MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Strange disease: గడ్డి తినేలా చేసే వ్యాధి ఒకటి, శరీరాన్ని రాయిలా మార్చే రోగం మరొకటి.. ఈ రెండూ వస్తే చికిత్సే లేదు

Strange disease: గడ్డి తినేలా చేసే వ్యాధి ఒకటి, శరీరాన్ని రాయిలా మార్చే రోగం మరొకటి.. ఈ రెండూ వస్తే చికిత్సే లేదు

Strange disease: కొన్ని రోగాలు చాలా వింతగా ఉంటాయి. అవి వస్తే అలా జీవితాంతం బతకడమే కానీ ఎలాంటి మందులు ఉండవు. అలాంటి రెండు వింతైన రోగాల గురించి ఇక్కడ చెప్పాము. 

2 Min read
Author : Haritha Chappa
Published : Jun 11 2026, 01:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వైద్య శాస్త్రానికే సవాలు
Image Credit : Chat gpt

వైద్య శాస్త్రానికే సవాలు

ఆధునిక కాలంలో వైద్య శాస్త్రం ఎంతో పురోగతి చెందుతోంది. ఏ వ్యాధికైనా చికిత్సను కనిపెట్టే దశలో ఇప్పుడు వైద్య రంగం ఉంది. కానీ కొన్ని వ్యాధులు మాత్రం ఇప్పటికే వైద్యులకు సవాలు విసురుతూనే ఉన్నాయి. సాధారణంగా మనిషి ఆహారం తీసుకోవడం, నడవడం, ఆలోచించడం వంటి పనులు సహజంగా జరుగుతాయి. కానీ కొన్ని అరుదైన వ్యాధులు వచ్చినప్పుడు మనిషి ప్రవర్తనలో, శరీరంలో ఊహించని మార్పులు వస్తాయి. అలాంటి వాటిలో ఒకటి మనిషిని గడ్డి తినేలా చేసే వ్యాధి కాగా, మరొకటి శరీరాన్ని క్రమంగా రాయిలా మార్చే పరిస్థితి. ఈ వ్యాధులు చాలా అరుదుగా కనిపిస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
గడ్డి తినేలా చేసే వ్యాధి
Image Credit : Getty

గడ్డి తినేలా చేసే వ్యాధి

గడ్డి తినేలా చేసే అరుదైన వ్యాధి ఒకటుంది. దీన్ని బోయాంత్రోపీ (Boanthropy) అంటారు. ఇది ఒక రకమైన తీవ్రమైన మానసిక సమస్యగా చెబుతారు వైద్య నిపుణులు. ఈ సమస్య ఉన్న వ్యక్తులు తాము మనుషులం అనే ఆలోచన కూడా మర్చిపోతారు. తాము జంతువులనకుంటారు. ముఖ్యంగా తాము ఆవులం లేదా ఇతర జంతువులం అని భావించి వాటిలాగే ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. కొందరు వ్యక్తులు జంతువుల మాదిరిగా నేలపై నడవడం, గడ్డి తినడం వంటి పనులు కూడా చేయవచ్చు. మెదడులోని ఆలోచనా విధానంలో వచ్చే మార్పులు, కొన్ని మానసిక సమస్యలు ఈ పరిస్థితికి కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. సరైన చికిత్స, వైద్యుల సలహా, కౌన్సెలింగ్ ద్వారా ఈ సమస్యను నియంత్రించేందుకు ప్రయత్నిస్తారు.

Related Articles

Related image1
Gold Anklets: బంగారుపూత పూసిన వెండి పట్టీలు.. వీటి డిజైన్లు చూస్తే వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది
Related image2
Black Hair: షాంపూలో ఈ నూనె కలిపి తలకు పట్టిస్తే తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది
34
శరీరాన్ని రాయిలా మార్చే వ్యాధి
Image Credit : Getty

శరీరాన్ని రాయిలా మార్చే వ్యాధి

ఇక మరో వింతైన వ్యాధి స్టోన్‌మ్యాన్ సిండ్రోమ్ (Stone Man Syndrome). దీనిని వైద్య భాషలో ఫైబ్రోడిస్ప్లాసియా ఆసిఫికన్స్ ప్రోగ్రెసివా (FOP) అని పిలుస్తారు. ఇది జన్యుపరంగా వచ్చే అరుదైన వ్యాధి. ఈ వ్యాధి ఉన్నవారి శరీరంలోని కండరాలు, కణజాలాలు క్రమంగా ఎముకల్లాగా గట్టిపడతాయి. సాధారణంగా కదలాల్సిన భాగాలు నెమ్మదిగా గట్టిపడటం వల్ల చేతులు, కాళ్లు, మెడ వంటి భాగాలను కదపడం కష్టంగా మారుతుంది. శరీరం లోపల అదనంగా ఎముకలు పెరగడం వల్ల కదలికలు తగ్గిపోతాయి. ఈ కారణంగానే దీనికి స్టోన్‌మ్యాన్ సిండ్రోమ్ అనే పేరు వచ్చింది.

44
చికిత్స లేదు
Image Credit : Getty

చికిత్స లేదు

ఈ రెండు వ్యాధులకు పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. అయితే వైద్యులు లక్షణాలను తగ్గించడం వరకు సాయం చేస్తారు. రోగులు జీవన నాణ్యత మెరుగుపరచడం కోసం చికిత్స అందిస్తారు. ఇటువంటి అరుదైన వ్యాధులు మనిషి ఎంత జాగ్రత్తగా ఉండాలో చెబుతున్నాయి. సాధారణంగా మనకు తెలిసిన ఆరోగ్య సమస్యలకు భిన్నంగా ఉండే ఈ పరిస్థితులు వైద్య పరిశోధనలకు కూడా ముఖ్యమైన అంశాలుగా మారాయి. శరీరంలో చిన్న మార్పు కూడా మనిషి జీవన విధానాన్ని ఎంతగా ప్రభావితం చేయగలదో ఈ వ్యాధులు చూపిస్తున్నాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
IRCTC Jyotirlinga Tour 2026: ఒకే ఒక్క ట్రిప్.. 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాల దర్శనం! ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
Recommended image2
Jhumka Designs: రోజూ పెట్టుకోవడానికి ఈ చిన్న జుంకాలు సూపర్ గా ఉంటాయి!
Recommended image3
Crop Top: రూ.500లోపు లభించే స్టైలిష్ క్రాప్ టాప్స్
Related Stories
Recommended image1
Gold Anklets: బంగారుపూత పూసిన వెండి పట్టీలు.. వీటి డిజైన్లు చూస్తే వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది
Recommended image2
Black Hair: షాంపూలో ఈ నూనె కలిపి తలకు పట్టిస్తే తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved