చలికాలంలో పెదాలు పగులుతున్నాయా? ఇలా చేశారంటే మీ పెదాలు అందంగా, ఆరోగ్యం ఉంటాయి
పెదవులు అందంగా, మృదువుగా కనిపించాలంటే లిప్ స్టిక్ నే వాడక్కర్లేదు. కానీ వాతావరణం మారుతున్న కొద్దీ మన పెదాలు పగులుతుంటాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్యను సులువుగా తగ్గించుకోవచ్చు. అదెలాగో ఓ లుక్కేద్దాం పదండి.
chapped lips
చలికాలంలోని చల్లని గాలుల వల్ల మన పెదాలు తరచుగా పగులుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లైతే పగుళ్ల నుంచి రక్తం కూడా కారుతూ ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ ట్రిక్స్ ను పాటిస్తే మాత్రం చలికాలంలో కూడా మీ పెదాలు మరింత అందంగా కనిస్తాయి. అస్సలు పగలనేపగలవు. అలాగే లిప్ స్టిక్ లేకుండా మీ పెదాలు అందంగా కనిపిస్తాయి. కూడా.
chapped lips
ముఖానికి అసలైన అందం మన పెదవులతోనే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇవి ఎండిపోయి పగుళ్లు వస్తే మాత్రం ఎంత లిప్ స్టిక్ పెట్టుకున్నా అస్సలు అందంగా కనిపించవు. అందుకే మారుతున్న వాతావరణంలో మీ పెదాలను మృదువుగా, అందంగా ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
chapped lips
గోరువెచ్చని నూనె మసాజ్
గోరువెచ్చని నూనె కూడా మన పెదాలను అందంగా, పగలకుండా చేస్తుంది. చలికాలంలో వేడి నూనెతో పెదాలను మసాజ్ చేయడం వల్ల మీ పెదవులు మృదువుగా మారుతాయి. అలాగే పొడిబారే అవకాశమే ఉండదు. పగుళ్ల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
chapped lips
కొబ్బరినూనె, తేనె
కొబ్బరినూనె, తేనె కలిపిన మిశ్రమం కూడా పగుళ్లను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం దీన్ని తయారుచేసి పగిలిన పెదవులపై అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ హోం రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అలాగే మీ పెదాలు కూడా అందంగా కనిపిస్తాయి.
వేడినీళ్లు తాగడం
వేడినీళ్లు కూడా పెదాల పగుళ్లను తగ్గించేందుకు సహాయపడతాయి. ఇందుకోసం రోజూ వేడినీళ్లను తాగాలి. వేడినీళ్లు పెదాలను అందంగా మార్చడమే కాదు మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కూడా. వేడినీళ్లు మీ శరీర ఉష్ణోగ్రతను నార్మల్ గా ఉంచుతాయి. అలాగే మీ శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. దీంతో మీ పెదాలు పగలనేపగలవు.
రోజ్ వాటర్, ఐస్
రోజ్ వాటర్ ను ఐస్ లో మిక్స్ చేసి.. ఈ ఐస్ ను పగిలిన పెదవులపై ఉంచండి. దీంతో పగుళ్లు తగ్గిపోతాయి. ఒకవేళ పగుళ్ల నుంచి రక్తస్రావం వస్తున్నట్టైతే ఈ చిట్కాతో గాయం త్వరగా నయమవుతుంది.
పుదీనా ఆకుల రసం
పుదీనా ఆకుల రసం కూడా పగిలిన పెదాలను తగ్గిస్తుంది. పెదాల పగుళ్లను తగ్గించుకోవడానికి పుదీనా ఆకుల రసాన్ని తీసుకుని పగిలిన పెదాలకు అప్లై చేయండి. దీనివల్ల పెదాలు చల్లగా మారుతాయి. నిజానికి పుదీనా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.