ఫేషియల్ చేయించుకోవాలనుకుంటున్నారా? ఈ తప్పులు మాత్రం చేయకండి
ముఖాన్ని మరింత అందంగా మార్చడానికి ఫేషియల్ చేయించుకుంటారు. అయితే ఫేషియల్ తో మీరు అందంగా కనిపించాలంటే.. దీనికి ముందు ఆ తర్వాత కొన్ని తప్పులను చేయకూడదు. ఆ తప్పులపు గనుక చేస్తే మీ ముఖం డ్రైగా మారుతుంది. అలాగే చర్మం కూడా దెబ్బతింటుంది. ఇంతకీ ఎలాంటి తప్పులు చేయకూడదంటే?
మీ ముఖం మరింత కాంతివంతంగా, అందంగా కనిపించాలంటే.. మీరు చేయాల్సిన మొదటి పని.. హెల్తీ ఫుడ్ ను బాగా తినడం, కంటినిండా నిద్రపోవడం, నీళ్లను తాగడం, రెగ్యులర్ గా కాసేపు వ్యాయామం చేయడం. అవును ఇవి మీ సహజ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడతాయి. అయితే పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఈ రొటీన్ ను ఫాలో అవ్వడం కుదరదు. ఇలాంటి సమయంలో మీరు అందంగా కనిపించడానికి ఫేషియల్స్ ను చేయించుకోవచ్చు. ఇది మీ ముఖాన్ని వెంటనే అందంగా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఫేషియల్స్ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మీ శ్రమ, డబ్బు అంతా వృధా అవుతుంది. అందుకే చలికాలంలో ఫేషియల్ చేయించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
క్లెన్సింగ్
క్లెన్సింగ్ మన చర్మంపై ఉన్న మురికి, దుమ్మును పోగొడుతుంది. చలికాలంలో ఫేషియల్స్ సమయంలో దీనిని అస్సలు స్కిప్ చేయకూడదు. ఎందుకంటే ఇది చర్మాన్ని మెరుగుపరుస్తుంది. ఇది చర్మానికి నేచురల్ ఆయిల్ తో పాటు మెరిసేలా చేస్తుంది.
స్క్రబ్ లను ఎక్కువగా ఉపయోగించడం
వారానికి ఒకటి లేదా రెండు సార్లు ముఖాన్ని స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేకానీ రోజూ స్క్రబ్బింగ్ చేయకండి. అలాగే చేతులతో నెమ్మదిగా స్క్రబ్ చేయండి. అలాగే ఎక్కువసేపు దీన్ని చేయొద్దు. లేకపోతే చర్మం పొడిబారుతుంది.
పీల్ ఆఫ్ మాస్క్ ఉపయోగించడం
చలికాలంలో ఫేషియల్స్ సమయంలో పీల్ ఆఫ్ మాస్క్ లను ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇవి ఈ సీజన్ లో చర్మం పొడిబారడాన్ని పెంచుతాయి. అలాగే ఇది చర్మంపై దురదను కలిగిస్తుంది. చర్మాన్ని ఎర్రగా చేస్తుంది. అందుకే వీటికి బదులుగా మాయిశ్చరైజింగ్ ఫేస్ మాస్క్ లేదా ఫేస్ ప్యాక్ ఉపయోగించండి.
గోరువెచ్చని నీటితో కడగడం
ఏ సీజన్ లోనైనా గోరువెచ్చని నీటిలో ముఖాన్ని కడుక్కోవడం మంచిది కాదు. చాలా మంది చలికాలంలో వేడినీటితోనే ముఖాన్ని కడుగుతుంటారు. కానీ ఇది మీ చర్మం పొడిబారేలా చేస్తుంది. అలాగే చర్మంలోని నేచురల్ ఆయిల్ ను కూడా తగ్గిస్తుంది. ఇది మీ ముఖాన్ని నీరసంగా చేస్తుంది.
మాయిశ్చరైజర్ ఉపయోగించకపోవడం
ఫేషియల్స్ తర్వాత చాలా మంది మాయిశ్చరైజర్ ను ఉపయోగించరు. కానీ ఫేషియల్ తర్వాత కూడా మాయిశ్చరైజన్ ను ఖచ్చితంగా ఉపయోగించండి. ఎందుకంటే ఫేషియల్ తర్వాత చర్మానికి కొంచెం ఎక్కువ తేమ అవసరం. ఇందుకోసం మీరు క్రీమ్ లేదా సాధారణ కొబ్బరి నూనెను కూడా ఉపయోగించొచ్చు.