Health Tips: ఇడ్లి ,దోశ వంటి పులియబెట్టిన ఆహారాలను తింటే ఏమౌతుందో తెలుసా..?
Health Tips: మనం ఇష్టంగా తినే దోశ, ఇడ్లి వంటి కొన్ని ఆహార పదార్థాలను పులియబెట్టి తయారుచేస్తుంటారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే పులియబెట్టిన ఆహారాలు మనకు మంచి చేస్తాయా? చెడు చేస్తాయా అన్న విషయాలు మాత్రం చాలా మందికి తెలియదు. ఇంతకి ఇవి మనకు మంచివేనా?

Health Tips: హోటల్లోనే కాదు.. ప్రతి ఇంట్లో కూడా ఇడ్లీలను, దోశలను తయారుచేసుకుని ఇష్టంగా తింటుంటారు. ఇక వీటిని తయారుచేయాలంటే కొన్ని గంటల పాటు ఈ పిండిని పులియబెట్టాలని మనందరికీ తెలిసిందే. అయితే ఈ పులియబెట్టిన ఆహారాలు మనకు ఆరోగ్యానికి మంచివా? కావా? అన్న సందేహాలు చాలా మందిలోనే ఉండుంటాయి. వాస్తవానికి పులియబెట్టిన ఆహార పదార్థాల వల్ల మన ఆరోగ్యానికి ఏ మాత్రం హానీ జరగదు.
నిజం చెప్పాలంటే వీటిని తింటే మనకెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మన రోజు వారి డైట్ లో పులియబెట్టిన ఆహారాలను తీసుకుంటే మన పొట్ట ఎంతో హెల్తీగా ఉంటుంది. ఈ పులియబెట్టిన వంటలు రుచిలో వావ్ అనిపిస్తాయి కూడా. ఈ వంటకాల్లో ప్రోబయోటిక్స్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. అయితే ఈ ఆహారాలను తినడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.. పులియబెట్టిన ఆహారాలు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బలహీనమైన ఇమ్యూనిటీ పవర్ సిస్టమ్ ను కలిగి ఉన్నవారు పులియబెట్టిన ఆహారాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఓవర్ వెయిట్ ను తగ్గిస్తుంది.. ప్రస్తుత కాలంలో అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలతో బాధపడేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. కాగా ఈ సమస్యలున్నవారు సరైన మార్గంలో పులియబెట్టిన ఆహార పదార్థాలను తీసుకుంటే చాలా సులువుగా ఓవర్ వెయిట్ ను కోల్పోతారు. ఈ ఆహారాల్లో ఇడ్లీలు మనకు చాలా మంచివి. ఎందుకంటే ఇవి ఆవిరితో ఉడుకుతాయి. ఇవి మన ఆరోగ్యానికి ఏ మాత్రం హానీ కలిగించవు. అంతేకాదు వీటిని తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉందన్న భావన కలుగుతుంది. దీంతో మీరు అధనంగా తినలేరు.
జీవక్రియ మెరుగుపడుతుంది.. పులియబెట్టిన ఆహారాలను తినడం వల్ల జీవక్రియ ( Metabolism) మెరుగవుతుంది. ఇలాంటి ఆహారాలు చాలా సులువుగా అరుగుతాయి కూడా . అంతేకాదు ఇవి ఓవర్ వెయిట్ ను తగ్గించడానికి కూడా ఎంతో సహాయపడతాయి. పులియబెట్టిన ఆహారాలతో మన శరీరానికి కావాల్సిన విటమిన్ బి12 అందుతుంది.
వాపులు తగ్గుతాయి.. శరీర వాపుల సమస్యలతో బాధపడేవారికి పులియబెట్టిన ఆహారాలు చక్కటి మెడిసిన్ లా పనిచేస్తాయి. అవును ఈ ఆహారాలను తింటే శరీర వాపులు ఇట్టే తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే నూనెలో వేయించిన ఆహారాలకంటే పులియబెట్టిన ఇడ్లీ లాంటి ఆహార పదార్థాలే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మంచి బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. మనం చక్కెరను పూర్తిగా లేదా చాలా తక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడే మన శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఒకవేళ షుగర్ ను ఎక్కువగా తీసుకున్నారో మీ శరీరంలో మంచి బ్యాక్టీరియా పూర్తిగా తగ్గిపోయి చెడు బ్యాక్టీరియా విచ్చలవిడిగా పెరుగుతుంది. దాంతో మీరెన్నో జబ్బులపాలవ్వొచ్చు.