పాలలో ఈ ఆకులను మిక్స్ చేసి తాగితే కిడ్నీల్లో రాళ్లేంటి.. ఎన్నో జబ్బులు తగ్గిపోతాయి..
పాలు సంపూర్ణ ఆహారం. దీనిలో తులసి ఆకులను మరిగించి తాగితే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

పాలు సంపూర్ణ ఆహారం. దీనిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను, దంతాలను బలంగా ఉంచుతాయి. పాలలో కొంచెం పసుపును మిక్స్ చేసి తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా దగ్గు, జలుబు, జ్వరం వంటి వివిధ రకాల ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి.
ఇలాంటి పాలలో కొన్ని తులసి ఆకులను వేసి మరిగించి తాగితే శారీరక సమస్యలే కాదు మానసిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ పాలలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలుంటాయి. పాలలో తులసి ఆకులను మరిగించి తాగడం వల్ల అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఉబ్బసం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఉబ్బసం వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ పాలు ఎంతో ప్రయోనకరంగా ఉంటాయి. తులసి ఆకులను వేసిన పాలను తాగడం వల్ల ఈ సమస్యలు తగ్గిపోతాయి. ఈ పాలు ఆస్తమా సమస్యను కూడా తగ్గిస్తాయి.
మైగ్రేన్
ప్రస్తుతం చాలా మంది మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ మైగ్రేన్ తలనొప్పి దారుణంగా ఉంటుంది. అయితే ఈ సమస్యను ఫేస్ చేస్తున్నవారు రెగ్యులర్ గా తులసి ఆకులను పాలలో వేసి మరిగించి తాగితే ఈ సమస్య పూర్తిగా తొలగిపోతుంది.
డిప్రెషన్
బిజీ లైఫ్ స్టైల్, ఆఫీసు పని ఒత్తిడి, కుటుంబ కలహాలు, లవ్ ఫెయిల్యూర్, ద్వేషం వంటి వివిధ కారణాల వల్ల చాలా మంది డిప్రెషన్ కు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో తులసి పాలు తాగడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పాలు టెన్షన్ ను తగ్గిస్తుంది. డిప్రెషన్ ను పోగుడుతాయి.
మూత్రపిండాల్లో రాళ్ళు
కలుషితమైన ఆహారాన్ని తినడం వల్ల ఈ రోజుల్లో మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో తులసి ఆకులను పాలలో వేసి మరిగించి తాగితే మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోవడమే కాదు మూత్రపిండాల సమస్యలన్నీ పోతాయి.