Lips Colour: మీ పెదవులు రంగు మారుతున్నాయా? జాగ్రత్త.. ఈ తీవ్రమైన వ్యాధులు కారణం కావచ్చు
పెదవులు రంగు మారడం అనేది సాధారణ విషయం కాదు. అవి మన ఆరోగ్యాన్ని సూచిస్తున్నట్టే. పెదవులు రంగు మారడం అనేది శరీరంలోని అంతర్గత మార్పులకు సంకేతం. పోషకాహార లోపం వల్ల లేదా ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యల వల్ల ఇలా పెదవుల రంగు మారవచ్చు.

పెదాలు రంగు మారితే...
ముఖ సౌందర్యాన్ని పెంచే భాగాల్లో పెదవులు ముఖ్యమైనవి. ఇది మన శరీర ఆరోగ్యాన్ని సూచిస్తాయి. పెదవుల రంగు మారడం సాధారణ విషయం కాదు. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం పెదవులు రంగు మారడం అనేది శరీరంలోని ఉన్న అనారోగ్యాలను సూచిస్తుంది. ఇది ఏదైనా వ్యాధికి సంకేతం కూడా కావచ్చు. మీ పెదవులు మారుతున్న రంగును బట్టి మీకు ఎలాంటి వ్యాధి ఉందో అంచనా వేసుకోవచ్చు. కొన్నిసార్లు రక్తప్రసరణ సరిగా జరగకపోయినా పోషకాహార లోపం ఉన్న కూడా పెదవులు రంగు మారుతూ ఉంటాయి.
పెదాలు ఎర్రగా మారితే
మహిళల పెదవులు ఎర్రగా మారితే అద్దంలో చూసుకుని మురిసిపోతారు. నిజానికి పెదవులు సహజంగా ఎర్రగా మారడం అనేది ప్రమాదకరమైనది. పెదవులు ముదురు ఎరుపు రంగులోకి మారాయంటే మీ కాలేయంలో ఏదో సమస్య ఉందని అర్థం. కాలేయంలో సమస్యలు ఉన్నప్పుడే పెదవుల రంగు మారుతుంది. అలాగే అలెర్జీల వల్ల కూడా పెదవులు ఎరుపు రంగులోకి మారే అవకాశం ఉంది. చైన్ స్మోకింగ్ అలవాటు ఉన్న వారికి కూడా పెదవుల రంగు ముదురుగా అవుతుంది.
నల్లటి పెదవులు
సిగరెట్లు తాగేవారికి పెదవులు నల్లగా మారిపోతాయి. లేదా మీరు వాడే మేకప్ ఉత్పత్తులో ఏవైనా మీకు సరిపడకపోయినా కూడా పెదవులు నల్లగా మారే అవకాశం ఉంది. కొత్త ఉత్పత్తులు వాడే ముందు మీ పెదవుల రంగును ఒకసారి చెక్ చేసుకోండి. ఆ ఉత్పత్తులు వాడాక పెదాల రంగులో మార్పు వస్తే వాటిని వాడకపోవడమే ఉత్తమం.
తెల్లటి పెదాలు
కొంతమంది పెదవులు తెల్లగా మారుతాయి. లేదా లేత గులాబీ రంగులోకి మారి జిడ్డుగా అనిపిస్తాయి. ఇది సాధారణ విషయం కాదు. పెదవులు పాలిపోయినట్టు మారాయంటే శరీరంలో రక్తం సరిపడనంత లేదని అర్థం. అప్పుడే పెదాలు ఇలా పాలిపోయినట్టు అవుతాయి. ఇది పోషకాహార లోపాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా రక్తహీనత వల్ల ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
నీలం రంగులోకి
అకస్మాత్తుగా పెదవులు నీలం రంగులోకి మారితే అది గుండె జబ్బు సమస్యకు కారణం కావచ్చు. ఇక పసుపు రంగులోకి మారితే కాలేయంలో బిలిరూబిన్ స్థాయిలు పెరిగిపోయాయి అని చెప్పుకోవాలి. ఇది కామెర్ల వ్యాధిని సూచిస్తుంది. ఇక జలుబు విపరీతంగా ఉన్నా లేదా ఊపిరితిత్తుల్లో విపరీతమైన ఇన్ఫెక్షన్ ఉంటే ఆకుపచ్చ రంగు పెదవులు వస్తాయి. అదే ఊదా రంగు వస్తే శ్వాస సమస్య ఉందని అర్థము. కాబట్టి మీ పెదవుల రంగును ఎప్పటికప్పుడు గమనించడం చాలా ముఖ్యం.