Beauty Tips: మేకప్ లేకపోయినా మొఖం అందంగా కనిపించాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!
Beauty Tips: చాలామంది ఆఫీసుకు వెళ్లే ఆడవాళ్ళకి మేకప్ వేసుకుని టైం ఉండదు. కానీ వాళ్లకి మొఖం ఫ్రెష్ గా లేదేమో అని ఒక ఆలోచనతో బాధపడుతూ ఉంటారు. నిజానికి మేకప్ లేకపోయినా మొఖం అందంగా ఉంచుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ఇంటి పనుల హడావుడిలో చాలామంది ఆడవాళ్ళకి పొద్దున్నే మేకప్ వేసుకొని బయటకు వెళ్లే సమయం ఉండదు. కానీ ఆ ఆడవాళ్ళకి మొహం అందంగా లేదేమో అని ఒక అనుమానం పీడిస్తూ ఉంటుంది. కొందరికి సమయం ఉన్నా, మేకప్ వేసుకోవాలనే కోరిక..
ఉన్నప్పటికీ, హుందాగా కనిపించడానికి మేకప్ అడ్డు అనుకుంటారు. నిజానికి స్వచ్ఛమైన అందానికి మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన మొహం కూడా ఎంతో అందంగా ఉంటుంది. ముందుగా పెదవుల సంగతి చూద్దాం.
పొద్దున్నే బ్రష్ చేసేటప్పుడు పళ్ళతో పాటు పెదవులను కూడా ఒకసారి మృదువుగా మర్దన చేయండి. ఇలా చేయడం వలన రక్తప్రసరణ బాగా జరిగి క్రమేణా పెదవులు రంగుని సంతరించుకుంటాయి. చర్మం పొడిబారకుండా మాయిశ్చరైసర్ ని రాయటం ద్వారా తేమగా ఉంచుకోవచ్చు.
మాయిశ్చరైసర్ ని రాసే క్రమంలో చర్మం రాపిడికి గురవకుండా సున్నితంగా మర్దనా చేయండి. దీనివలన చర్మం పొడిబారి పోకుండా తాజాగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీ కనుబొమ్మలని కర్లర్ ద్వారా సున్నితంగా కర్వ్ చేయండి.
మంచి ఫలితాల కోసం ఒకటికి రెండుసార్లు చేయండి. అలాగే చర్మం ప్రకాశవంతంగా కనిపించడం కోసం ముఖం మీద ఉండే చర్మాన్ని మెల్లగా తాపడం చేయడం ద్వారా, బుగ్గలని ఒకసారి సున్నితంగా లాగడం ద్వారా ముఖానికి మసాజ్ ని అందివ్వండి.ఇలా చేయటం వలన సహజసిద్ధమైన రంగుని తీసుకోవడానికి చర్మం సిద్ధంగా ఉంటుంది.
అందువలన మీ ముఖం ప్రకాశవంతంగా తాజాగా కనిపిస్తుంది. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది ముఖానికి రెట్టింపు అందాన్ని తీసుకువచ్చేది మీ చిరునవ్వు. అది మాత్రం ముఖంపై ఎప్పుడు చెదరనివ్వకుండా చూసుకోండి. అప్పుడు మేకప్ లేకపోయినా మీ ముఖం అందంతో హుందాతనంతో వెలిగిపోతుంది.