Flipkart Diwali Sale: అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫోన్లు, వీటి ధర రూ.15000 కన్నా తక్కువ
దీపావళి పండుగ వచ్చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ (Flipkart Diwali Sale) ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.15,000 లోపు మంచి ఫీచర్లు ఉన్న ఫోన్లు అమ్మకానికి ఉన్నాయి.

ఫ్లిప్ కార్ట్ దీపావళి సేల్
ఫ్లిప్‌కార్ట్ దీపావళికి "బిగ్ దీపావళి సేల్"తో ముందుకు వచ్చింది. ఇందులో కస్టమర్లకు భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్‌లో ఫోన్లపై ఉత్తమ ఆఫర్లను అందించారు. రూ.15,000 లోపు లభించే ఫోన్లపై భారీ ఆఫర్లు ఉన్నాయి. మీరు కొత్త ఫోన్ కొనాలనుకుంటే ఇదే మంచి సమయం. ఏ ఫోన్లపై ఆఫర్లు ఉన్నాయో తెలుసుకోండి.
Realme P4 5G
రియల్‌మీ P4 5G ఉత్తమమైన ఫోన్. శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో ఇది వస్తుంది. దీనిలో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7,000mAh బ్యాటరీ, 50MP AI కెమెరా ఉన్నాయి. ICICI కార్డ్ ఉపయోగించి కొంటే మీకు ఇది ₹15,000 లోపు ధరకే లభిస్తుంది.
Motorola G96
మోటరోలా ఫోన్లు ఎంతో మంది ఫేవరేట్. మోటరోలా G96 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనిలో 6.67-అంగుళాల pOLED డిస్‌ప్లే ఉంటుంది. 50MP కెమెరాతో వస్తుంది. SBI కార్డుతో కొంటే ఇది ₹15,000 లోపే లభిస్తుంది.
Samsung Galaxy F36 5G
శాంసంగ్ గెలాక్సీ ఫోన్లు అంటే చాలా మందికి ఇష్టం. శాంసంగ గెలాక్సీ F36 5G ఫోన్… ఎక్సినోస్ 1380 ప్రాసెసర్‌తో వస్తుంది. దీనిలో 6.7-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్ల ఉంటుంది. OISతో 50MP కెమెరా తో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ SBI కార్డ్‌తో దీన్ని కొంటే రూ.15,000 లోపు ధరకే లభిస్తుంది.
Nothing Phone 2 Pro
నథింగ్ ఫోన్లు ఇప్పుడు కొత్త ట్రెండ్. CMF ఫోన్ 2 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో 5G చిప్‌సెట్‌తో వస్తుంది. దీనిలో 6.77-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీ ఉన్నాయి. SBI కార్డ్ ఆఫర్‌తో దీని ధర చాలా వరకు తగ్గుతుంది.