MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Weight loss: వావ్.. దాల్చిన చెక్కతో తొందరగా బరువు తగ్గుతారా.. !

Weight loss: వావ్.. దాల్చిన చెక్కతో తొందరగా బరువు తగ్గుతారా.. !

weight loss: ఓవర్ వెయిట్ నుంచి బయటపడేందుకు ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలను చేసే వారు చాలానే ఉన్నారు. అయితే మీ వంటింట్లో లభించే ఈ మసాలా దినుసుతో సులభంగా బరువు తగ్గొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.  

2 Min read
Mahesh Rajamoni
Published : May 17 2022, 01:42 PM IST| Updated : May 17 2022, 01:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

వయసుకు తగ్గ వెయిట్ ఉంటేనే ఒక వ్యక్తి  అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటాడు. కానీ నేడు చాలా మంది వయసుకు మించిన  శరీర  బరువుతో బాధపడుతున్నారు. అధిక బరువు ఎన్నో ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అందుకే దీనినుంచి వీలైనంత తొందరగా బయటపడాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

28

మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, నిద్రలేమి, శారీరక శ్రమ లేకపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల ఒంట్లో కొవ్వు విపరీతంగా పెరిగిపోతుంది. 

38

బరువు పెరిగితే హార్ట్ ప్రాబ్లమ్స్, ఊబకాయం, టైప్  2 డయాబెటీస్, అధిక రక్తపోటు వంటి ప్రమాదకరమైన సమస్యల బారిన పడాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ బరువు తగ్గేందుకు స్పెషల్ డైట్, ఎక్సర్ సైజెస్ చేస్తుంటారు. అయితే అధిక బరువు నుంచి బయటపడేందుకు ప్రతి వంటింట్లో లభించే మసాలా దినుసు అయినా దాల్చిన చెక్క ఔషదంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

48

జీర్ణం సాఫీగా అవుతుంది.. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. ఇవి పొట్టను పరిశుభ్రంగా ఉంచుతాయి. అంతేకాదు చెడు బ్యాక్టీరియాను సైతం నాశనం చేస్తాయి. దీంతో Digestive system శుభ్రపడుతుంది. తద్వారా మీరు తీసుకున్న ఆహారం త్వరగా అరుగుతుంది. దీంతో మీరు బరువు సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాదు ఇది మిమ్మల్ని బరువు పెరగకుండా కాపాడుతుంది. దాల్చిన చెక్కలో మన శరీరంలో వేడిని పెంచే గుణం కలిగి ఉంటుంది. దీంతో జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇవి మీ శరీరంలోని అదనపు కొవ్వులను కరిగిస్తుంది. 

58

షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో.. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినా కొవ్వు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాగా దాల్చిన చెక్కలో షుగర్ లెవెల్స్ ను నియంత్రించే లక్షణాలుంటాయి. అంతేకాదు ఇది మీ శరీరంలో అదనంగా కొవ్వులను పేరుకుపోకుండా మిమ్మల్ని కాపాడుతుంది. దాల్చిన చెక్కలో క్రోమియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది.
 

68

ఇలా తీసుకోండి.. ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు నీటిని పోసి బాగా మరిగించుకోండి. ఆ తర్వాత నీళ్లలో చిన్న దాల్చిన ముక్కలను రెండు వేయండి. ఇవి బాగా మరిగిన తర్వాత.. స్టవ్ ఆఫ్ చేసి వడకట్టండి. దీనిలో టీ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. ఈ పానీయాన్ని ఉదయం ఖాళీకడున గానీ లేదా రాత్రి పడుకునే ముందుగాని తాగండి. ఇలా రెగ్యులర్ గా చేస్తే వెంటనే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. 

78

దాల్చిన చెక్క పౌడర్ కూడా బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఇందుకోసం దాల్చిన చెక్కను పౌడర్ గా  చేసుకుని స్మూతీలలో లేదా జ్యూస్ గా చేసుకుని తీసుకున్నా చక్కటి ఫలితం ఉంటుంది. 

88

మరీ ఎక్కువగా వద్దు.. మన ఆరోగ్యానికి ఏవి మంచిచేస్తాయన్నా.. వెనకా ముందు ఆలోచించకుండా ఎక్కువగా తీసుకునే వారు చాలా మందే ఉన్నారు. ఆరోగ్యానికి మేలు చేసేవే అయినా మోతాదుకు మించితే.. మాత్రం ఎన్నో సమస్యలను కలిగిస్తాయి. అలాగే దాల్చిన చెక్కను కూడా పరిమితిగానే తీసుకోండి. లేదంటే ఇది శరీరంలో వేడిని విపరీతంగా పెంచేస్తుంది. రోజుకు 5 గ్రాముల దాల్చిన చెక్కను తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved