Beauty Tips: బ్రౌన్ షుగర్ తో మెరిసే చర్మం.. ఇంట్లోనే పార్లర్ మెరుపు కావాలంటే ఇలా చేయండి!
Beauty Tips: బ్రౌన్ షుగర్ వంటల్లోనే కాదు సౌందర్య సాధనంగా కూడా బాగా ఉపయోగపడుతుందని చాలామందికి తెలియదు వీటితో తయారు చేసే స్క్రబ్స్ చర్మానికి కాంతిని తీసుకువస్తాయి. ఆ స్క్రబ్స్ ఎలా చేయాలో చూద్దాం.

బ్రౌన్ షుగర్ హానికరమైన ఫ్రీ రాడికల్స్ ని తొలగిస్తుంది దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని నిర్వహిస్తాయి. అలాగే ఇందులో ఉండే హైడ్రాక్సీ ఆసిడ్స్ చర్మం లోకి చొచ్చుకుపోయి కణాల పునరుత్పత్తి మరియు పునరుద్యోనాన్ని ప్రోత్సహిస్తుంది.
ఇది మీ చర్మాన్ని దెబ్బతీయకుండా ఎక్స్పోజిట్ చేస్తుంది. దానివలన మీ చర్మం పొడిగా అనిపించకుండా మృదువుగా కాంతివంతంగా కనిపిస్తుంది. ఒక కప్పులో కొంచెం బ్రౌన్ షుగర్, కొంచెం కొబ్బరి నూనె కలిపి ముఖానికి అప్లై చేయండి. పది నిమిషాల పాటు వృత్తాకార కదలికలో స్క్రబ్ చేయండి.
తర్వాత చల్లని నీటితో కడగటం వలన మొటిమల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఒక టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్, ఒక టేబుల్ స్పూన్ ముడి తేనె, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి అప్లై చేసి సున్నితంగా పది నిమిషాల పాటు మసాజ్ చేయడం వలన చర్మంపై ముడతలు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది.
అలాగే ఒక కప్పు బ్రౌన్ షుగర్, ఒక టీ స్పూన్ వనిల్లాసారం, ఒక హాఫ్ కప్పు ఆలివ్ ఆయిల్, ఒక టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్. వీటన్నింటినీ కలిపి చర్మానికి స్క్రబ్ లాగా ఉపయోగించండి.
ఆ తరువాత పది నిమిషాల సేపు అలాగే నుంచి తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కుంటే ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఈ ఆయిల్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
అయితే బ్రౌన్ షుగర్ తో కూడిన ఈ స్క్రబ్స్ ని ప్రతిరోజు కాకుండా వారానికి మూడు నాలుగు సార్లు మాత్రమే ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అంతే కాకుండా పార్లల్లో వేలు పోసి చేయించుకునే ఫేస్ మసాజ్ ల కన్నా ఇంట్లోనే బ్రౌన్ షుగర్ తో చేసుకున్న ఈ మసాజ్ లు ముఖాన్ని మరింత ప్రకాశవంతంగా చేస్తాయి.