MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Fatty liver: మీ అరచేతుల రంగు ఇలా మారుతోందా..? ఈ సమస్యే కావొచ్చు.. జాగ్రత్త..

Fatty liver: మీ అరచేతుల రంగు ఇలా మారుతోందా..? ఈ సమస్యే కావొచ్చు.. జాగ్రత్త..

Fatty liver: ఎంత పెద్ద అనారోగ్య సమస్యలైనా.. కొన్ని చిన్న చిన్న లక్షణాలతో ఈజీగా గుర్తుపట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అరచేతుల రంగు మారితే.. ఈ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని పేర్కొంటున్నారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Feb 04 2022, 03:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Fatty liver: మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం క్షేమంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపగలుగుతాం. ఇకపోతే మానవ శరీరంలో ఉన్న అవయవాల్లో కాలెయం ఎంతో ముఖ్యమైనది. ఇదే మన జీవక్రియలు సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. అంతేకాదు కొవ్వులను కూడా నిల్వ ఉంచుతుంది. ఒకవేళ కాలెయం సరిగ్గా పనిచేయకపోతే.. మన శరీరంలో కొవ్వు నిల్వలు విపరీతంగా పెరిగిపోతాయి. తద్వారా కాలెయంపై చెడు ప్రభావం పడుతుంది. ఈ సమస్యను ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారని వైద్యులు పేర్కొంటున్నారు. 

26

కాగా ఈ వ్యాధి సోకినప్పుడు సరైన సమయంలో చికిత్స్ చేయించుకోకపోతే సిర్రోసిస్ గా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సిర్రోసిస్ సోకితే.. కాలెయం దెబ్బతింటుంది. అందుకే ఈ సమస్య ఎదురైనప్పుడు సరైన సమయంలో చికిత్స చేయించుకోవాలి. కాగా ఈ జబ్బుకు సంబంధించిన మరో కొత్త లక్షణం బయపటడిందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అరచేతులు గులాబీ రంగులోకి మారడం, మచ్చలు మచ్చలు గా కనిపించడం, ఎర్రగా మారడం వంటి సమస్యలు కూడా లివర్ సమస్య వచ్చిందని తెలిపే సూచనలేనట. వీటిని తేలిగ్గా తీసిపారేయొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవే కావు మరికొన్నిలక్షణాలు కూడా లివర్ సమస్య కు దారితీస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

36

లక్షణాలు: కడుపు నొప్పిగా అనిపించడం, స్కిన్ పై దురదలు పెట్టడం వంటి సమస్యలు కనిపిస్తాయి. అలాగే కడుపునొప్పి, మలం ముదురు రంగులో రావడం, కాళ్లు వాయడం, పొట్ట పై భాగంలో అసౌకర్యంగా అనిపించడం వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి. వీటితో పాటుగా పొట్ట ఉబ్బరంగా అనిపించడం, పచ్చ కామెర్లు రావడం, వాంతులు చేసుకునేటప్పుడు అందులో బ్లడ్ పడటం కూడా కాలెయ సమస్యే కావొచ్చు. 
 

46

ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి మీలో కనిపించినా కూడా వెంటనే వైద్యులను సంప్రదించడం మర్చిపోవద్దు. కాలెయంలో కొవ్వు పెరిగిపోతే.. వైద్యులు అది తగ్గేందుకు మెడిసిన్స్ ఇస్తారు. అంతేకాదు మీ ఆహార పదార్థాల్లో ఎక్కువ కొవ్వు లభ్యమయ్యే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అంతేకాదు శరీర బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం. 

56
liver

liver

ఒకవేళ మీకు కాలెయ సమస్యలుంటే మీరు మీ రోజు వారి ఆహారంలో పాల పదార్థాలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే పాలల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తాగడం వల్ల మన శరీరంలో కొవ్వు పెరగడమే కాదు.. శరీరం వాపు వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే బ్రెడ్, అన్నం, బంగాళ దుంపలకు కూడా దూరంగా ఉండాలి. వీటికి బదులుగా బెర్రీలు, ఆలివ్ ఆయిల్, ద్రాక్ష పండ్లు, గ్రీన్ టీ, తాజా కూరగాయలు, పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. మద్యం అస్సలు సేవించకూడదు. 

66

కాలెయ ఆరోగ్యానికి ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ ఆమ్లాలు బాగా ఉపయోగపడతాయి. అందుకే ఇవి ఎక్కువగా లభించే ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలి. ఇవి లివర్ లో ఉన్న అధిక కొవ్వును కరిగించడంలో ఎంతో సహాయపడతాయి. చేపలు, నట్స్, సాల్మాన్ చేపలు, కోడిగుల్లు వంటివి కాలెయ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sankranti : సంక్రాంతికి ఈ గుడికి వెళ్తే మీ జాతకం మారిపోవడం ఖాయం ! పట్టిందల్లా బంగారమే!
Recommended image2
మాంసం ఫ్రిజ్ లో స్టోర్ చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే
Recommended image3
వంటకు ఏ నూనె వాడాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved