Beauty Tips: అందాన్ని పెంచే ఆహార పదార్థాలు ఇవే..
Beauty Tips: కొన్ని రకాల ఆహార పదార్థాలతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా పెరుగుతుంది. అవేంటంటే..

Beauty Tips: మనం బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే పోషకవిలువలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. అయితే మనం తీసుకునే కొన్ని రకాల ఆహార పదర్థాలు చర్మం మెరిసేలా చేస్తాయి. వాటితో ఆరోగ్యమే కాదు అందం కూడా రెట్టింపు అవుతుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి..
అవకాడో.. అవకాడో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన నూనెలు మెండుగా ఉంటాయి. ఇవి చర్మకణాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
బాదం.. ప్రతి రోజు కొన్ని బాదంపప్పులను తినడం వల్ల మనకు ఎన్నో పోషకాలు అందుతాయి. ఈ పప్పుల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది మన చర్మాన్ని సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుంది.
గ్రీన్ టీ.. ప్రతిరోజూ గ్రీన్ టీ తాగితే బరువు నియంత్రణలో ఉంటుందన్న ముచ్చట మనందరికీ ఎరుకే.. అయితే ఈ గ్రీన్ టీ తాగడం వల్ల ముఖంపై ఉండే గీతలు, ముడతలు కూడా ఇట్టే తగ్గిపోతాయి. అంతేకాదు దీనిలో ఫ్రీరాడికల్స్ ను తొలగించే గుణముంటుంది. చర్మాన్ని కూడా రక్షిస్తుంది.
ಕ್ಯಾರೆಟ್ನಲ್ಲಿರುವ ಪೊಟ್ಯಾಸಿಯಮ್ ಚರ್ಮದ ಕೋಶಗಳನ್ನು ಹೈಡ್ರೀಕರಿಸುತ್ತದೆ ಮತ್ತು ಆರ್ಧ್ರಕಗೊಳಿಸುತ್ತದೆ.
క్యారెట్లు.. క్యారెట్లలో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. చర్మాన్ని వదులుగా, దృఢంగా, సాఫ్ట్ గా చేసే కొల్లాజెన్ ప్రోటీన్ తయారీకి క్యారెట్ లో ఉండే విటమిన్ సి ఎంతో ఉపయోగపడుతుంది.
పాలకూర.. పాలకూర మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతాయి. అలాగే చర్మం కూడా నిగారించేలా చేస్తుంది. రక్తహీనత సమస్యకు చెక్ పెట్టేందుకు ఇందులో ఉండే ఐరన్ సహాయపడుతుంది.