తిన్న వెంటనే చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటే ఈ వ్యాధులు తగ్గిపోతాయి..
చక్కెర కంటే బెల్లమే మన ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చాలా మంది బెల్లాన్ని అసలే తినరు. ఏమన్నా.. చక్కెరనే ఎక్కువగా తింటుంటారు. కానీ అన్నం తిన్న వెంటనే చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని చప్పరిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు నయమవుతాయి.

నిజానికి చక్కెర మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. దీనివల్ల బరువు పెరగడంతో పాటుగా రక్తంలో చక్కెర స్థాయిలు దారుణంగా పెరుగుతాయి. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే చక్కెరకు బదులు బెల్లం తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బెల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది. బెల్లంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలో రక్తం లోపం రాకుండా ఉండటానికి సహాయపడుతుంది. దీనిలో కేలరీలు, ప్రోటీన్, మంచి కొవ్వు, కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలు, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.
ఊపిరితిత్తుల సమస్యలు
బెల్లం ఊపిరితిత్తులు, గొంతు, కడుపు, ప్రేగులను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. కాలుష్యం కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు తమ ఆహారంలో బెల్లం చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే అలర్జీలు, చర్మ సమస్యలతో బాధపడేవారికి కూడా బెల్లం ప్రయోజనకరంగా ఉంటుంది.
రక్తహీనతను నిరోధిస్తుంది
బెల్లం ఇనుముకు మంచి వనరు. ఇది శరీరంలో రక్తం ఏర్పడటానికి సహాయపడుతుంది. అలాగే కండరాల కణాలను నిర్మించడానికి ఇనుము ఎంతో ఉపయోగపడుతుంది. మీరు తినే ఆహారంలో తగినంత ఇనుమును లేకపోతే.. శరీరంలో ఇనుము లోపం రక్తహీనతకు గురయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల ఏకాగ్రత దెబ్బతింటుంంది. అలసట కలుగుతుంది. కండరాల బలహీనతకు గురవుతాయి. ఇలాంటి వారు బెల్లాన్ని క్రమం తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఐరన్ లోపం పోతుంది. దీంతో రక్తహీనత ప్రమాదం తగ్గుతుంది.
శ్వాసకోశ సమస్యల నివారణ
తరచుగా శ్వాసనాళ సమస్యలతో బాధపడేవారికి బెల్లం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం బెల్లంతో పాటు నల్ల మిరియాలు, తులసి, శొంఠి లేదా నువ్వులతో కలిపి తీసుకోవడం మంచిది.
<p>jaggery</p>
శరీరానికి శక్తిని ఇస్తుంది
బెల్లం మన శరీరానికి నెమ్మదిగా శక్తినిస్తుంది. కానీ ఇది ఎక్కువ కాలం ఉంటుంది. దీనికి కారణం దీన్ని శుద్ధి చేయబడకపోవడమే. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే మారకుండా చూస్తుంది. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలు క్రమంగా పెరగడాన్ని నిరోధిస్తుంది. ఇది అలసటను నివారించడానికి కూడా సహాయపడుతుంది.
<p>jaggery</p>
పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం
పీరియడ్స్ నొప్పి భరించలేని విధంగా ఉంటుంది. అయితే బెల్లం తింటే పీరియడ్స్ వల్ల కలిగే తిమ్మిరి, నొప్పి తగ్గుతుంది. బెల్లం తీసుకోవడం వల్ల ఎండార్ఫిన్లు అనే హ్యాపీ హార్మోన్ విడుదలవుతుంది. ఇది చిరాకు, ఆహార కోరికలు, బలహీనత వంటి పిఎమ్ఎస్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా బెల్లం తీసుకోవడం కూడా పీరియడ్స్ మిస్ అయ్యే అవకాశమే ఉండదు.