MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • రాత్రి ఫుల్లుగా మందు తాగినా నిద్రలేచాక హ్యాంగోవర్ ఉండొద్దంటే.. ఈ 5 సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి

రాత్రి ఫుల్లుగా మందు తాగినా నిద్రలేచాక హ్యాంగోవర్ ఉండొద్దంటే.. ఈ 5 సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి

రాత్రి మందు ఎక్కువగా తాగితే ఉదయం తలనొప్పి, వికారం, కడుపులో మంట, వాంతులు అవుతుంటాయి… దీన్ని హ్యాంగోవర్ అంటారు. ఎంతతాగినా హ్యాంగోవర్ సమస్య ఉండకూడదంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి. 

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 23 2026, 05:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మందు తాగుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
Image Credit : Gemini AI

మందు తాగుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి

విందులు, వినోదాలు లేదా స్నేహితులతో గడిపే సమయాల్లో చాలామంది మందు (ఆల్కహాల్) తీసుకుంటుంటారు. అయితే ఇలా తాగేముందు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మరుసటి రోజు తీవ్రమైన హ్యాంగోవర్ ఉంటుంది.. అంటే తలనొప్పి, నీరసం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఆల్కహాల్ వల్ల శరీరంపై పడే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి నిపుణులు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు... ఇలా హ్యాంగోవర్ లేకుండాచేసే ముఖ్యమైన చిట్కాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. ఖాళీ కడుపుతో అస్సలు మందు తాగొద్దు
Image Credit : Asianet News

1. ఖాళీ కడుపుతో అస్సలు మందు తాగొద్దు

చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఖాళీ కడుపుతో ఆల్కహాల్ సేవించడం. తిన్నాక అయితే మందు ఎక్కువగా తాగలేమనేది చాలామమంది అభిప్రాయం. కానీ సరిగ్గా తినకుండ మందు తాగితే చాలా వేగంగా అది రక్తంలోకి కలిసిపోయి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకే మందు తాగే ముందు కడుపు నిండా మంచి ఆహారం తీసుకోవాలి.. ముఖ్యంగా ప్రోటీన్స్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ (ఆరోగ్యకరమైన కొవ్వులు) ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోండి. ఇవి ఆల్కహాల్ మీ శరీరంలోకి నెమ్మదిగా ఇంకేలా చేసి, ఒక్కసారిగా మత్తు తలకెక్కకుండా కాపాడుతాయి. అంతేకాదు తర్వాతిరోజు హ్యాంగోవర్ సమస్య లేకుండా చూస్తాయి.

Related Articles

Related image1
Alcohol: గోవా కాదు.. ఈ రాష్ట్రంలో తెలంగాణలో కంటే సగం ధరకే మందు, రీజన్ ఇదే
Related image2
No Alcohol Village: ఈ ఊళ్లో ఒక్కరు కూడా మందు తాగరు.. ఎవరినీ తాగనివ్వరు..!
36
2. మందులో పాటే నీళ్లు బాగా తాగండి
Image Credit : Freepik

2. మందులో పాటే నీళ్లు బాగా తాగండి

ఆల్కహాల్ శరీరంలోని నీటి శాతాన్ని వేగంగా తగ్గించేస్తుంది... ఇది డీహైడ్రేషన్ కు దారితీస్తుంది. కాబట్టి మందు తాగేటప్పుడు నీళ్లు బాగా తాగాలి. ఒక సింపుల్ రూల్ గుర్తుంచుకోండి.. ప్రతి డ్రింక్‌కు మధ్యలో కచ్చితంగా ఒక గ్లాస్ మంచి నీరు తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది, మరుసటి రోజు వచ్చే తీవ్రమైన హ్యాంగోవర్‌ను చాలా వరకు నివారించవచ్చు.

46
3. మందుని నిదానంగా సిప్ చేయండి (స్లోగా తాగండి)
Image Credit : Gemini AI

3. మందుని నిదానంగా సిప్ చేయండి (స్లోగా తాగండి)

కొందరు మళ్లీ దొరుకుతుందో లేదో అన్నట్లుగా ఆల్కహాల్ ను గటగటా తాగేస్తారు. ఇలా వేగంగా తాగేయడం అస్సలు మంచిది కాదు. మీరు ఎంత వేగంగా తాగితే రక్తంలో ఆల్కహాల్ స్థాయిలు (Blood Alcohol Levels) అంత వేగంగా దూసుకుపోతాయి. అందుకే ఆల్కహాల్‌ను ఎప్పుడూ స్లోగా సిప్ చేస్తూ తాగాలి. దీనివల్ల మీ కాలేయం (Liver) పై ఒత్తిడి తగ్గుతుంది, శరీరం ఆల్కహాల్‌ను జీర్ణం చేసుకోవడానికి తగిన సమయం దొరుకుతుంది.

56
4. మందు తాగాక కంటినిండా మంచి నిద్ర
Image Credit : Getty

4. మందు తాగాక కంటినిండా మంచి నిద్ర

మందు తాగడం పూర్తయిన తర్వాత శరీరానికి పూర్తి విశ్రాంతి అవసరం. ఆల్కహాల్ ప్రభావం శరీరం నుండి పూర్తిగా తొలగిపోవాలంటే రాత్రి వేళల్లో బాగా నిద్రపోవాలి. నిద్ర సరిగ్గా లేకపోతే మరుసటి రోజు ఉదయానికి హ్యాంగోవర్ మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తుంది. కాబట్టి తాగిన తర్వాత కంటినిండా నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి.

66
5. మందు ఎంత తాగాలతో ఓ లిమిట్ సెట్ చేసుకొండి
Image Credit : Getty

5. మందు ఎంత తాగాలతో ఓ లిమిట్ సెట్ చేసుకొండి

మందు తాగేటప్పుడు అన్నింటికంటే ముఖ్యమైనది స్వీయ నియంత్రణ. పార్టీ మూడ్‌లోకి వెళ్ళిన తర్వాత ఎంత తాగుతున్నామనే స్పృహ కోల్పోవడం సహజం. అందుకే మందు తాగడం ప్రారంభించే ముందే, ఈరోజు ఎంత మోతాదులో తాగాలో ఒక లిమిట్ సెట్ చేసుకోండి. ఎంత ఒత్తిడి ఉన్నా, స్నేహితులు బలవంతం చేసినా సరే... మీరు అనుకున్న పరిమితిని దాటి అస్సలు తాగకండి.

ఆరోగ్యం విషయంలో ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరించడం ముఖ్యం. ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు పైన పేర్కొన్న చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా హ్యాంగోవర్ బారిన పడకుండా తమ శరీరాన్ని కాపాడుకోవచ్చు. అయితే ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆరోగ్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు
Recommended image2
Wall Stickers: గోడపై అంటుకున్న స్టిక్కర్లను పెయింట్ పోకుండా ఇలా ఈజీగా తీసేయండి!
Recommended image3
Sleep Problems: నిద్రలో పదేపదే మెలకువ వస్తోందా? ఈ 5 విషయాలు చెక్ చేసుకోండి!
Related Stories
Recommended image1
Alcohol: గోవా కాదు.. ఈ రాష్ట్రంలో తెలంగాణలో కంటే సగం ధరకే మందు, రీజన్ ఇదే
Recommended image2
No Alcohol Village: ఈ ఊళ్లో ఒక్కరు కూడా మందు తాగరు.. ఎవరినీ తాగనివ్వరు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved