MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • స్నానం చేయడానికి ముందు బొడ్డుకు నెయ్యి రాస్తే ఏమౌతుందో తెలుసా?

స్నానం చేయడానికి ముందు బొడ్డుకు నెయ్యి రాస్తే ఏమౌతుందో తెలుసా?

ఆయుర్వేదం ప్రకారం.. శరీరానికి శక్తి కేంద్రంగా బొడ్డును భావిస్తారు. ఇలాంటి బొడ్డుకు స్నానం చేయడానికి ముందు నెయ్యిని రాయడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. 

2 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Oct 29 2024, 04:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఆయుర్వేదం ప్రకారం..  బొడ్డు శరీరానికి శక్తి కేంద్రంగా పరిగణించబడుతుంది. అయితే బొడ్డుకు రోజూ నెయ్యిని రాయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల ముప్పు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. నెయ్యిలో విటమిన్ -ఇ, విటమిన్ -ఎ, విటమిన్ -డి, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా చర్మం కూడా హెల్తీగా ఉంటుంది. అసలు స్నానం చేయడానికి ముందు బొడ్డుకు నూనెను రాయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

24

చర్మానికి పోషణ 

స్నానం చేయడానికి ముందు బొడ్డుకు నెయ్యిని రాయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే? ఇది మన చర్మాన్ని తేమగా ఉంచుతుంది. చర్మం పొడిబారడాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఇలా చేయడం వల్ల మీ చర్మం ఎప్పుడే ప్రకాశవంతంగా ఉంటుంది. 

మెరుగైన జీర్ణక్రియ

ఆయుర్వేదం ప్రకారం.. నాభిని జీర్ణక్రియ ప్రదేశంగా పరిగణిస్తారు. కాబట్టి ఈ ప్రదేశంలో నెయ్యిని రాయడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్లను సక్రియం చేస్తుంది. అలాగే జీర్ణ సమస్యలు తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

34

మలబద్ధకం 

స్నానానికి ముందు బొడ్డుకు నెయ్యిని రాయడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందుకోసం నాభిలో 2-3 చుక్కల నెయ్యిని వేసి కొద్దిసేపు మసాజ్ చేయండి. నాభిలో నెయ్యి వేయడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలబద్దకంతో పాటుగా జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. 
 

44

కీళ్ల నొప్పి

కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఇది చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. బొడ్డులో నెయ్యిని వేయడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందుకోసం ముందుగా బొడ్డులో కొన్ని చుక్కల నెయ్యి వేసి నాభి చుట్టూ మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు తొలగిపోతాయి. వాపు కూడా చాలా వరకు తగ్గుతుంది. 

వాత దోషం సమతుల్యంగా ఉంటుంది

ఆయుర్వేదం ప్రకారం.. బొడ్డుకు నెయ్యిని పూయడం వల్ల వాత దోషం తగ్గిపోతుంది. వాతం అసమతుల్యత ఉన్నప్పుడు మీ జీర్ణవ్యవస్థలో ఆందోళన, చంచలత, రుగ్మతలు వస్తాయి. అయితే ఈ సమస్యను తగ్గించడానికి నెయ్యి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. బొడ్డులో నెయ్యిని వేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ మనసు స్థిరంగా ఉంటుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mint Plant: చిన్న కుండీలో గుత్తులుగుత్తులుగా పుదీనా పెంచండిలా
Recommended image2
Dandruff: తలలో చండ్రు ఎక్కువగా ఉందా? వీటితో వదిలించండి
Recommended image3
Rashmika Diet: రష్మికకు ఈ కూరలంటే అస్సలు నచ్చవు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved