- Home
- Life
- Barley Water Health Benefits: రోజూ ఒక గ్లాస్ బార్లీ వాటర్ తాగితే చాలు ఆ రోగాలన్నీ దూరమవుతాయి..
Barley Water Health Benefits: రోజూ ఒక గ్లాస్ బార్లీ వాటర్ తాగితే చాలు ఆ రోగాలన్నీ దూరమవుతాయి..
Barley Water Health Benefits: ప్రతి రోజూ ఒక గ్లాస్ బార్లీ వాటర్ తాగితే బాడీ హైడ్రేటెడ్ గా ఉండటంతో పాటుగా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

Barley Water Health Benefits: ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో శరీరంలో ఉన్న నీరంతా చెమట, మూత్రం రూపంలో బయటకు పోతూ ఉంటుంది. అంతేకాదు ఈ సీజన్ లో అన్నం కూడా సరిగ్గా తినాలనిపించదు. దీంతో నీరసంగా మారిపోతుంటారు. వీటన్నింటి నుంచి మనల్ని బయటపడేయడానికి బార్లీ వాటర్ దివ్య ఔషదంలా పనిచేస్తుంది. అవును బార్లీ వాటర్ తాగితే మనం హైడ్రేటెడ్ గా ఉండటంతో పాటుగా అలసట కూడా తగ్గుతుంది.
మన తాతల కాలంలో ఎవరికైనా జ్వరం వస్తే వారికి ఈ బార్లీ వాటర్ ను తాగించేవాళ్లు. ఈ వాటర్ ఫీవర్ ను తగ్గించడమే కాదు మరెన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. అవేంటంటే..
ఎండాకాలంలో చాలా మందిని వేధించే సమస్య అజీర్థి, మలబద్దకం. ఈ సమస్యలకు బార్లీ వాటర్ ఔషదంలా ఉపయోగపడుతుంది. ఈ సమస్యలున్న వారు బార్లీ వాటర్ ను తాగితే జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. అలాగే అజీర్థి సమస్య కూడా దూరమవుతుంది.
ఎండలకు బయటలకు వెళ్లేవారు బార్లీ వాటర్ ను తప్పకుండా తాగాలి. దీన్ని తాగడం వల్ల వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు. అలాగే ఎండ ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది.
barley water
డయాబెటీస్ పేషెంట్లకు బార్లీ వాటర్ ఎంతో మేలు చేస్తుంది. వీరు ఈ నీటిని తాగడం వల్ల షుగర్ లెవెల్స్, ఇన్సులిన్ నియంత్రణలో ఉంటాయి.
barley water
ముఖ్యంగా గర్భిణులు బార్లీ వాటర్ ను తాగడం వల్ల కాళ్ల వాపు ఉండదు. అలాగే కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. గర్భిణులకు బార్లీ వాటర్ ఎనర్జీ డ్రింక్ లా పనిచేస్తుంది.
barley water
ప్రస్తుతం అధిక బరువు సమస్యతో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇలాంటి వారికి బార్లీ వాటర్ చక్కగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ గ్లాస్ బార్లీ వాటర్ తాగితే సులభంగా బరువు తగ్గుతారు.
రోజూ గ్లాస్ బార్లీ వాటర్ తాగితే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉంటాయి. అలాగే హైబీపీ కూడా తగ్గుతుంది.
మూత్రనీళ ఇన్ఫెక్షన్ (Urinary tract infection) తో బాధపడే ఆడవారికి బార్లీ వాటర్ ఔషదంలా పనిచేస్తుంది. వీరు బార్లీ వాటర్ ను రెగ్యులర్ గా తాగితే ఈ సమస్య మటుమాయం అవుతుంది.
మూత్రం ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే వ్యర్థాలు, కారకాలు, మూత్రం ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ సమస్యలున్న వారు రోజుకో గ్లాస్ బార్లీ వాటర్ ను తాగండి.