Curly Hair: కర్లీ హెయిర్ ఉన్నవారు రాత్రిపూట ఇవి పెడితే ఉదయానికల్లా స్మూత్ గా, మెరిసిపోతుంది
Curly Hair: కర్లీ హెయిర్ ను మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఈ వెంట్రుకలు చిక్కులు ఎక్కువగా పడతాయి. అలాగే బాగా డ్రై అవుతుంది. మరి కర్లీ హెయిర్ ను ఎలా మెయింటైన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

కర్లీ హెయిర్
కర్లీ హెయిర్ చాలా అందంగా ఉంటుంది. ఈ హెయిర్ ఉన్నవారు ఎలాంటి హెయిర్ స్టైల్స్ వేసుకోకపోయినా అందంగా ఉంటారు. ఈ జుట్టుకున్న ప్రత్యేకతే అది. కానీ ఈ జుట్టును మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఈ వెంట్రుకలు ఎక్కువ చిక్కులు పడతాయి. అలాగే ఎప్పుడూ డ్రైగానే ఉంటాయి. వీటికి తేమ చాలా అవసరం. కర్లీ హెయిర్ విషయంలో జాగ్రత్తగా లేకపోతే హెయిర్ ఊడిపోతుంది.అయితే రాత్రిపూట కొన్ని హెయిర్ మాస్క్ లను వేసుకుంటే వెంట్రుకలకు మంచి పోషణ అందుతుంది. దీంతో ఉదయానికల్లా జుట్టు స్మూత్ గా, మెరుస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కర్లీ జుట్టుకు హెయిర్ మాస్క్ లు
కొబ్బరి నూనె, కలబంద గుజ్జు
కర్లీ జుట్టుకు కొబ్బరి నూనె, కలబంద గుజ్జు బాగా సహాయపడతాయి. ఈ హెయిర్ మాస్క్ కర్లీ హెయిర్ ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తయారుచేయడానికి రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనెలో రెండు టీ స్పూన్ల కలబంద జెల్ ను వేసి బాగా కలపండి. దీన్ని జుట్టుకు పట్టిచండి. ఈ హెయిర్ మాస్క్ వల్ల జుట్టు తేమగా ఉంటుంది. అలాగే జుట్టు గరుకుతనం కూడా తగ్గుతుంది.
తేనె, పెరుగు
తేనె, పెరుగు హెయిర్ మాస్క్ కర్లీ జుట్టుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ హెయిర్ మాస్క్ ను తయారుచేయడానికి రెండు టీస్పూన్ల ఫ్రెష్ పెరుగులో టీ స్పూన్ తేనెను వేసి బాగా కలపండి. ఈ హెయిర్ మాస్క్ డ్రై హెయిర్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలోని తేనె వెంట్రుకలకు నేచురల్ మెరుపును ఇస్తే.. పెరుగు జుట్టును స్మూత్ గా చేస్తుంది.
ఆలివ్ ఆయిల్, అరటిపండు
ఈ హెయిర్ మాస్క్ ను తయారుచేయడానికి బాగా పండిన ఒక అరటిని మెత్తగా చేసి అందులో టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి జుట్టుకు పట్టిస్తే సరిపోతుంది. దీనిలోని అరటిపండు జుట్టుకు ఫైబర్స్ ను అందించి స్మూత్ గా చేస్తుంది. ఇక ఆలివ్ ఆయిల్ జుట్టుకు అవసరమైన తేమను అందిస్తుంది.
మెంతులు, పెరుగు
జుట్టును బలంగా చేయడానికి మెంతులు, పెరుగు హెయిర్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం టీ స్పూన్ మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మెత్తగా రుబ్బుకోవాలి. దీనిలో రెండు టీస్పూన్ల పెరుగును వేసి కలిపి జుట్టుకు పెట్టుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ వల్ల జుట్టు బలంగా అయ్యి నెత్తి హెల్తీగా ఉంటుంది. అలాగే వెంట్రుకలు మంచి షైనింగ్ వస్తాయి. వెంట్రుకలు రాలడం కూడా తగ్గుతుంది. ది.
కొబ్బరి పాలు, అవొకాడో
కొబ్బరి పాలు, అవొకాడో కూడా కర్లీ హెయిర్ ఉన్నవారికి ప్రయోజకరంగా ఉంటాయి. ఇందుకోసం బాగా పండిని ఒక అవొకాడోను మెత్తగా రుబ్బుకుని అందులో రెండు టీస్పూన్ల కొబ్బరి పాలను పోసి కలపండి. ఈ హెయిర్ మాస్క్ న వాడటం వల్ల పొడి జుట్టు బాధ తగ్గుతుంది. అలాగే జుట్టు స్మూత్ గా అయ్యి అందంగా మెరుస్తుంది.
హెయిర్ మాస్క్ లను ఎలా ఉపయోగించాలి?
కర్లీ హెయిర్ ఉన్నవారు ఈ హెయిర్ మాస్క్ లను రాత్రిపూట పెట్టుకోవాలి. వీటిని జుట్టుకు పెట్టిన తర్వాత మెత్తని కాటన్ క్లాత్ లేదా షవర్ క్యాప్ ను పెట్టుకోవాలి. ఉదయం తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ హెయిర్ మాస్క్ లను వారానికి ఒకటిరెండు సార్లు ఉపయోగించొచ్చు.