు. అందుకోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అందుకే కదా మెన్స్ పార్లర్లు కూడా వచ్చాయి.
అమ్మాయిలతో పాటుగా అబ్బాయిలు కూడా బాహ్య అందం కోసం వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. కానీ వీటివల్ల అప్పటి మందమే అందం కలుగుతుందని ఆ తర్వాత మీరు మునుపటిలా మారిపోతారని నిపుణులు చెబుతున్నారు.
జుట్టు అందంగా, ఆకర్షణీయంగా తయారవ్వాలంటే పార్లర్ల చుట్టూ కాదు.. మీరు తీసుకునే ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవును కొన్ని రకాల ఆహారపు అలవాట్ల వల్లే మగాళ్లకు బట్టతల వస్తుందని నిపుణులు తేల్చి చెబున్నారు.
వాటికి వీలైనంత దూరంగా ఉండకపోతే వారికొచ్చే బట్టతలను ఎవరూ ఆపలేరని తేల్చి చెబుతున్నారు. మరి బట్టతలకు కారణమయ్యే ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం పదండి.
ఆల్కహాల్: ఆల్కహాల్ ఆరోగ్యాన్ని అనేక రకాలుగా దెబ్బతీస్తుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం వల్ల వెంట్రుకలు బలహీనపడతాయని నిపుణులు తేల్చారు. అంతేకాదు దీంతో పోషకాలు అసమతుల్యం అవుతాయట. దీంతో జుట్టు కుద్దుళ్లు మూసుకుపోతాయి. తద్వార జుట్టుకు పోషకాలు అందవు. దాంతో జుట్టు రాలడం స్టార్ట్ అవుతుంది. అంతేకాదు దీంతో కొత్త జుట్టు వచ్చే ప్రసక్తే ఉండదు. కాబట్టి ఆల్కహాల్ కు దూరంగా ఉండటమే బెటర్.
జంక్ ఫుడ్: ప్రస్తుతం చాలా మంది జంక్ ఫుడ్ ను తినడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది అస్సలు మంచి పద్దతి కాదు. నోటికి రుచిగా అనిపించినా.. వీటిలో మోనో అన్ శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీని వల్ల జుట్టు విపరీతంగా రాలుతుంది. అంతేకాదు ఇది గుండె సంబంధిత రోగాల బారిన పడేస్తుంది. ఊబకాయం కూడా అటాక్ చేస్తుంది.
ఇకపోతే డైట్ సోడా కూడా జుట్టు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. వీటిలో ఉండే Artificial Sweetner జుట్టు కుదుళ్లను దెబ్బతీస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటమే బెటర్.
బాడీలో పాదరసం లెవెల్స్ పెరిగితే కూడా హెయిర్ ఫాల్ సమస్య వస్తుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. కాగా ఇది సముద్రపు చేపల్లో ఎక్కువగా ఉంటుంది.
sugar
రిఫైండ్ బ్రెడ్, పిండి, చెక్కెరలు జుట్టు ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. ఎందుకంటే ఇందులో ఉండే గ్లైసీమిక్ ఇండెక్స్ వల్ల హార్లోన్లు అసమతుల్యతకు గురవుతాయి.
అలాగే బట్టతల రావడంతో పాటుగా ఊబకాయం, డయాబెటిస్ వంటి సమస్యల బారిన పడతారు. కాబట్టి వీటికి వీలైనంత దూరంగా ఉండండి.
పచ్చిగుడ్డుకు బదులుగా ప్రతిరోజూ ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డును తినండి. దీనివల్ల జుట్టు సంబంధిత సమస్యలు రావు. ప్రోటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల కూడా హెయిర్ ఫాల్ సమస్యను నివారించొచ్చు.