Eyebrows: పార్లర్ కి వెళ్లి ఐబ్రోస్ చేయించుకుంటున్నారా? HIV రావచ్చు జాగ్రత్త..!
థ్రెడ్డింగ్ కి ఎక్కువ సమయం పట్టదు. తక్కువ ఖరీదు కాబట్టి.. అందరూ అదే ఆప్షన్ ఎంచుకుంటూ ఉంటారు. కానీ, దీని వల్ల వచ్చే సమస్యను మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఐబ్రోస్ చేయించుకుంటున్నారా?
అందంగా కనిపించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. దానికోసం చాలా మంది బ్యూటీ పార్లర్ ల వెంట పరుగులు తీస్తూ ఉంటారు. వేలకు వేలు ఖర్చు పెట్టి ఫేషియల్స్, గ్లో అప్ సెషన్స్ చేయించుకోకపోయినా.. కనీసం ఐబ్రోస్ అయినా రెగ్యులర్ గా చేయించుకునేవారు చాలా మంది ఉంటారు. ఐబ్రోస్ మంచి షేపులో ఉంటే.. ముఖం మంచిగా, అందంగా కనపడుతుంది. ఇక వాటిని షేప్ లో ఉంచుకోవడానికి ఎక్కువ మంది థ్రెడ్డింగ్ చేయించుకుంటూ ఉంటారు. థ్రెడ్డింగ్ కి ఎక్కువ సమయం పట్టదు. తక్కువ ఖరీదు కాబట్టి.. అందరూ అదే ఆప్షన్ ఎంచుకుంటూ ఉంటారు. కానీ, దీని వల్ల వచ్చే సమస్యను మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ థ్రెడ్డింగ్ తో ఊహించని ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు.
నిపుణులు ఏం చెబుతున్నారు..?
నిపుణుల హెచ్చరికల ప్రకారం.. థ్రెడ్డింగ్ చేయించుకోవడం వల్ల హెపటైటిస్-బి, హెచ్ఐవీ లాంటివి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అసలు.. థ్రెడ్డింగ్ తో ఇవి ఎలా వస్తాయి అనే అనే అనుమానం మీకు రావచ్చు. కానీ, వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. చాలా పర్లర్ లలో ఒకరికి వాడిన థ్రెడ్ నే.. మరొకరికి వాడుతూ ఉంటారు. దీని వల్ల ఒకరి నుంచి మరొకరికి వైరస్ పాకే అవకాశం ఉంది.
హెచ్ఐవీ వస్తుందా?
ఐబ్రోస్ చేసే సమయంలో చర్మంపై చిన్న గాయాలు, కోసులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఉపయోగించే పరికరాలు లేదా థ్రెడ్ శుభ్రంగా లేకపోతే, పూర్వంలో దానిని ఉపయోగించిన వ్యక్తికి హెపటైటిస్-బి లేదా హెచ్ఐవీ వంటి రక్తం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఉంటే, వాటి వైరస్‌లు ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుంది. అయితే, ఈ ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, హెచ్ఐవీ వైరస్ బయట వాతావరణంలో ఎక్కువసేపు బతికేది కాదు. కానీ హెపటైటిస్-బి వైరస్ మాత్రం కొంతకాలం వరకు ఉపరితలాలపై జీవిస్తుంది. కాబట్టి బ్యూటీ పార్లర్‌లో శానిటైజేషన్, పరికరాల శుభ్రత అత్యంత ముఖ్యం.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
భద్రత కోసం, థ్రెడ్డింగ్ లేదా ఐబ్రోస్ షేపింగ్ చేయించుకునే ముందు, వారు కొత్త లేదా శుభ్రపరిచిన పరికరాలు, కొత్త థ్రెడ్ ఉపయోగిస్తున్నారో లేదో చూసుకోవాలి. అవసరమైతే, మీ స్వంత థ్రెడ్ లేదా పరికరాలు తీసుకెళ్లడం మంచిది. అందంగా కనిపించడం ఎంత ముఖ్యమో... ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంతకంటే ముఖ్యం. కాబట్టి శుభ్రత, భద్రతా చర్యలపై రాజీపడకండి.