MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Beauty Tips: కొత్తిమీరతో అందమైన ముఖం మీ సొంతం.. ఓసారి ట్రై చేయండిలా?

Beauty Tips: కొత్తిమీరతో అందమైన ముఖం మీ సొంతం.. ఓసారి ట్రై చేయండిలా?

Beauty Tips: కొత్తిమీరను తింటేనే కాదు శరీరానికి పూసుకున్నా అందము, ఆరోగ్యము. కొత్తిమీరతో ముఖ వర్చస్సు రెట్టింపు అవుతుందంట. అది ఎలాగో.. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం. 

2 Min read
Author : Navya G
Published : Jun 27 2023, 10:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కొత్తిమీర జీర్ణ క్రియ సమంగా జరిగేందుకు ఎంత ఉపయోగపడుతుందో అందాన్ని రెట్టింపు చేయడానికి కూడా అంతే తోడ్పడుతుంది. కొత్తిమీర లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీసెప్టిక్ గుణాలు ముఖానికి రక్షణ కల్పిస్తాయి ముడతలను పోగొట్టడతాయి.

26

దాంతోపాటు చర్మం మరింత కాంతివంతంగా కనిపించడానికి కొత్తిమీర ఉపయోగపడుతుంది. మీ చర్మం పొడిగా ఉన్న జిడ్డుగా ఉన్న లేదా రెండింటి మిశ్రమం అయినా కూడా ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీరను నమలటం మంచిది. కొత్తిమీర రసం మొటిమలు, పిగ్మెంటేషన్, బ్లాక్ హెడ్స్ కి ఉత్తమ నివారణ.
 

36

 కొత్తిమీర తామర చికిత్సకు కూడా  ఉపయోగిస్తారు. కొత్తిమీర లో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మానికి చాలా మంచిది. కొత్తిమీర రసం, కొంచెం పాలు, తేనె మరియు నిమ్మరసంతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఈ మిశ్రమాలన్నింటినీ సమపాళ్లల్లో కలిపి ఫేస్ కి  అంతా అప్లై చేయండి.
 

46

కాసేపు ఆరిన తర్వాత శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోండి. మీ మొహంలో వచ్చిన మార్పు మీకే ఆశ్చర్యంగా ఉంటుంది. కొత్తిమీరను మొహానికి పూయటం వల్ల చర్మం వృద్ధాప్యానికి దారి తీసే ఆక్సీకరణ ఒత్తిడి నుంచి ముఖాన్ని కాపాడుతుంది. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన అవి ఫ్రీ రాడికల్స్ కదలికకు వ్యతిరేకంగా పోరాడుతాయి.
 

56

ఇది వృద్ధాప్య ప్రక్రియను మందగించేలాగా చేస్తుంది. దీనికోసం ఏం చేయాలో చూద్దాం. ఒక గిన్నెలో కొత్తిమీర రసం మరియు కలబంద  వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని  ముఖమంతా అప్లై చేసి కొద్దిసేపు ఆరనివ్వండి. చర్మంపై సన్నని గీతలు మరియు ముడతలు లాంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది.
 

66

ఇంకా కొత్తిమీర మొటిమలు తగ్గించడానికి మృదువైన చర్మం కోసం కూడా  చాలా బాగా పనిచేస్తుంది. ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు కొత్తిమీర రసం పెదవులపై అప్లై  చేసి ఉదయం గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవడం వల్ల పెదవుల నలుపు తగ్గి మంచి రంగుని సంతరించుకుంటాయి. ప్రతిరోజు కొత్తిమీర రసం తాగితే రక్తహీనత తగ్గించడంతోపాటు కొలెస్ట్రాల్ ను కూడా నివారిస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Period Pain: పీరియడ్స్ లో నొప్పిని లైట్ తీసుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే
Recommended image2
Meenakari Anklets: పాదాలకు రాయల్ లుక్ ఇచ్చే మీనాకారి పట్టీలు
Recommended image3
Okra Farming: ఈ ఒక్క దాంతో ఇంట్లోనే బెండకాయ తోటే వేసేయొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved