Jobs : పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు.. ఏకంగా రూ.80 లక్షల జీతమే..!
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకు SBI లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అలాగే IRCTC లో కూడా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.

SBI లో ఉద్యోగాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొత్త ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే మినిమం డిగ్రీ పాసై ఉండాలి. బ్యాంకింగ్, ఐటీ లేదా ఈ-కామర్స్ రంగాల్లో కనీసం 15 ఏళ్ల అనుభవం అవసరం. అభ్యర్థి వయసు 50 ఏళ్లు మించకూడదు.
SBI ఉద్యోగాాల ఎంపిక ప్రక్రియ
ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. మొదట దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. తర్వాత అర్హులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు 5 ఏళ్ల కాంట్రాక్టుపై పనిచేయాలి. సీనియర్ పోస్టులకు జీతం రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఉండొచ్చు.
శాలరీ ఎంత?
డిప్యూటీ మేనేజర్ పోస్టులకు నెల జీతం రూ.64,820 నుంచి రూ.93,960 వరకు ఉంటుంది. బ్యాంకింగ్, టెక్నాలజీలో అనుభవం ఉన్నవారికి ఇది మంచి అవకాశం. ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగ భద్రత, అధిక జీతం, బాధ్యతాయుతమైన పదవి జీవితాన్ని మార్చేస్తాయి.
ఐఆర్సిటిసి ఉద్యోగాలు
ఇదిలావుంటే IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) లో కూడా 43 హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఎంపిక ప్రక్రియ
ఈ పోస్టులకు గరిష్ట వయోపరిమితి 27 ఏళ్లు. రిజర్వేషన్ల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. భోపాల్, ముంబై, గోవా, అహ్మదాబాద్‌లలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చూడండి.

