- Home
- Jobs
- SSC ఉద్యోగాల భర్తీ : ఎలాంటి పోటీ పరీక్ష లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్.. మీకు ఈ అర్హతలుంటే చాలు
SSC ఉద్యోగాల భర్తీ : ఎలాంటి పోటీ పరీక్ష లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్.. మీకు ఈ అర్హతలుంటే చాలు
Central Government Jobs 2025 : డిగ్రీ సర్టిఫికేట్స్ చేతబట్టుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు అద్భుత అవకాశం. ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాన్ని పొందవచ్చు.

స్టాప్ సెలెక్షన్ కమీషన్ ఉద్యోగాలు
Staff Selection Commission Recruitment : కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాల్లో ఉద్యోగాలను భర్తీచేస్తుంది స్టాఫ్ సెలెక్షన్ కమీషన్. ఇలాంటి సంస్థ తాజాగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న యువతీయువకులకు ఇది అద్భుత అవకాశం... ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే ఎస్సెస్సి ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. కాబట్టి డిగ్రీలో మంచి మెరిట్ కలిగివుండి, కమ్యూనికషన్ స్కిల్స్ బాగుండే విద్యార్థులు ఈజీగా ఉద్యోగాలను పొందవచ్చు.
SSC Jobs కు సంబంధించి ఫుల్ డిటెయిల్స్
స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ 05 యంగ్ ప్రొఫెషనల్ (జనరల్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
విద్యార్హతలు :
కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపుపొందిన యూనివర్సిటీ/ విద్యాసంస్థ నుండి డిగ్రీ పూర్తిచేసివుండాలి.
బేసిక్ కంప్యూటర్ కోర్సులు (సాప్ట్ వేర్) 1 ఇయర్ డిప్లోమా చేసివుండాలి. (MS Office పై పట్టుకోసం)
కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో కనీసం ఆరునెలల పనిచేసిన అనుభవం ఉండాలి.
వయో పరిమితి :
21 నుండి 35 ఏళ్లలోపు వయసువారు అర్హులు.
దరఖాస్తు ప్రక్రియ
దరఖాస్తులు ప్రారంభం :
నోటిఫికేషన్ వెలువడిన తేదీనుండి అంటే 09 అక్టోబర్ 2025 నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
దరఖాస్తులకు చివరి తేదీ :
నోటిఫికేషన్ విడుదలచేసిన రోజునుండి 14 రోజులపాటు దరఖాస్తు గడువుగా పేర్కొన్నారు. అంటే అక్టోబర్ 22 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నమాట.
స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ అధికారిక వెబ్ సైట్ లో యంగ్ ప్రొఫెషనల్స్ (జనరల్) అప్లికేషన్ ఫారం ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలతో ఫిల్ చేయండి. దీన్ని స్పీడ్ పోస్ట్ లో
The Under Secretary (Admn.-I),
Staff Selection Commission (HQs), Room No.712, Block No.12, CGO Complex, Lodhi
Road, New Delhi-110003
అడ్రస్ కు పంపించాలి.
ఎంపిక ప్రక్రియ
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కేవలం ఇంటర్వ్యూ, డిగ్రీలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి పోటీ పరీక్ష ఉండదన్నమాట.
ఎంపికైన అభ్యర్థులకు చేయాల్సిన పనులివే..
- హిందీ లేదా ఇంగ్లీష్ లో అఫిషియల్ కమ్యూనికేషన్ చేయగలగాలి.
- ఎంఎస్ ఆఫీస్ (MS Word, MS Excel, MS Power Point) అనుభవం ఉండాలి.
- డాక్యుమెంట్ స్క్రూటినీ చేయగలగాలి.
- సీనియర్ అధికారులతో కోఆర్డినేషన్ తో వర్క్ చేసుకోవాలి.
- అధికారులు కేటాయించిన పనులు టైమ్ టు టైమ్ చేయాలి.
సాలరీ
నెలనెలా రూ.40,000 సాలరీ, ఇతర అలవెన్సులు వర్తిస్లాయి. కాంట్రాక్ట్ పరిమతి పెంచితే సాలరీ కూడా పెరుగుతుంది.
గమనిక : కేవలం ఏడాది పాటు కాంట్రాక్ట్ పద్దతిలో ఈ ఉద్యోగులను నియమిస్తోంది SSC. పనితీరు, అవసరాన్ని బట్టి కాంట్రాక్ట్ పొడిగించవచ్చు.
యంగ్ ప్రొఫెషియనల్ (లీగల్ కన్సల్టెంట్) ఉద్యోగాలు
లా డిగ్రీ పూర్తిచేసినవారికి కూడా SSC ఉద్యోగావకాశం కల్పిస్తోంది.. యంగ్ ప్రొఫెషియనల్ (లీగల్ కన్సల్టెంట్) 01 పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU) లేదా ఇతర గుర్తింపుపొందిన లా స్కూల్స్ లేదా కాలేజీల నుండి 60 శాతం మార్కులతో లా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. 2 ఏళ్లు పనిచేసిన అనుభవం కలిగివుండాలి. 32 ఏళ్లలోపు వయసు కలిగివుండాలి.
ఈ ఉద్యోగాన్ని పొందిన అభ్యర్థికి నెలనెలా రూ.60,000 జీతం, ఇతర అలవెన్సులు లభిస్తాయి. ఇది కూడా కాంట్రాక్ట్ పద్దతిలోనే నియమిస్తున్న ఉద్యోగమే… కేవలం ఏడాదిపాటు పనిచేయాల్సి ఉంటుంది. పనితీరు, అవసరాాన్ని బట్టి ఈ కాంట్రాక్ పీరియడ్ పొడిగించవచ్చు… ఇదే జరిగితే సాలరీ కూడా పెరుగుతుంది.