బాత్ రూం నీట్ గా ఉన్నా.. దుర్వాసన వస్తోందా? ఇలా చేస్తే అస్సలు రాదు
చాలా సార్లు బాత్ రూం చాలా శుభ్రంగా కనిపిస్తుంటుంది. కానీ దానిలోంచి మాత్రం దుర్వాసన వస్తుంటుంది.అయితే ఒక్క చిట్కాతో ఈ దుర్వాసన రాకుండా చేయొచ్చు. అదేంటంటే?

ఆడవాళ్లు ఇంటిని ప్రతిరోజూ క్లీన్ చేస్తుంటారు. ఎక్కడా ఏ వాసనా రానీయరు. ఎక్కడ మురికిగా అనిపించినా ఇంటిని మొత్తం సర్ది క్లీన్ చేస్తుంటారు. కానీ బాత్ రూం విషయంలో మాత్రం ఇలా ఉండదు. బాత్ రూం ని సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల ఇది మురికిగా, దుర్వాసన వస్తుంటుంది. అయితే కొంతమంది ఇంట్లో బాత్ రూం చూడటానికి నీట్ గా కనిపిస్తుంది. కానీ దుర్వాసన మాత్రం వెదజల్లుతుంటుంది.
ఎంత కడిగినా ఇలాగే వస్తుందని చాలా మంది చెప్తుంటారు. ఇక ఈ వాసనను పూర్తిగా పోగొట్టడానికి మార్కెట్ లో రకరకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. కానీ వీటివల్ల దుర్వాసన ఎక్కువ రోజులు రాకుండా ఉండదు. అయితే మీరు ఒక చిన్న పనిచేస్తే మాత్రం ఎలాంటి ప్రొడక్ట్స్ వాడకుండానే బాత్ రూం దుర్వాసనను ఈజీగా పోగొట్టొచ్చు. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
బాత్ రూం దుర్వాసనకు గల కారణాలు:
స్నానం చేసే గదిలో దుర్వాసన రావడానికి అసలు కారణం టాయిలెట్, షవర్ ఒకే గదిలో పక్క పక్కనే ఉండటం, అలాగే స్నానపు తొట్టి కూడా ఇందుకు ఒక కారణమే. స్నానపు తొట్టిలో బూజు పడితే ఖచ్చితంగా దుర్వాసన వస్తుంది. అలాగే కొన్ని కొన్ని సార్లు టాయిలెట్‌లో ఎక్కువ తడిగా ఉన్నా, తడి ఆరకపోయినా దుర్వాసర రావడం స్టార్ట్ అవుతుంది.
బాత్ రూంలో వాసన రాకుండా ఉండేందుకు చిట్కాలు:
క్రిమిసంహారిణి:
స్నానం చేసే గదిలో దుర్వాసన రాకుండా ఉండేందుకు క్రిమిసంహారిణి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం దీనితో బాత్ రూం ను రోజుకు ఒక్కసారైనా తుడవండి. లేదా స్ప్రే చేసినా సరిపోతుంది. ఇలా గనుక చేస్తే బాత్ రూం నుంచి అస్సలు వాసన రాదు.
సహజ సువాసన ద్రవ్యాలు:
మార్కెట్లో ఎన్నో రకాల సహజ సువాసన ద్రవ్యాలు దొరుకుతాయి. వీటిని మీరు టాయిలెట్, బాత్ రూం లో పెట్టొచ్చు.ఇవి దుర్వాసనను పోగొట్టి సువాసనను వెదజల్లుతాయి. అలాగే టాయిలెట్ రోల్, బ్లీచ్ ను వాడితే కూడా బాత్ రూంలో వాసన రాకుండా ఉంటుంది.
వినెగర్ & నిమ్మరసం:
వెనిగర్, నిమ్మరసంతో కూడా మీరు బాత్ రూంలో దుర్వాసన రాకుండా చేయొచ్చు. స్నానం చేసే గదిలో దుర్వాసన వస్తుంటే కొన్ని చుక్కల వెనిగర్, నిమ్మరసాన్ని మిక్స్ చేసి స్ప్రే చేయండి. అలాగే బాత్ రూం గోడలపై తేమ ఉంటే వాటిని వెంటనే సరిచేయండి. ఎందుకంటే తడి గోడల వల్ల కూడా వాసన వస్తుంది.
బేకింగ్ సోడా:
బేకింగ్ సోడా దుర్వాసనను పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా దీన్ని ఒక స్ప్రే బాటిల్‌లో నింపి బాత్ రూం మొత్తం స్ప్రే చేస్తే సరి. కావాలనుకుంటే మీరు దీనిలో నిమ్మరసం కూడా కలపొచ్చు. ఇది వాసన రాకుండా చేస్తుంది.
లవంగాలు:
లవంగాలతో కూడా బాత్ రూంలో దుర్వాసన పూర్తిగా పోతుంది. లవంగాల ఘాటైన వాసన దుర్వాసను పోగొడుతుంది. ఇందుకోసం కొన్ని లవంగాలను బాత్ రూంలో ఉంచండి. దీనివల్ల బాత్ రూంలో దుర్వాసన ఆగిపోయి లవంగాల వాసన వస్తుంది.
- బాత్ రూం లో దుర్వాసన రాకుండా ఉండాలంటే ఆ రూంలో గాలి ప్రసరణ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఫ్రెష్ గాలి లోపలికి వచ్చి దుర్వాసన గాలి బయలకు వెళ్లే మార్గం లేకపోతే బాత్ రూంలో మీరు ఏం చేసినా దుర్వాసన వస్తుంది.
- అలాగే బాత్ రూంలో వాడే నీళ్లు సరిగ్గా డ్రైనేజీలోకి వెళ్లేలా చూసుకోవాలి. ఒకవేళ ఈ మురుగునీరు నిలిచిపోతే దుర్వాసన వస్తుంది. అలాగే బాత్ రూం మొత్తం క్రిములు వ్యాపిస్తాయి. అందుకే డ్రైనేజీని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి క్రిమిసంహారక మందులను స్ప్రే చేయాలి.
- బాత్ రూంని వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా కడగాలి. దీంతో బాత్ రూంలో దుర్వాసన రాకుండా ఉంటుంది.