weight loss: ఫాస్ట్ గా బరువు తగ్గాలంటే చియా విత్తనాలను ఇలా తీసుకోండి..
weight loss: చియా గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలను నానబెట్టి తీసుకోవడం ద్వారా చాలా తొందరగా బరువు తగ్గుతారు.

చియా గింజలను పోషకాల పవర్ హౌస్ గా చెప్పొచ్చు. ముఖ్యంగా నాబెబెట్టిన ఈ గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు ఎంతో సహాయపడతాయి.
ఈ గింజల్లో ఫైబర్ కంటెంట్, కేలరీలు అధిక మొత్తంలో ఉంటాయి. 30 గ్రాముల చియా విత్తనాల్లో 5 గ్రాముల ప్రోటీన్, 10 గ్రాముల ఫైబర్, 138 కేలరీలు ఉంటాయి. అంతేకాదు ఈ విత్తనాల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, భాస్వరం, మెగ్నీషియం, కాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ గింజలు రుచిని కలిగి ఉండవు. అయితే ఈ చియా విత్తనాలను కొన్ని ప్రత్యేక పద్దతుల్లో తీసుకుంటే ఈజీగా బరువు తగ్గొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చియా విత్తనాలను నీటిలో నానబెట్టాలి. ఇవి బాగా నాని ఉబ్బిన తర్వాత దీనికి పాలను కలపండి. ఇది చాలా చిక్కగా ఉండేట్టు చూసుకోండి. అవసరమైతే దీనికి మరికొన్ని చియా విత్తనాలను కలపండి. ఇది మరింత టేస్టీగా మారాలంటే వెనీలా లేదా మీకు నచ్చిన రుచులను జోడించొచ్చు. ఫైనల్ గా డ్రైఫ్రూట్స్ ను చిన్న చిన్న ముక్కలుగా చేసి దీనిపై డెకరేట్ చేయండి. దీన్ని ఉదయం లేదా భోజనం తర్వాత అయినా తీసుకోవచ్చు.
చియా విత్తనాలతో ఇంట్లో ఎనర్జీ బార్లను కూడా తయారుచేసుకోవచ్చు. ఇందుకోసం బాదం, వాల్ నట్స్, నువ్వులు, చియా గింజలు, పిస్తాపప్పు, గుమ్మడి కాయ గింజలు, తురిమిన కొబ్బరి, తేనె, యాలకులు, ఓట్స్ ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో నానబెట్టిన ఖర్జూరాలను, చియా విత్తనాలను నీరు లేకుండా కలపండి. ఒక తేనె తప్ప.. ఏలకులు, ఓట్స్ మొదలైన పదార్థాలను సన్నని మంటపై వేయించుకోండి.
బ్లెండెడ్ ఖర్జూరాలు చిక్కబడే వరకు నెమ్మదిగా సన్నని మంటపై ఉడికించండి. ఈ ఖర్జూరం పేస్ట్ లో వేయించిన యాలకులు మొదలైన పదర్థాలను, తేనెను వేసి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి ఈ చిక్కని మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోండి. అది పూర్తిగా చల్లారిన తర్వాత దానిని బార్ లుగా కట్ చేసి గాలి వెళ్లని కంటైనర్ లో నిల్వ చేయండి.
చియా విత్తనాలను మీరు రెగ్యులర్ గా తాగే సూప్ లో కూడా మిక్స్ చేయవచ్చు. మీరు రెడీ చేసుకునే సూప్ చిక్కగా మారడానికి కొన్ని చియా విత్తనాలను నానబెట్టి సూప్ లో కలపండి. ఇది సూప్ కు అదనపు మూలకాన్ని జోడించడమే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తుంది.
వేసవి దాహం తీరేందుకు తరచుగా దోసకాయ, నిమ్మకాయ వంటి వాటితో డీటాక్స్ వాటర్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ డీటాక్స్ వాటర్ కు చియా విత్తనాలను జోడించొచ్చు. దీనివల్ల మీకు అదనపు పోషణ కూడా లభిస్తుంది. ఇది మీ బరువు తగ్గే ప్రాసెస్ ను వేగవంతం చేస్తుంది.
మీరు రెగ్యులర్ గా చేసుకుని తినేవారు పాన్ కేక్ పిండికి క్రంచీ చియా విత్తనాలను జోడించండి. ఇందుకోసం పాన్ కేక్ పిండికి ముందుగా నానబెట్టిన చియా విత్తనాలను కలపాలి. చియా విత్తనాలను నానబెట్టిన తర్వాతే రెట్టింపు పరిమాణానికి చేరుకుంటాయి. ముందుగా నానబెట్టిన చియా విత్తనాలు పిండిలో సులభంగా కలుస్తాయి కూడా. అలాగే నానబెట్టిన విత్తనాలతోనే మానకు పోషకాలు ఎక్కువగా అందుతాయి.