MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Chanakya Niti: పిల్లలకు కన్న తల్లిదండ్రులే శత్రువులు అవుతారు.. ఎప్పుడో తెలుసా?

Chanakya Niti: పిల్లలకు కన్న తల్లిదండ్రులే శత్రువులు అవుతారు.. ఎప్పుడో తెలుసా?

 Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం.. కొందరు తమ జీవితంలో కన్న తల్లిదండ్రులనే శత్రువులుగా భావిస్తారట. అంతేకాదు.. కట్టుకున్న భార్యని కూడా శత్రువుగా భావిస్తారు. అలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయట. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 29 2026, 09:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
చాణక్య నీతి ఏం చెబుతోందంటే...
Image Credit : chat GPT

చాణక్య నీతి ఏం చెబుతోందంటే...

ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు.. మానవ సంబంధాల గురించి కూడా చాలా గొప్పగా వివరించారు. కుటుంబంలో కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భార్యలను కూడా ద్వేషించే పరిస్థితులు మానవులకు ఏర్పడే అవకాశం ఉందని చాణక్యుడు చెప్పాడు. ప్రాణంగా ప్రేమించే కుటుంబాన్ని ద్వేషించి, శత్రువుల్లా భావించే పరిస్థితులు ఎప్పుడు వస్తాయి? ఎలాంటి సందర్భాల్లో మనుషులు అలా ప్రవర్తిస్తారు అనే విషయం ఇప్పుడు చూద్దాం..

చాణక్య నీతిలో ఏమని ఉందంటే..

రుణకర్త పితా శత్రుర్మాతా చ వ్యభిచారిణీ

భార్యా రూపవతీ శత్రు: పుత్రు: శత్రురపండిత:

దీని అర్థం ఏమిటంటే.. అప్పుల్లో కూరుకుపోయిన తండ్రి , వ్యభిచారిణి అయిన తల్లి, అందమైన భార్య, అవివేకి అయిన కొడుకు శత్రువులు అవుతారట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
 1.అప్పు చేసిన తండ్రి..
Image Credit : AI

1.అప్పు చేసిన తండ్రి..

చాణక్యుడి ప్రకారం, తండ్రి విపరీతమైన అప్పులు చేస్తే.. ఆ అప్పులు తీర్చాల్సిన భారం పిల్లలపై పడితే, వారి జీవితం మొత్తం ఆర్థిక ఇబ్బందుల్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు తండ్రి.. తమ పిల్లలకు శత్రువుగా మారతాడు. ఆ అప్పు తీరుస్తున్న ప్రతిసారీ తండ్రిని తిట్టుకుంటూనే ఉంటాడు. అందుకే.. ఎవరైనా తమ స్థోమతకు మించి అప్పులు తీసుకోకూడదు. తీసుకున్నా... ఎవరు చేసిన అప్పులు వారే తీర్చేయాలి.

2.చెడు ప్రవర్తన కలిగిన తల్లి..

చెడు ప్రవర్తన కలిగిన తల్లి, తన కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా చెడు తిరుగుళ్లు తిరిగితే.. అప్పుడు ఆమె కూడా తన పిల్లలకు శత్రువుగా మారుతుంది. ఆ తల్లి ప్రవర్తన కారణంగా.. పిల్లలను కూడా సమాజంలో చిన్న చూపు చూసి, ఎగతాళి చేస్తారు. ఈ ప్రభావం పిల్లల భవిష్యత్తుపై కూడా పడుతుంది.

Related Articles

Related image1
Chanakya Niti: చాణక్యుడు ముందే చెప్పాడు.. ఇలాంటి అమ్మాయిలకు దూరంగా ఉండాల్సిందే
Related image2
Chanakya Niti: ఈ మూడింటికి డబ్బులు ఖర్చు చేస్తే.. మీ సంపద రెట్టింపు అవ్వడం ఖాయం..!
33
3.అందమైన భార్య..
Image Credit : others

3.అందమైన భార్య..

చాణక్యుడు కేవలం అందమైన భార్య గురించి మాత్రమే ప్రస్తావించలేదు. కానీ తన కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేసి, కేవలం తన అందంపై మాత్రమే దృష్టి పెట్టే మహిళల గురించి ప్రస్తావించారు. అలాంటి మహిళ భార్యగా వస్తే.. ఆమె కచ్చితంగా భర్తకు శ్రతువుగా మారుతుంది. ఆమె కారణంగా భర్తకు ఇంటి భారం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు తెచ్చి పెడుతుంది.

4.వివేకం లేని పిల్లలు..

ఆచార్య చాణక్యుని ప్రకారం, వివేకం లేని పిల్లలు తల్లిదండ్రులకు శత్రువులు అవుతారు. ఎంత గొప్ప చదువులు చదివినా.. మంచి, చెడులకు తేడా తెలియకుండా ప్రవర్తించే పిల్లలు, మంచి విలువలకు దూరమైతే.. అలాంటి పిల్లలు భవిష్యత్తులో కుటుంబానికి ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయి. అందుకే.. అలాంటి పిల్లలను తల్లిదండ్రులు శత్రువులుగా పరిగణిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Locket: హార్ట్ షేప్‌ గోల్డ్ లాకెట్స్.. చూస్తే మనసు పారేసుకుంటారు!
Recommended image2
Rice: అన్నం ముద్ద కాకుండా పొడి పొడిగా ఉడకాలంటే ఈ చిన్న చిట్కా ఉపయోగించండి చాలు
Recommended image3
రాధా-కృష్ణుల బంధం నుంచి భార్యాభర్తలు నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది
Related Stories
Recommended image1
Chanakya Niti: చాణక్యుడు ముందే చెప్పాడు.. ఇలాంటి అమ్మాయిలకు దూరంగా ఉండాల్సిందే
Recommended image2
Chanakya Niti: ఈ మూడింటికి డబ్బులు ఖర్చు చేస్తే.. మీ సంపద రెట్టింపు అవ్వడం ఖాయం..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved