ఆలియా భట్ లా మెరిసిపోవాలంటే.. ఈ ఫేస్ ప్యాక్ బెస్ట్..
ఆలియా భట్ సహజ సౌందర్య రాశి. మేకప్ లేకుండా కూడా ఆలియా అందంగానే ఉంటుంది. అంతేకాదు ఆమె తన చర్మ సంరక్షణ కోసం ఎంతో జాగ్రత్తలు తీసుకుంటుంది.
బాలీవుడ్ లో అత్యంత అందమైన హీరోయిన్ అంటే ఆలియా భట్. నటిగా రంగప్రవేశం చేసిన నాటి నుంచి తనదైన అందంతో, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల మది దోచుకుంది ఆలియా.
ఆలియా భట్ సహజ సౌందర్య రాశి. మేకప్ లేకుండా కూడా ఆలియా అందంగానే ఉంటుంది. అంతేకాదు ఆమె తన చర్మ సంరక్షణ కోసం ఎంతో జాగ్రత్తలు తీసుకుంటుంది.
కాంటెంపరరీ హీరోయిన్ల లాగే ఆలియా కూడా తన సౌందర్యానికి మెరుగులు దిద్దుకోవడానికి తనదైన ప్రత్యేకమైన ఫేస్ ప్యాక్ ను వాడుతుంది. మెరిసే చర్మం కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఆలియా వాడే ఫేస్ ప్యాక్ తయారీకి కావాల్సినవన్నీ చాలా సులభంగా దొరికేవే. వీటితోనే సహజ సిద్దమైన ఫేస్ ఫ్యాక్ తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి ఏంటంటే...
ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ పొప్పడి పండు గుజ్జు. పొప్పడి పండు లేకపోతే ఒక టేబుల్ స్పూన్ ఆరంజ్ గుజ్జు కానీ పౌడర్ కానీ తీసుకోవచ్చు.
వీటన్నింటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలిపి ముఖనికిి రాసుకోవాలి. 15 నిమిషాల పాటు ఆరనిచ్చి తరువాత కడిగేసుకోవాలి. అంతే.. ఆలియా భట్ లాంటి అందమైన మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.