కొబ్బరి నూనె కాదు.. కొబ్బరి నీరు కూడా జుట్టు రాలకుండా చేస్తుంది.. దీన్ని ఎలా ఉపయోగించాలంటే?
కొబ్బరి నూనెతో జుట్టుకు ఎన్ని లాభాలున్నాయో చాలా మందికి తెలుసు. కానీ జుట్టుకు కూడా కొబ్బరి నీరు ఉపయోగపడుతుందన్న సంగతి మాత్రం చాలా మందికి తెలియదు.
Photo Courtesy: Getty
కొబ్బరి నీటిని తాగితే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే చర్మం తేమగా ఉంటుంది. ఈ నీళ్లు మన శరీరంలో వాటర్ లోపాన్ని పోగొడుతాయి. అంతేకాదు ఈ కొబ్బరి నీటిలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ వాటర్ ఎన్నో వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే మీకు పోషణను కూడా ఇస్తాయి. అందుకే కొబ్బరి నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటాయి. అయితే కొబ్బరి నీళ్లు మన శరీర ఆరోగ్యానికే కాదు జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అవును కొబ్బరి నీళ్లను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం ఆగుతుంది. చుండ్రు తగ్గిపోతాయి. అంతేకాదు మీ జుట్టు సిల్కీగా మారుతుంది కూడా.
కొబ్బరి నీళ్ల వల్ల కలిగే ప్రయోజనాలు
నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (ఎన్సీబీఐ) నివేదిక ప్రకారం.. కొబ్బరి నీటిలో 94-96% నీరు ఉంటుంది. అలాగే ఈ వాటర్ లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ సి లు కొబ్బరి నీటిలో పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నీటిని తాగడం వల్ల మన శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే మన శరీరానికి అవసరమైన పొటాషియం కూడా అందుతుంది. ఈ నీటిని తాగితే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మన రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఈ వాటర్ చర్మం, జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.
hair fall
జుట్టుకు కొబ్బరి నీటి ప్రయోజనాలు
జుట్టు రాలడం తగ్గుతుంది
కొబ్బరి నీళ్లలో పొటాషియంతో పాటుగా ఎన్నో రకాల పోషకాలుంటాయి.దీనిలో ఉండే పొటాషియం జుట్టు పెరిగేందుకు సహాయపడుతుంది. అలాగే కొత్త జుట్టు పెరిగేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు ఇది జుట్టును బలోపేతం చేస్తుంది. జుట్టు రాలే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
చుండ్రును తొలగిస్తుంది
కొబ్బరి నీటిని జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు పూర్తిగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిలో జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే మీ నెత్తిని తేమగా ఉంచుతుంది. కొబ్బరి నీటిలో పొటాషియం, ఐరన్, విటమిన్ సి వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే నెత్తిమీద చుండ్రు లేకుండా చేస్తాయి.
Image: Getty
బట్టతలకు దూరంగా
కొబ్బరి నీళ్లలో ఉండే ఫోలిక్ యాసిడ్ జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఫోలిక్ ఆమ్లం అనేది ఒక రకమైన బి-విటమిన్. ఇది మన జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం.ఈ ఫోలిక్ యాసిడ్ జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇది జుట్టు రాలడాన్ని బాగా తగ్గిస్తుంది. కొబ్బరి నీళ్లలో ఉండే ఫోలిక్ యాసిడ్ మీకు బట్టతల వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Image: Getty
నెత్తి ఆరోగ్యంగా
కొబ్బరి నీరు మన నెత్తిని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో నెత్తి, జుట్టుకు అవసరమైన విటమిన్ సి, విటమిన్ ఇ, బి-విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ మూలకాలన్నీ నెత్తిని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి. అంతేకాదు ఈ కొబ్బరి నీరు ఎన్నో జుట్టు సమస్యలను తగ్గిస్తాయి.
Image: Getty
జుట్టుకు కొబ్బరి నీటిని ఎలా ఉపయోగించాలి?
షాంపూతో కలిపి
కొబ్బరి నీటిని మీ జుట్టుకు పెట్టడానికి మీ రోజువారీ షాంపూలో కలపడం. అవును ఇందుకోసం మీరు సగం కొబ్బరినీళ్లను తీసుకుని షాంపూ సీసాలో మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయండి. కొబ్బరి నీరు మీ జుట్టును తేమగా మార్చడానికి సహాయపడుతుంది. అంతేకాదు దీనివల్ల మీ జుట్టు సిల్కీగా, హెల్తీగా కనిపిస్తుంది.
కండీషనర్ గా
అవును కొబ్బరి నీటిని కండీషనర్ గా కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం మీ రోజువారీ కండీషనర్ ను ఉపయోగించిన తర్వాత కొబ్బరి నీటిని జుట్టుకు అప్లై చేసి 2-3 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత కడగండి.
నేరుగా అప్లై చేయొచ్చు
కొబ్బరి నీటిని మీ జుట్టుకు నేరుగా కూడా అప్లై చేయొచ్చు. దీన్ని 20-30 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత జుట్టును కడగండి. దీంతో మీ జుట్టు తేమగా ఉంటుంది. పోషణ కూడా అందుతుంది.