MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మీ జుట్టుకు ఎప్పుడైనా దానిమ్మ నూనెను ట్రై చేశారా? దీనితో ఎన్ని లాభాలున్నాయో..!

మీ జుట్టుకు ఎప్పుడైనా దానిమ్మ నూనెను ట్రై చేశారా? దీనితో ఎన్ని లాభాలున్నాయో..!

దానిమ్మ గింజలను తింటే ఎన్నో లాభాలు కలుగుతాయన్న సంగతి చాలా మందికి తెలుసు. కానీ దానిమ్మ నూనె గురించే చాలా మందికి తెలియదు. నిజానికి దానిమ్మ నూనె మన వెంట్రుకలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.  

2 Min read
Mahesh Rajamoni
Published : Sep 08 2023, 02:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
hair care

hair care

చాలా మంది జుట్టు ఆరోగ్యం కోసం రకరకాల నూనెలను ట్రై చేస్తుంటారు. మార్కెట్ లోకి వచ్చిన ప్రతి కొత్తరకం హెయిర్ ఆయిల్ ను ట్రై చేసేవారున్నారు. ఏదేమైనా జుట్టు పొడుగ్గా, నల్లగా నిగనిగలాడాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. అయితే ఇందుకోసం దానిమ్మ నూనె మీకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అవును మీ జుట్టుకు దానిమ్మ నూనెను వాడటం వల్ల జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. అలాగే నల్లగా ఉంటుంది. జుట్టు ఊడిపోయే ప్రమాదం కూడా తప్పుతుంది. మరి జుట్టుకు దానిమ్మ నూనె ఎలా ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

26

హెయిర్ ఫోలికల్స్ ను ప్రేరేపిస్తుంది

దానిమ్మ గింజల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ నూనెను నెత్తికి అప్లై చేయడం వల్ల మీ నెత్తిమీద రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో మీ జుట్టు కుదుళ్లకు మంచి పోషణ అందుతుంది. అలాగే మీ జుట్టు కూడా బాగా పెరుగుతుంది. 
 

36

జుట్టును బలోపేతం చేస్తుంది

ఈ దానిమ్మ గింజల నూనెలో ప్యూనిక్ యాసిడ్ తో పాటుగా ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి మీ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. అలాగే మీ జుట్టు తెగిపోకుండా కాపాడుతాయి. ఈ నూనెను వాడితే మీ జుట్టు దెబ్బతినే అవకాశం చాలా తక్కువ. అంతేకాకుండా ఈ నూనె మీ జుట్టు బలంగా, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. 
 

46
Image: Getty

Image: Getty

చుండ్రును తగ్గిస్తుంది

దానిమ్మ గింజల నూనెలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మీ నెత్తి మీద ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాకుండా చుండ్రును తగ్గించడానికి కూడా  సహాయపడుతుంది. జుట్టు పెరగాలన్నా, జుట్టు రాలకూడదన్నా నెత్తిమీద చుండ్రు ఉండకూడదు. 
 

56
Image: Getty

Image: Getty

కాంతివంతంగా చేస్తుంది

దానిమ్మ గింజల నూనె ఒక సహజ ఎమోలియెంట్. అంతే ఈ నూనె మీ జుట్టును తేమగా ఉంచుతుంది. అలాగే మృదువుగా, సిల్కీగా చేస్తుంది. ఈ నూనెను వాడితే మీ జుట్టు అందంగా మెరుస్తుంది. 
 

66
Image: Getty

Image: Getty

పర్యావరణ కాలుష్యం నుంచి రక్షణ

దానిమ్మ గింజల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జుట్టును యూవీ కిరణాలు, పర్యావరణ కాలుష్య కారకాల నుంచి రక్షిస్తాయి. జుట్టును హానికరమైన ప్రభావాల నుంచి కాపాడటానికి దానిమ్మ నూనె మీకెంతో సహాయపడుతుంది. ఈ నూనెను వాడితే మీ జుట్టు సన్నబడే అవకాశమే ఉండదు. అలాగే జున్న రాలే ఛాన్స్ కూడా తగ్గుతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సౌందర్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Garuda Puranam: జీవితంలో ఈ పనులు చేయకపోతే భయంకర శిక్షలు తప్పవంటున్న గరుడ పురాణం
Recommended image2
Health: చాయ్‌తో వీటిని క‌లిపి తింటున్నారా.? తీవ్ర స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు
Recommended image3
Healthy Winter Food: చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి? తింటే ఏం జరుగుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved