Ears: మీ చెవుల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
ఎవరికీ తెలియని మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ చెవులు.. మన వయసు పెరిగే కొద్దీ అవి కూడా పెరుగుతూనే ఉంటాయి. మనం రోజూ చూస్తున్నా కూడా ఆ విషయాన్ని గమనించలేం.

చెవుల ప్రత్యేకత ఏంటి?
మనలో ప్రతి ఒక్కరికీ చెవులు ఉంటాయి. చెవులు మనకు వినికిడి కోసం సహాయం చేస్తాయి. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ, ఈ చెవుల గురించి మీకు తెలియని చాలా విషయాలు ఇంకా ఉన్నాయి. మన చెవిలో వెస్టిబ్యులర్ అనే వ్యవస్థ పని చేస్తూ ఉంటుంది. ఇది మన శరీరాన్ని చాలా బ్యాలెన్స్డ్ గా ఉంచడానికి సహాయం చేస్తుంది. అంతేకాదు.. మన కదలికల గురించి మెదడుకు సంకేతాలు పంపించడంలోనూ సహాయం చేస్తుంది.
చెవులు శుభ్రం చేస్తున్నారా?
రెగ్యులర్ గా మనలో చాలా మంది ఎప్పటికప్పుడు చెవులను శుభ్రం చేసుకుంటూ ఉంటారు. కానీ, వాటిని మనం స్పెషల్ గా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎదుకంటే.. చెవులు తమను తాము శుభ్రంగా ఉంచుకునే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. చెవిలో ఉండే వ్యాక్స్.. మన చెవులను తేమగా ఉంచుతాయి. దుమ్ము, ధూళి, సూక్ష్మ జీవుల నుంచి రక్షించడం వంటి ముఖ్యమైన పనులను కూడా చెవులు చేస్తాయి.
మీ చెవుల విషయంలో ఇది గమనించారా?
ఎవరికీ తెలియని మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ చెవులు.. మన వయసు పెరిగే కొద్దీ అవి కూడా పెరుగుతూనే ఉంటాయి. మనం రోజూ చూస్తున్నా కూడా ఆ విషయాన్ని గమనించలేం. కానీ మన వయసు పెరుగుతుంటే అవి కూడా పెరుగుతాయి.
మనం ఎంత గాఢ నిద్రలో ఉన్నా కూడా చెవులు పని చేయడం మాత్రం ఆగవు. ముఖ్యంగా.. చెవులు శబ్ధాలను వినే పనిని ఆపవు. కొన్ని రకాల ప్రమాదాలను గమనించడంలో చెవులు ముఖ్యపాత్ర పోషిస్తాయి.
పెద్ద శబ్దాలు వింటే...
చెవిలో ఉండే సూక్ష్మ వెంట్రుక కణాలు వినికిడి , సమతుల్యతకు కీలకమైనవే. ఇవి ఒక్కసారి దెబ్బతిన్న తర్వాత తిరిగి పెరగవు. శబ్ద కాలుష్యం, వృద్ధాప్యం, ఇన్ఫెక్షన్లు వంటి కారణాలతో ఈ కణాలు దెబ్బతింటే శాశ్వత వినికిడి లోపం కలగవచ్చు. అందుకే, పెద్ద శబ్దాల నుంచి చెవులను రక్షించుకోవడం అత్యంత అవసరం.ఈ శబ్ద కాలుష్యం వినికిడి లోపానికి రెండవ అతిపెద్ద కారణంగా గుర్తించారు. ఎక్కువ శబ్దాలకు అనవసరంగా గురికావడం వల్ల "సెన్సోరినిరల్" వినికిడి నష్టం జరుగుతుంది. ఇది మెల్లగా, లేదా ఒక్కసారిగా జరగవచ్చు. ఎలా జరిగినా కానీ ఫలితం ఒకటే: శాశ్వత వినికిడి లోపం.
చెవులు, గొంతుకు కనెక్షన్..
మీ చెవులు వాతావరణ ఒత్తిడి మార్పులకు కూడా స్పందిస్తాయి. విమానాల్లో, గిరిజన ప్రాంతాల్లో లేదా ఎత్తైన ప్రదేశాల్లో చెవులు “పాప్” అవ్వడాన్ని మీరు గమనించి ఉంటారు. ఇది యుస్టాచియన్ ట్యూబ్ అనే చిన్న గొట్టం వల్ల జరుగుతుంది. ఇది చెవి లోపల, గొంతు మధ్య గాలి ఒత్తిడిని సమంగా ఉంచుతుంది. ఇంకా, చెవులు, ముక్కు, గొంతు అన్నీ ఒక దానితో మరొకటి అనుసంధానంగా పనిచేస్తాయి. ఒక అవయవంలో సమస్య వేరే భాగంలో సమస్యగా మారే అవకాశం ఎక్కువ. ఉదాహరణకు, గొంతు ఇన్ఫెక్షన్ చెవికి కూడా వ్యాపించవచ్చు.
వినికిడి లోపం మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. పరిశోధనలు చెబుతున్నదేమంటే, మితమైన వినికిడి లోపం ఉన్నవారు చిత్తవైకల్యం (డిమెన్షియా)కు ఎక్కువగా గురవుతారు. వినికిడి లోపం వల్ల ఒంటరితనానికి, మానసిక ఒత్తిడికి దారితీస్తుంది, ఇది మెదడు సామర్థ్యాన్ని క్రమంగా తగ్గిస్తుంది.
మొత్తంగా చెప్పాలంటే, మన చెవులు అత్యంత శక్తివంతమైనవి కానీ తరచూ నిర్లక్ష్యానికి గురయ్యే అవయవాలలో ఒకటి. వాటి గుణాలను అర్థం చేసుకోవడం ద్వారా, మనం ఆరోగ్యంగా ఉండటమే కాక, గౌరవంగా జీవించగలము.