ప్రపంచ యుద్ధాల్లో పాల్గొన్న 5 అద్భుతమైన జంతువులు..
యుద్ధం అనగానే రెండు దేశాల మధ్య జరిగేదని మనకు తెలుసు కదా.. రెండు దేశాలకు చెందని సైనికులు తుపాకులు, బాంబులు, యుద్ధ ట్యాంకర్లు, విమానాలు ఉపయోగించి దాడులు చేసుకుంటారు. మరి ఇలాంటి కొన్ని యుద్ధాల్లో ఎలుగు బంట్లు, కుక్కలు, పావురాలు, సముద్రంలో ఉండే డాల్ఫిన్ కూడా పాల్గొన్నాయని మీకు తెలుసా.. ఇవిగో ఆ వివరాలు..
సార్జంట్ రెక్‌లెస్(గుర్రం)
కొరియా దేశానికి చెందిన ఓ యుద్ధంలో ఈ సార్జంట్ రెక్‌లెస్ గుర్రం పాల్గొంది. ఇది మంగోలియన్ జాతికి చెందిన గుర్రం. ఇది ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను, గాయపడిన సైనికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చింది. సార్జంట్ ర్యాంక్‌తోపాటు అనేక మెడల్స్ అందుకుంది.
వాజ్టెక్(ఎలుగు బంటి)
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో పాలిష్ దేశ సైనికులు వాజ్టెక్ అనే ఎలుగు బంటిని దత్తత తీసుకున్నారు. దీన్ని పేలుడు పదార్థాలు మోసేందుకు ఉపయోగించేవారు. దీని ధైర్యానికి సైనికులంతా ఆశ్చర్యపోయేవారు.
చెర్ ఎమీ(పావురం)
చెర్ ఎమీ అనే పావురాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించింది. 1918లో పుట్టిన ఈ పావురం సంవత్సర కాలం పాటు యుద్ధంలో సేవలందించింది. సుమారు 200 మంది సైనికులను కాపాడింది. ఒకసారి ఇది గాయపడినప్పటికీ సమాచారం తీసుకొచ్చి సైనికాధికారులకు ఇచ్చింది. దీని ధైర్య సాహసాలకు మెచ్చి బ్రేవరీ పతకాన్ని కూడా అమెరికా ఇచ్చింది.
సర్జెట్ స్టబ్బీ(కుక్క)
ఈ కుక్క రెండవ ప్రపంచ యుద్ధంలో హీరోగా నిలిచింది. అమెరికా సైన్యానికి ఎంతో సాయం చేసింది. ముఖ్యంగా శత్రు దేశాల వేసి గ్యాస్ దాడుల నుంచి అమెరికా సైన్యాన్ని ఎన్నోసార్లు కాపాడింది. 1916లో పుట్టిన ఈ కుక్క రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 18 నెలల్లో 17 యుద్ధాల్లో పాల్గొంది. ఏ జంతువుకు దక్కని సర్జట్ గౌరవాన్ని దక్కించుకుని రికార్డుల్లోకెక్కింది.
మిలిటరీ డాల్ఫిన్స్..
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన నేవీ దళం కొన్ని డాల్ఫిన్స్‌ను ఎంపిక చేసుకొని ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చాయి. వీటిని ఉపయోగించి సముద్రంలో నీటి అడుగున శత్రు సైన్యం దాచిన మైన్స్‌ను గుర్తించే వారు. అదేవిధంగా యుద్ధ నౌకలను రక్షించేందుకు వీటి ద్వారా సమాచారం సేకరించే వారు. డాల్ఫిన్స్ తెలివితేటలు ఎంత గొప్పగా ఉండేవంటే, చాలా సందర్భాల్లో నౌకలపై దాడులు జరగకుండా కాపాడగలిగారు.