Beauti Tips: అందంగా కనిపించాలంటే ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి..
Beauti Tips: అందంగా కనిపించాలని కోరుకోని వారు ఎవరూ ఉండరేమో కదా.. ఇక అందులు అమ్మాయిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నలుగురిలో తామే అందంగా కనిపించాలని రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కానీ వీళ్లు కామన్ గా చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల అందం మరింత తగ్గే ప్రమాదం ఉంది.

Beauti Tips: అమ్మాయిలైనా.. అబ్బాయిలైనా.. నలుగురిలో అందంగా కనిపించాలని ఆశపడుతుంటారు. అందులో అమ్మాయిలు అందరిలో తామే అందంగా కనిపించాలని రకరకాల చిట్కాలను ఫాలో అవుతుంటారు. ఈ ప్రాసెస్ లో చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల ఉన్న అందం కూడా తగ్గే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
আমলকি ও নারকেল তেল
కొన్ని రకాల అలవాట్ల వల్ల ఉన్న అందం కూడా తగ్గే ప్రమాదముంది. ఇవి కూడా మిస్టేక్స్ యేనా అని మీరు అనుకోవచ్చు, కానీ మనకు చిన్నవిగా అనిపించే వాటితోనే ఎక్కువగా ముప్పు ఉంటుందన్న సంగతిని మీరు మర్చిపోకూడదు. మరి ఆ మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం పదండి..
రాత్రి పడుకునేటప్పుడు తప్పనిసరిగా ఫేస్ ను క్లీన్ చేయాలని బ్యూటీషియన్లు సలహానిస్తుంటారు. అయితే అలసట కారణంగా చాలా మంది రాత్రి పూట ముఖాన్ని అస్సలు కడగరు. ఎటెటో తిరగడం వల్లే ఫేస్ పై డస్ట్, క్రిమి కిటకాలు పట్టుకుని ఉంటాయి. అలాంటప్పుడు ఫేస్ ను వాష్ చేయకుండా అలాగే పడుకుంటే మీ చర్మం హానికి గురవుతుంది. అంతేకాదు దీనివల్ల మీ ముఖం అందవిహీనంగా, జీవం లేనట్టుగా తయారవుతుంది.
అందంగా మెరిసిపోవడానికి నీళ్లు కూడా ఎంతో సహాయపడతాయి. అవును శరీరానికి తగినన్ని నీళ్లను ప్రతిరోజూ తాగడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది. అదే నీళ్లు సరిగ్గా తాగని వారి స్కిన్ డ్రై అవుతుంది. అంతేకాదు చర్మం బిగ్గరగా, దురద వంటి సమస్యలు వస్తాయి. ఇవన్నీ మీ బాడీ డీ హైడ్రేషన్ కు గురికావడం వల్లే వస్తాయి. కాబట్టి మీ శరీరానికి అవసరమైన నీళ్లను తాగుతూ ఉండాలి. అప్పుడే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉంటారు.
బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ ను స్కిన్ కు అప్లై చేసుకోవాలి. లేదంటే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సన్ స్క్రీన్ లోషన్ లో టైటానియం ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్ వటివి ఉంటాయి. ఇవి హానీకరమైన సూర్య కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.
ప్రతిరోజూ మార్నింగ్ వాకింగ్, వ్యాయామాలు, ధ్యానం, యోగా వంటివి చేయడం ద్వారా కూడా నిత్య యవ్వనంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.