MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Hair Health : హస్త ప్రయోగం ఎక్కువైనా బట్టతల వస్తుందా?

Hair Health : హస్త ప్రయోగం ఎక్కువైనా బట్టతల వస్తుందా?

Hair Health : అమ్మాయిలకైనా.. అబ్బాయిలకైనా జుట్టంటే మహాప్రాణం. ఒత్తైన జుట్టుకోసం ఎంతటి సాహసమైనా చేసేస్తుంటారు. అయితే అబ్బాయిలకు బట్టతల రావడానికి హస్తప్రయోగం కూడా ఒక కారణమని ఓ అధ్యయనం వెల్లడిస్తోంది.  

2 Min read
Mahesh Rajamoni
Published : May 17 2022, 12:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా నల్లని, ఒత్తైన జుట్టు ఉండాలని ఆశపడుతుంటారు. అంతేకాదు అందమైన జుట్టు కోసం అబ్బాయిలు రకరకాల షాంపూలను, కండీషనర్లను ఉపయోగిస్తుంటారు. జుట్టు కోసం పార్లర్ కు వెళ్లే అబ్బాయిలు కూడా ఉన్నారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది అబ్బాయిలు బట్టతలల బారిన పడుతున్నారు. అంతేకాదు వీరిలో జుట్టు రాలే రేటు పెరుగుతోంది. పురుషులకు వచ్చే బట్టతల సమస్యను ‘ఆండ్రోజెనెటిక్ అలోపేసియా’ (Androgenetic alopecia)అంటారు. 

27

2018 లో నిర్వహించిన పరిశోధనల ప్రకారం.. భారతదేశంలో 18-35 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులలో 47.6 శాతం మంది బట్టతలతో బాధపడుతున్నారు. ఆండ్రోజెనెటిక్ అలోపేసియా వల్ల తలలోని కొన్ని భాగాల్లో జుట్టు రాలడం మొదలవుతుంది.  ఆ భాగంలో వెంట్రుకలు రావు. ఇటీవల హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్లు కొంతమంది పురుషులలో జుట్టు రాలడానికి కారణాన్ని పేర్కొన్నారు.  పురుషుల్లో అకాల జుట్టు రాలడానికి ఒక అలవాటు కారణమని పేర్కొంటున్నారు.

37

పురుషుల జుట్టు రాలడానికి కారణం ఇదే:  హస్త ప్రయోగం ఎక్కువగా చేసే పురుషులు తమ జుట్టును త్వరగా కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి, విటమిన్ ఎ స్పెర్మ్ లో కనిపిస్తుంది. ఈ విటమిన్ జుట్టుకు కూడా చాలా ముఖ్యం. నిరంతరం హస్తప్రయోగం చేస్తూ, ఎక్కువ సేపు హస్త ప్రయోగం చేస్తే అది జుట్టు రాలడానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

47

జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

57

జుట్టు మరీ ఎక్కువగా రాలిపోతుంటే విటమిన్ ఎ లోపం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొదట విటమిన్ ఎ లోపాన్ని భర్తీ చేయండి. జుట్టు రాలడాన్ని నివారించడానికి అనేక విటమిన్లు తీసుకోవాలి. వాటిలో విటమిన్ ఎ కూడా ఒకటి. వీటితో పాటు విటమిన్ బి, విటమిన్ డి, విటమిన్ ఇ ఉన్న ఆహారాలను కూడా ఆహారంలో చేర్చుకోవాలి. జింక్, ఐరన్, సెలీనియం కూడా జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడతాయి.

67

అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం.. ఒక వ్యక్తి ప్రతిరోజూ 50-100 వెంట్రుకలను కోల్పోవడం సాధారణ విషయం. ప్రతి హెయిర్ ఫోలికల్ ఒక చక్రం గుండా వెళుతుంది. మొదటి దశ అనాజెన్. దీనిలో వెంట్రుకలు పెరుగుతాయి. రెండవది టెలోజెన్ దశ. ఈ సమయంలో జుట్టు రాలడం మొదలవుతుంది. జుట్టు రాలడం,పెరుగుదలలో ఈ చక్రం చురుగ్గా కొనసాగుతుంది. పాత వెంట్రుకలు రాలడంతో పాటుగా కొత్త వెంట్రుకలు కూడా వస్తూనే ఉంటాయి. చాలా మంది ఆరోగ్యకరమైన వ్యక్తులు వారి తలపై 80,000 నుంచి 120,000 వెంట్రుకలు కలిగి ఉంటారు.

77

ఒత్తైన జుట్టుకు రహస్యం: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జుట్టు బలంగా ఉండేందుకు మీ ఆహారంలో విటమిన్లు, ఖనిజాల ఎక్కువగా ఉండాలి. ఐరన్, విటమిన్ బి5 జుట్టు సన్నబడటాన్ని నివారిస్తాయి. అలాగే మాడును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు బలంగా, కాంతివంతంగా ఉండేందుకు ప్రోటీన్ చాలా అవసరం. అంతేకాదు వాతావరణ సమస్యల కారణంగా కూడా జుట్టు నాణ్యత దెబ్బతింటుంది. ఇదీ కాకుండా కొంతమందికి, జుట్టు రాలడం వారసత్వంగా కూడా వస్తుంది. తల బట్టతల రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కారణాన్ని ముందుగానే గుర్తించి చికిత్స చేస్తే వెంట్రుకలు రాలడాన్నినివారించవచ్చు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved