మీ ముఖాన్ని మెరిపించే సహజ సౌందర్య సాధనాలు ఇవే....
బ్యూటీ ప్రొడక్ట్స్ లోని రసాయనాలు మీ చర్మానికి దీర్ఘకాలంలో హానికరంగా మారతాయి. అందుకే వీలైనంత వరకు సహజసిద్దమైన సౌందర్య ఉత్పత్తులను వాడడం మంచిది.
బ్యూటీ ప్రొడక్ట్స్ లోని రసాయనాలు మీ చర్మానికి దీర్ఘకాలంలో హానికరంగా మారతాయి. అందుకే వీలైనంత వరకు సహజసిద్దమైన సౌందర్య ఉత్పత్తులను వాడడం మంచిది.
అలాంటివి చాలా సులభంగా దొరకడమే కాకుండా... మీ స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటాయి.
కొబ్బరినూనె : ఇది చాలా తక్కువ ధరలో లభించే అద్భుతమైన మాయిశ్చరైజర్.
అలోవెరా : డ్రై స్కిన్ తో ఇబ్బందిపడుతున్నట్లైతే.. తాజా అలోవిరా జెల్ ను రాసుకోవడం వల్ల మీ ముఖానికి కావాల్సిన తేమ లభిస్తుంది.
aloe vera
గ్రీన్ టీ : వృద్ధాప్య ఛాయలను అరికట్టే అద్భుతమైన మెడిసిన్ గ్రీన్ టీ. దీన్ని తాగొచ్చు.. లేదా మొహానికి రాసుకోవడం వల్ల మీరు మరింత యవ్వనంగా కనబడతారు.
ఓట్స్ : శరీరంలో మంటలు, వేడిని తగ్గిస్తుంది. అందుకే ఓట్స్ ను పొడి చేసి దీన్ని ముమం మీద రోజూ రాసుకుంటే మంచిది.
oats
పసుపు : మేనిఛాయ మెరవాలన్నా, నల్లటి మచ్చలు పోవాలన్నా మంచి ఉపాయం పసుపును వాడడమే.
కీరా దోసకాయ : సహజంగా చల్లదనాన్నించే పదార్థం. ఎండకు నల్లబడిన చర్మానికి ఉపశమనం ఇవ్వడానికి కీరాను ఉపయోగించవచ్చు.
amla
ఉసిరి : రోజూ ఉసిరి తినడం లేదా జ్యూస్ తాగడం వల్ల అద్భుతమైన చర్మకాంతి సొంతమవుతుంది.
lemon
నిమ్మకాయ : మంచి బ్లీచ్ సాధనం. రోజూ కొన్ని చుక్కల నిమ్మరసాన్ని మొహానికి రాసుకోవడం వల్ల ముఖం మీది వెంట్రుకలు కలర్ తగ్గి ముఖకాంతి పెరుగుతుంది.
lemon