MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Second Heart: శరీరంలో ఈ అవయవం మన రెండవ గుండె.. కాపాడుకోకపోతే మొదటి గుండెకు కష్టమే

Second Heart: శరీరంలో ఈ అవయవం మన రెండవ గుండె.. కాపాడుకోకపోతే మొదటి గుండెకు కష్టమే

శరీరంలో గుండె ఎంతో ముఖ్యమైనదని అందరికీ తెలుసు. గుండె ఆరోగ్యం క్షీణిస్తే శరీరం మొత్తం కూలబడిపోతుంది. అలాగే మన శరీరంలో రెండవ గుండెగా పిలుచుకునే భాగం కాళ్లలో ఉండే ‘కాఫ్ మజిల్స్’. దీన్నే దూడ కండరం అని కూడా పిలుస్తారు. 

2 Min read
Haritha Chappa
Published : Sep 01 2025, 02:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రెండవ గుండె ఇదే
Image Credit : Istock

రెండవ గుండె ఇదే

మన శరీరంలో ఎన్ని గుండెలు ఉంటాయి? అని అడిగితే అందరూ ఒకటే అని చెబుతారు. కానీ వైద్య పరంగా మాత్రం మనకి రెండు గుండెలు. ఒక గుండె ఛాతీకి దగ్గరలో ఉంటే మరొకటి కాలికి దగ్గరలో ఉంటుంది. కాలులో ఉండే కాఫ్ మజిల్స్ ని రెండవ గుండే అని పిలుచుకుంటారు. వైద్యులు చెబుతున్న ప్రకారం కాలిలో ఉన్న కాఫ్ మజిల్స్ లేదా దూడ కండరాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకుంటే మన అసలైన గుండె కూడా ప్రమాదంలో పడుతుంది. కాఫ్ మజిల్స్ కు గుండెకు ఎంతో అనుబంధం ఉంది.

24
కండరాలకు గుండెకు ఏమిటి సంబంధం?
Image Credit : Pixabay

కండరాలకు గుండెకు ఏమిటి సంబంధం?

కాలిలో ఉన్న దూడ కండరాలను ఏదైనా సమస్య మొదలైతే ఛాతీలో ఉన్న అసలైన గుండెకు కూడా పెద్ద సమస్య వచ్చి పడుతుంది. అందుకే దూడ కండరాలను జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ కండరాలు రక్తప్రసరణలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అందుకే వీటిని కూడా గుండెతో సమానంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. మనం అడుగు వేసినప్పుడల్లా కండరాలు సంకోచించి రక్తాన్ని ఛాతీ దగ్గరున్న గుండె వైపుకు వెళ్లేలా నెట్టివేస్తాయి. దూడ కండరాలు కాళ్ల వైపుగా వచ్చిన రక్తప్రసరణను తిరిగి గుండె వైపుగా పంపించడానికి సహాయపడతాయి. అలాగే రక్తం గడ్డ కట్టకుండా కూడా అడ్డుకుంటాయి.

Related Articles

Related image1
40 ఏండ్లు దాటిన తర్వాత గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయాల్సిందే
34
కాఫ్ మజిల్స్ సరిగా పనిచేయకపోతే
Image Credit : Pixabay

కాఫ్ మజిల్స్ సరిగా పనిచేయకపోతే

కాళ్లలో ఉన్న దూడ కండరాలు బలహీనపడితే పాదాల వైపుగా వచ్చే రక్తం గుండె వైపుకు తిరిగి పంపడం కష్టం అయిపోతుంది. అలాంటప్పుడు గుండెకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. గుండె మరింతగా ఎక్కువగా పంప్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల దానిపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. అక్కడ ఇన్ష్లమేషన్ కూడా రావచ్చు. రక్తపోటు కూడా పెరిగిపోవచ్చు. అలాంటి సమయంలో గుండెకు సమస్యలు వస్తాయి. గుండె ఆగిపోయే ప్రమాదం పెరుగుతుంది. దీన్ని మందులతో నయం చేయడం కూడా కష్టం.

44
ఏం చేయాలి?
Image Credit : Pixabay

ఏం చేయాలి?

కాలిలో ఉన్న కాఫ్ మజిల్స్ సరిగా పనిచేయకపోతే గుండెకు ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసుకున్నారు కదా.. అందుకే ఆ కండరాలను బలోపేతం చేయడానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గంటల తరబడి కూర్చోవడం వంటి పనులు చేయకూడదు. ఆధునిక జీవనశైలి వల్ల చాలామంది గంటలు తరబడి కూర్చుంటున్నారు. అప్పుడప్పుడు లేచి నడుస్తూ ఉండాలి. మెట్లు ఎక్కడం, దిగడం వంటివి చేయాలి. లేకుంటే దూడ కండరాలు బలహీనంగా మారి గుండెను కూడా ప్రభావితం చేస్తాయి. దానివల్ల గుండె కూడా బలహీనంగా మారవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మాత్రం మరచిపోవద్దు. మన మొదటి గుండెను కాపాడుకోవాలంటే రెండో గుండెను రక్షించుకోవాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఆరోగ్యం
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved