టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లు ఈ ఆహారాలను అస్సలు తినకూడదు.. లేదంటే షుగర్ లెవెల్స్ పెరుగుతయ్..
type 2 diabetes diet : టైప్ 2 పేషెంట్లు ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది.

శరీరంలో ఇన్సులిన్ హార్మోన్లు గ్లూకోజ్ ను సరిగ్గా నియంత్రించలేప్పుడు టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. దీనికి కారణం చెడు ఆహారపు అలవాట్లు.. అసహజ జీవన శైలి. ఈ టైప్ 2 మధుమేహుల్లో ఇన్సులిన్, షుగర్ లెవెల్స్ తగ్గుతుంటాయి. ఈ వ్యాధి అన్ని వయసుల వారికి రావొచ్చు.
ఈ టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లలో .. బరవు తగ్గడం, కంటిచూపు సరిగ్గా లేకపోవడం, అలసట, తరచుగా మూత్రం రావడం, ఆకలి ఎక్కువగా అవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు ఈ పేషెంట్లలో కాళ్ల నొప్పులు, వాపు, తిమ్మిర్లు వంటి సమస్యలు కూడా వస్తుంటాయి.
అందుకే వీరు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే వీరి రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా లైఫ్ స్టైల్ ను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో లేకుంటే మాత్రం గుండె, కళ్లు, నాడీ వ్యవస్థ, మూత్రపిండాలు, రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి వీరి లైఫ్ స్టైల్ , తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బయటి ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉండండి. ఇంట్లో తయారుచేసిన ఆహార పదార్థాలను మాత్రమే తినండి. ముఖ్యంగా షుగర్ కంటెంట్ , కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు. ఒకవేళ మీ షుగర్ లెవెల్స్ ఉంటేనే వీటిని తీసుకోండి.
ఫ్రూట్ జ్యూస్ లు, సోడాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని అప్పుడప్పుడు మాత్రమే తాగండి.
ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినకూడదు. అలాగే రిఫైన్డ్ , ప్రాసెస్ చేసిన, ప్యాకెట్ ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉండాలి.
వ్యాయామం తప్పనిసరి.. ఆరోగ్యకమైన ఆహారంతో పాటుగా వీళ్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఎంతో అవసరం. బలమైన ఆహారం తీసుకోవడం ద్వారా మీకు కావాల్సిన శక్తి లభించడంతో పాటుగా శరీరంలో కొవ్వులు కూడా పేరుకుపోతాయి. అవి కరగాలంటే ప్రతిరోజూ శారీరక శ్రమ చేయాలి.
అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ప్రకారం.. డయాబెటీస్ పేషెంట్లు ప్రతిరోజూ 30 నిమిషాల పాటు నడక, నెట్టడం, లాగడం, బరువులు ఎత్తడం వటి వ్యాయామాలను చేయల్సి ఉంటుంది. వాకింగ్, డ్యాన్స్, స్విమ్మింగ్, స్టీర్ క్లైంబింగ్ వంటివి చేయడం వల్ల మీరు ఫిట్ గా ఉండటమే కాదు గుండె , ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ను చెక్ చేయండి.. డయాబెటీస్ పేషెంట్లు క్రమం తప్పకుండా తమ రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవడం ఎంతో అవసరం. ఇలా చెక్ చేయడం వల్ల మీ రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా లేదా ఎక్కువగా ఉంటే వాటిని మళ్లీ సాధారణ స్థితిలోకి తీసుకురావడం సులువు అవుతుంది.