MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • చాణక్యుడు చెప్పిన ఈ అలవాట్లు హోదాను పెంచుతాయి.. మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తాయి

చాణక్యుడు చెప్పిన ఈ అలవాట్లు హోదాను పెంచుతాయి.. మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తాయి

ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో.. ఒక వ్యక్తి చాలా త్వరగా విజయం సాధించడానికి, డబ్బును సంపాదించడానికి సహాయపడే కొన్ని అలవాట్ల గురించి తెలియజేశాడు. అవేంటంటే? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Oct 31 2024, 01:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chanakya Niti Life Management

Chanakya Niti Life Management

ఆచార్య చాణక్యుడు తన జీవితకాలంలోనే జీవితానికి సంబంధించిన విధానాలను రచించాడు. రాజకీయాలు, యుద్ధ నైపుణ్యాలు మాత్రమే కాకుండా.. పిల్లల మంచి పెంపకం, కుటుంబ జీవితం, మంచి పెంపకం, వ్యక్తి విజయం సూత్రాలను కూడా ఆచార్య చాణక్యుడు వివరించాడు. 

ఆచార్య చాణక్య విధానాల్లో అతి ముఖ్యమైన విషయం.. ఈ విధానాలు అప్పటి ప్రజలకు మార్గాన్ని చూపించడమే కాకుండా.. నేటికీ ఆ విధంగానే ప్రజల జీవితాలను సరళతరం చేయడానికి సహాయపడుతున్నాయి. ఈ విధానాల్లో ఒక వ్యక్తి చాలా త్వరగా విజయం సాధించడానికి, హోదాను పెంచడానికి సహాయపడే కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
Chanakya Niti Life Management

Chanakya Niti Life Management

తొందరగా పడుకోవాలి

ఆచార్య చాణక్యుడి ప్రకారం..  రాత్రి తొందరగా నిద్రపోని వ్యక్తి ఇతరుల కంటే వెనకబడి ఉంటాడు. అందుకే మీరు మీ జీవితంలో విజయం సాధించాలంటే మాత్రం రాత్రిపూట లేట్ గా పడుకునే అలవాటును వదిలేయాలి. ఆచార్య

చాణక్యుడి ప్రకారం.. ఉదయం బ్రహ్మముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి లక్ష్యసాధన చేస్తే మీరు జీవితంలో ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. 

35
Chanakya Niti

Chanakya Niti

కష్టపడి పనిచేయడానికి భయపడొద్దు

ఏ వ్యక్తి అయినా సరే కష్టపడకుండా.. విజయం సాధించలేడు. మీరు జీవితంలో విజయం సాధించాలంటే మాత్రం ఖచ్చితంగా కష్టపడాలి. దీనికి ఎలాంటి షార్ట్ కట్స్ లేవు.

ఆచార్య చాణక్యుడి ప్రకారం.. కష్టపడటానికి పనికి భయపడే వ్యక్తి ఎప్పటికీ విజయం సాధించలేడు. అలాగే ఎలాంటి ఫలితం ఆశించకుండా పూర్తి శ్రమ, అంకితభావంతో పని చేస్తే తొందరగా జీవితంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. 

45

దుబారాను నివారించండి

ఆచార్య చాణక్యుడి ప్రకారం.. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలంటే, విజయం సాధించాలంటే దాబారాను ఖచ్చితంగా నివారించాలి. అనవసరంగా డబ్బును ఖర్చు పెడుతూ,  పంచుతూ, ఆలోచించకుండా డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవారికి లక్ష్మిదేవి ఎప్పటికీ తోడుగా ఉండదు.  ఇలాంటి వారు లక్షలు సంపాదించినా ఎప్పటికీ ధనవంతులు కాలేరు. మీరు ధనవంతులు కావాలంటే మాత్రం వృధా ఖర్చులను తగ్గించుకోవాలి. 

55

 మీ లక్ష్యాన్ని ఎవరికీ చెప్పొద్దు

మీరు అనుకున్న పని జరగాలన్నా, విజయం సాధించాలన్నా మీ గమ్యాన్ని చేరుకునే వరకు ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకండని ఆచార్య చాణక్యుడు అంటాడు. మీ లక్ష్యాలను, ప్రణాళికలను ఇతరులతో పంచుకుంటే  దానిపై ప్రతికూలత ఏర్పడుతుంది. దీంతో మీ లక్ష్యాన్ని సాధించడంలో ఇతరుల అసూయ, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. 

అహంకారం వద్దు

జీవితంలో సక్సెస్ ఫుల్ వ్యక్తిగా ఎదగాలంటే మాత్రం మీకు అహంకారం అసలే ఉండకూడదు.  గర్వపడే వ్యక్తి ఎన్నటికీ ఎదగలేడు. అహంకారం మనిషికి శత్రువు వంటిది.  ఎందుకంటే మనస్సులో అహంకార భావన కలిగితే ఈ ప్రపంచం మొత్తం అతని ముందు పాలిపోయినట్టుగా అనిపించడం మొదలవుతుంది.

ఇక్కడినుంచే అతని పురోగతికి ఆటంకం కలగడం స్టార్ట్ అవుతుంది. జీవితంలో విజయవంతమైన వ్యక్తి కావడానికి అహంకారాన్ని విడిచిపెట్టడం చాలా ముఖ్యమంటాడు ఆచార్య చాణక్యుడు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
కుక్క‌ర్ హ్యాండిల్ ప‌దే ప‌దే లూజ్ అవుతోందా.? నెయిల్ పెయింట్‌తో ఇలా చేస్తే మ‌ళ్లీ స‌మ‌స్య రాదు
Recommended image2
Mango Storage: మామిడి పండ్లు రెండు వారాలైనా పాడవకుండా ఉండాలంటే సింపుల్ చిట్కాలు
Recommended image3
Kundan Mangalsutra: కుందన్ మంగళసూత్రాలు.. నేటితరం అమ్మాయిల కోసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved