MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Chanakya Niti: కోపంలో కూడా భర్తతో భార్య చెప్పకూడని మూడు విషయాలు ఇవే

Chanakya Niti: కోపంలో కూడా భర్తతో భార్య చెప్పకూడని మూడు విషయాలు ఇవే

Chanakya Niti:  భార్యాభర్తల జీవితం సంతోషంగా ఉండాలి అంటే భర్తతో భార్య కొన్ని విషయాలు పొరపాటున కూడా చెప్పకూడదు. ముఖ్యంగా కోపంలో ఉన్నప్పుడు నోరు జారి కూడా కొన్ని మాటలు అనకూడదు. 

1 Min read
Author : ramya Sridhar
Published : May 08 2026, 06:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చాణక్య నీతి ఏం చెబుతోంది..?
Image Credit : freepick

చాణక్య నీతి ఏం చెబుతోంది..?

భార్యాభర్తల మధ్య గొడవలు రావడం చాలా సహజం.  అయితే.. కోపంలో మనం మాట్లాడే కొన్ని మాటలు బంధానికి బీటలు తెస్తాయి.  చాలా మంది కోపంలో నోరు జారుతూ ఉంటారు. ఆ సమయంలో ఏం మాట్లాడుతున్నాం..? ఎలాంటి మాటలు అంటున్నాం అనే విషయం కూడా ఆలోచించరు. కానీ, అందులోని మాటలు పూర్తిగా దాంపత్య జీవితాన్నే నాశనం చేయగలవు.  అందుకే,   నోరు జారి కోపంలో, లేదా సరదాగా ఉన్నప్పుడు కూడా కొన్ని మాటలు అనకూడదు అని చాణక్యుడు చెబుతున్నాడు. మరి.. భర్తతో భార్య ఎలాంటి విషయాలు చెప్పకూడదో ఇప్పుడు తెలుసుకుందాం….

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నువ్వు మగాడివేనా..?
Image Credit : Getty

నువ్వు మగాడివేనా..?

‘ నువ్వు అసలు మగాడివేనా?’ అని ఏ భార్యా.. తన భర్తను అడగకూడదు. మగతనం, పౌరుషం అనేది పురుషుడికి అహంకారానికి సంబంధించిన విషయం. మీరు ఈ మాటను సరదాకి అన్నా కూడా.. ఆ క్షణంలో అతను దాన్ని సరదాగా తీసుకున్నా.. కాల క్రమేణా అది బంధంలో సమస్యలు తెస్తుంది. అందుకే, ఎప్పుడూ భర్త పౌరుషాన్ని ప్రశ్నించకూడదని చాణక్య నీతి చెబుతుంది.

34
నిన్ను కాకుండా అతన్ని పెళ్లి చేసుకుంటే...
Image Credit : Social Media

నిన్ను కాకుండా అతన్ని పెళ్లి చేసుకుంటే...

‘నిన్ను  కాకుండా వేరే వాళ్లను పెళ్లి చేసుకుని ఉంటే నా జీవితం చాలా బాగుండేది' అనే మాట. ఈ మాటను సాధారణంగా కోపంలో అంటుంటారు. కానీ ఇది మగవాళ్ల అహాన్ని దెబ్బతీస్తుంది. తనకోసం ఇంత చేస్తున్నా ఇలా అంటోందేంటని భర్త బాధపడతాడు. ఈ మాట భర్త భార్యతో అన్నా ఇలాగే ఉంటుంది. అందుకే భార్యాభర్తలిద్దరూ ఈ మాటను సరదాకి కూడా అనకూడదని చాణక్య నీతి చెబుతోంది.

44
అతన్ని చూసి నేర్చుకోండి
Image Credit : Getty

అతన్ని చూసి నేర్చుకోండి

ఇక మూడోది, ఇతరులతో పోల్చడం. 'పక్కింటి వాళ్ల ఆయనను చూడు', 'నా స్నేహితురాలి భర్తను చూసి నేర్చుకో'.. 'అతను ఎంత మంచివాడో చూడు.. నువ్వేమో ఇలా ఉన్నావ్' అని పోల్చడం. ఇది పురుషుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుంది. అందుకే పొరపాటున కూడా ఇలాంటి పోలికలు తీసుకురాకూడదని చాణక్య నీతిలో స్పష్టంగా చెప్పారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Thailand Trip New Rules: థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? సెప్టెంబర్ 15 నుంచి భారతీయులకు కొత్త రూల్స్
Recommended image3
Urine : మూత్రం ఎందుకు దుర్వాసన వస్తుంది? అసలు శరీరంలో మూత్రం ఎలా తయారవుతుంది?
Related Stories
Recommended image1
Chanakya Niti: మనుషుల నుంచి కాదు.. కాకిని చూసి ఇవి నేర్చుకోండి...
Recommended image2
Chanakya Niti: అందరితో మంచిగా ఉండటం కూడా తప్పేనా? కాస్త కన్నింగ్ గా ఉండాల్సిందేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved