బీర్ తో బోలెడు లాభాలు.. దీనితో అందమైన ముఖం మీ సొంతం
బీర్ ను ఇష్టంగా తాగేవారు చాలా మందే ఉన్నారు. కాక్టెయిల్స్ లో బేస్ డ్రింక్ గా ఉపయోగించే బీర్ ను లిమిట్ లో తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అంతేకాదు ఇది ఎన్నో చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది.

Image: Getty
బీర్ వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. బీర్ తో ఆరోగ్య ప్రయోజనాలే కావు.. బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. అవును బీర్ మన చర్మానికి, జుట్టుకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Image: Getty
బీర్ ఎందుకు అంత ప్రాచుర్యం పొందింది?
ఒక గ్లాసు చల్లటి బీరులో ఐస్ ముక్కలను ఎక్కువగా కలుపుకుని తాగడం వల్ల వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అందుకే చాలా మంది బీర్ ను తాగడానికి ఇష్టపడతారు. అంతేకాదు దీనిని తాగడం వల్ల హ్యాంగోవర్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించిన పరిశోధనా పత్రం.. జనవరి 2007 నుంచి ఏప్రిల్ 2020 వరకు అనేక పరిశోధనలను అధ్యయనం చేసింది. పరిమిత పరిమాణంలో బీర్ ను తాగడం వల్ల ఆరోగ్యంపై మంచి ప్రభావాలు పడ్డాయని వెళ్లడించింది.
ఆరు అధ్యయనాలలో ఐదింటిలో.. వారమంతా 385 గ్రాముల బీర్ ను తీసుకుంటే అది మితమైనదిగా పరిగణించబడుతుందని కనుగొనబడింది. ఇది గుండె ఆరోగ్యంపైనే కాకుండా డయాబెటిస్, మూత్రపిండాల ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మహిళలు 16 గ్రాములు, పురుషులు 28 గ్రాముల వరకు ఆల్కహాల్ తీసుకోవడం సురక్షితమని తేల్చి చెప్పారు.
బార్లీతో తయారు చేసిన బీర్ లో విటమిన్ బి, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. దీనిలో శోథ నిరోధక, ఎక్స్ఫోలియేటింగ్ లక్షణాలు చర్మానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిలకు బీర్ తో స్కిన్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. బీర్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. ముడతలు, సన్నని గీతలు తగ్గిపోతాయి. చర్మం ఆయిలీగా ఉండి తరచూ మొటిమలు అయ్యే వారికి కూడా బీర్ ప్రయోజనకరంగా ఉంటాయి. బీర్ తో ఎలాంటి బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయంటే?
Image: Getty
చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది
బీర్ ను ప్రాథమికంగా బార్లీ నుంచి తయారు చేస్తారు. అయితే టేస్ట్ కోసం దీనికి ఎన్నో రుచులను జోడిస్తారు. అయితే వీటన్నింటిలో ఉండే తేమ మీ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది.
Image: Getty
ముడతలను నివారిస్తుంది
యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే బీర్ యాంటీ ఏజింగ్ డ్రింక్ గా కూడా పరిగణించబడుతుంది. ఈ యాంటీఆక్సిడెంట్లు మీ చర్మంపై ముడతలు, సన్నని గీతలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. ముఖంపై ఉన్న సన్నని గీతలను తొలగించుకోవాలంటే ఇతర ఆల్కహాలిక్ డ్రింక్స్ కంటే పార్టీలో ఒక గ్లాసు బీర్ తీసుకోవడం మంచిది.
స్కిన్ టోన్
వయస్సు పెరిగే కొద్దీ చాలా మంది మహిళల ముఖంపై మచ్చలు ఏర్పడుతుంటాయి. కొన్నిసార్లు పోషకాహార లోపం, టానింగ్, ఎండవల్ల కూడా మచ్చలు అవుతుంటాయి. స్కిన్ టోన్ కూడా మారుతుంది. అయితే బీర్ ఈ సమస్యను పరిష్కరిస్తుంది. బీర్ లో ఈస్ట్ ఎంజైమ్ లు ఉంటాయి. ఇవి చర్మం ఒకే రంగులో ఉంచడానికి సహాయపడతాయి.
డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది
మీరు ఎండలో ఎక్కువగా ఉండటం, ఎప్పుడు ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల ముందు ఉండటం వల్ల మీ చర్మం వేగంగా వృద్ధాప్యానికి గురవుతుంది. చర్మం బయటి పొరలోని కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. దీని వల్ల మీ చర్మం మసకబారడం, నీరసంగా కనిపించడం ప్రారంభమవుతుంది. అయితే బీర్ లో ఉండే ఎక్స్ఫోలియేటింగ్ లక్షణాలు చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తాయి. అలాగే చర్మం మరింత శక్తివంతంగా, యవ్వనంగా కనిపిస్తుంది.