MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Bathing: స్నానం చేసే నీటిలో ఇది చిటికెడు వేస్తే...మీ స్కిన్ పై జరిగే మ్యాజిక్ ఇదే..!

Bathing: స్నానం చేసే నీటిలో ఇది చిటికెడు వేస్తే...మీ స్కిన్ పై జరిగే మ్యాజిక్ ఇదే..!

Bathing: మీ చర్మం అందంగా మెరిసిపోవాలని ఉందా? అయితే, నార్మల్ నీటితో కాకుండా... ఒక మ్యాజిక్ పొడి కలిపిన నీటితో స్నానం చేస్తే చాలు..మీ స్కిన్ సమస్యలన్నీ తగ్గిపోవడంతో పాటు... యవ్వనంగా మెరిసిపోతారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 24 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Bath
Image Credit : Getty

Bath

బేకింగ్ సోడాను మనం చాలా రకాల వంటల్లో వాడుతూనే ఉంటాం. ఎక్కువ మంది ఇడ్లీ, గారెలు లాంటివి తయారు చేసేటప్పడు పిండిలో ఈ బేకింగ్ సోడా కలపుతారు. ఈ బేకింగ్ సోడా చిటికెడు వేసినా.. అవి బాగా పొంగుతాయి. రుచిని కూడా పెంచుతాయి. ఇదే బేకింగ్ సోడా మీ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ముఖ సౌందర్యం విషయానికి వస్తే, ఇది సహజమైన ఎక్స్ ఫోలియేటర్ గా పని చేస్తుంది. మరి... ఈ బేకింగ్ సోడాను... స్నానం చేసే నీటిలో చిటికెడు వేసి.. ఆ నీటితో స్నానం చేస్తే.. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
 స్కిన్ ఇన్ఫెక్షన్లు, దురద నుంచి ఉపశమనం...
Image Credit : stockPhoto

స్కిన్ ఇన్ఫెక్షన్లు, దురద నుంచి ఉపశమనం...

ఒక బకెట్ నీటిలో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా కలిపి ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. ఎండాకాలంలో వచ్చే దురద, చిరాకు లాంటివి తగ్గిపోతాయి. ముఖ్యంగా బేకింగ్ సోడా చర్మం పీహెచ్ స్థాయిని బ్యాలెన్ చేసి.. చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తుంది.

డెడ్ స్కిన్ తొలగిస్తుంది...

గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడా కలిపి స్నానం చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. దీని వల్ల చర్మం మృదువుగా మారుతుంది. రెగ్యులర్ గా ఇలా చేయడం వల్ల చర్మం మెరుస్తూ, కాంతివంతంగా మారుతుంది.

తామర సమస్యలు...

చాలా మందికి చర్మంపై తామర వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటికి.. ఖరీదైన క్రీములు అవసరం లేకుండా.. బేకింగ్ సోడా చాలా సమర్థవంతంగా పని చేస్తుంది. దురదను తగ్గించి ఉపశమనం కలిగిస్తుంది.

సోరియాసిస్ సమస్యలు ఉన్నవారికి...

నీటిలో బేకింగ్ సోడా కలిపి స్నానం చేయడం వల్ల సోరియాసిస్ ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది. దీనికి యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉంటాయి. ఇవి సోరియాసిస్ వల్ల వచ్చే దురదను తగ్గిస్తాయి.

Related Articles

Related image1
Railway Rules: టికెట్ తీసుకున్న తర్వాత రైలు మిస్ అయితే ఏం చేయాలి? రిఫండ్ వస్తుందా?
Related image2
Snake Finder APP: మీ ఫోన్ లో ఈ యాప్ ఉంటే...చుట్టుపక్కల ఎక్కడ పాము ఉన్నా ఈజీగా కనిపెట్టొచ్చు..!
33
బేకింగ్ సోడాను ఎలా ఉపయోగించాలి..?
Image Credit : Getty

బేకింగ్ సోడాను ఎలా ఉపయోగించాలి..?

స్నానపు నీటిలో బేకింగ్ సోడాను ఎల్లప్పుడూ తక్కువ పరిమాణంలోనే ఉపయోగించాలి. సాధారణంగా ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో ఒకటి నుంచి రెండు టీ స్పూన్ల బేకంగ్ సోడా వాడితే సరిపోతుంది. బేకింగ్ సోడా నీటిలో పూర్తిగా కరిగిన తర్వాత మాత్రమే స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత చర్మాన్ని తేమగా ఉంచడానికి మాయిశ్చరైజర్ రాయడం మర్చిపోవద్దు.

బేకింగ్ సోడా వాడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

బేకింగ్ సోడా మీ చర్మానికి సరిపోతుందో లేదో అని పరీక్షించిన తర్వాతే ఉపయోగించాలి. దీని కోసం, కొద్దిగా బేకింగ్ సోడా తీసుకొని చర్మానికి రాయాలి. కాసేపు అలానే వదిలేయాలి. ఎలాంటి అలెర్జీ రాకపోతే... దానిని ఉపయోగించాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
జుట్టుకు నూనె రాస్తున్నారా? ఈ తప్పులు చేస్తే జుట్టు పెరగడం కాదు రాలుతుంది
Recommended image2
రోజూ ఒక పెగ్ ఆల్కహాల్ తాగితే గుండెకు మంచిదా? అసలు నిజమేంటి?
Recommended image3
Milk at Night: రాత్రి పడుకునే ముందు పాలు తాగితే నిజంగా నిద్ర బాగా పడుతుందా?
Related Stories
Recommended image1
Railway Rules: టికెట్ తీసుకున్న తర్వాత రైలు మిస్ అయితే ఏం చేయాలి? రిఫండ్ వస్తుందా?
Recommended image2
Snake Finder APP: మీ ఫోన్ లో ఈ యాప్ ఉంటే...చుట్టుపక్కల ఎక్కడ పాము ఉన్నా ఈజీగా కనిపెట్టొచ్చు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved