ఉల్లిపాయను ఈ విధంగా వాడితే మీ ముఖం, జుట్టు అందంగా కనిపిస్తాయి
ఉల్లిపాయ చర్మ సంరక్షణకు, జుట్టు సమస్యలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. ఉల్లిపాయను కొన్ని విధాలుగా వాడితే ముఖ సమస్యలతో పాటుగా జుట్టు సమస్యలు కూడా తగ్గిపోతాయి.

ఇండియాలో చాలా మంది ఉల్లిపాయలు లేకుండా కూరలు చేయనే చేయరు. నిజానికి ఉల్లిపాయలు కూరల టేస్ట్ ను బాగా పెంచుతాయి. అంతేకాదు ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఉల్లిపాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది.
onion
ఉల్లిపాయలు చర్మ సంరక్షణకు, జుట్టు సంరక్షణకు కూడా ఎంతో సహాయపడతాయి. ఉల్లిపాయ రసంలో సల్ఫర్ ఎక్కువగా ఉండే సైటోకెమికల్స్ కూడా ఉంటాయి. ఇది మన చర్మాన్ని యవ్వనంగా కనిపించడానికి సహాయపడుతుంది. దీని కోసం మీరు ప్రతిరోజూ మీ శరీరానికి ఉల్లిపాయ రసాన్ని పూయడం అలవాటు చేసుకోవచ్చు. ఉల్లిపాయలలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖంపై ఉన్న చర్మ కణాలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
ఉల్లిపాయ రసం కూడా ముఖంపై మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను సమర్థవంతంగా తగ్గించడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం ఉల్లిపాయ రసాన్ని ముఖానికి మసాజ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ రసంలో నిమ్మరసం లేదా పెరుగు మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేసుకోవాలి. ఇది చర్మం మెరిసిపోవడానికి ఎంతో సహాయపడుతుంది.
ఉల్లిపాయ చర్మానికే కాదు జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉల్లిపాయ రసంలో ఉండే పదార్థాలు జుట్టును బాగా పెంచేందుకు సహాయపడతాయి. ఇవి నెత్తిమీద చుండ్రును రాకుండా చేస్తాయి. కాబట్టి ఉల్లిపాయ రసాన్ని తలకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. చుండ్రు తొలగిపోతుంది. దీంతో మీ జుట్టు జుట్టు బాగా పెరుతుంది. ఇందుకోసం ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ రసాన్ని మీ జుట్టు, నెత్తిమీద అప్లై చేయాలి.