- Home
- Jobs
- RBI Jobs : నెలకు రూ.1,14,900 సాలరీ+అలవెన్సులు ... బ్యాంకింగ్ కింగ్ ఆర్బిఐలో ఆఫీసర్ ఉద్యోగాలు
RBI Jobs : నెలకు రూ.1,14,900 సాలరీ+అలవెన్సులు ... బ్యాంకింగ్ కింగ్ ఆర్బిఐలో ఆఫీసర్ ఉద్యోగాలు
RBI Jobs : భారతదేశంలో బ్యాకింగ్ కింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 120 గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

RBI జాబ్స్ నోటిఫికేషన్ ఫుల్ డిటెయిల్స్
RBI Jobs : ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్దమయ్యే నిరుద్యోగ యువతకు అద్భుత అవకాశం. మరీముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో వైట్ కాలర్ జాబ్స్ కోరుకునేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గుడ్ న్యూస్ చెబుతోంది. ఏదో ప్రభుత్వరంగ బ్యాంకులో కాదు దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఆర్బిఐలోనే ఉద్యోగాలు చేసే ఛాన్స్ వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ B ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది చాలా మంచి జీతం వచ్చే ఉద్యోగం. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యింది... మీకు తగిన అర్హతలుంటే వెంటనే అప్లై చేసుకొండి.
RBI లో భర్తీచేసే ఉద్యోగాల వివరాలు
సెప్టెంబర్ 10న అంటే నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 120 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రేడ్ B కేటగిరీలో జనరల్, DEPR, DSIM విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దేశంలోనే అత్యున్నత బ్యాంకు ఆర్బిఐలో ఉద్యోగాలు చేయాలని కలలుగనే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. సెప్టెంబర్ 30, సాయంత్రం 6 గంటలవరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
RBI ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలు
ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి - జనరల్ :
60శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ (ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యూడి అయితే 50 శాతం) లేదా 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలి (ఎస్టి, ఎస్టి, పిడబ్ల్యూడి అయితే కనీసం పాస్ మార్కులుంటే చాలు). సిఏ పూర్తిచేసిన అభ్యర్థులు కూడా అర్హులే
ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి - DEPR :
ఎకనామిక్స్/ఫైనాన్స్/ఎకనామెట్రిక్స్ లో 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ లేదంటే ఎంబిఏ/పిజిడిఎం ఫైనాన్స్ 55 శాతం మార్కులతో పూర్తిచేసివుండాలి. టీచింగ్ లేదా రీసెర్చ్ విభాగంగా పనిచేసేవారికి వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి -DSIM :
స్టాటిస్టిక్స్/మ్యాథేమటిక్స్/ఎకనామెట్రిక్స్ లో 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ లేదా M.Stat From ISI లేదా PGDBA from Kolkata, ఐఐటి ఖరగ్ పూర్ ఆండ్ ఐఐఎం కలకత్తా నుండి 55 శాతం మార్కులతో పూర్తిచేయాలి.
RBI ఉద్యోగాలకు వయోపరిమితి
ఈ ఉద్యోగాల కోసం ప్రయత్నించ అభ్యర్థులు వయస్సు 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 1 సెప్టెంబర్ 2025 వరకు ఈ వయసు ఉండాలి. రిజర్వేషన్ ఉన్నవారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎస్సి, ఎస్టి - 5 ఏళ్ల సడలింపు
ఓబిసి - 3 ఏళ్ల సడలింపు
PwBD - 10 ఏళ్ల సడలింపు
PwBD+OBC - 13 ఏళ్ల సడలింపు
PwBD+SC/ST - 15 ఏళ్ల సడలింపు
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
RBI అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.
జనరల్, ఓబిసి కేటగిరీ వారికి ₹850+18% GST,
రిజర్వేషన్ ఉన్నవారికి అంటే ఎస్సి, ఎస్టి, PwD అభ్యర్థులకు ₹100+18% GST ఫీజు ఉంటుంది.
RBI ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఇందులో మూడు దశలు ఉంటాయి.
ఫేజ్ 1 - ప్రిలిమినరీ ఎగ్జామ్ (ఆబ్జెక్టివ్) - ఆన్లైన్ లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. ఇందులో క్వాలిఫై అయితేనే ఫేజ్ 2 కు అర్హత సాధిస్తారు.
ఫేజ్ 2 - మెయిన్స్ ఎగ్జామ్ (ఆబ్జెక్టివ్+డిస్క్రిప్టివ్) - ఎకనామిక్స్ ఆండ్ సోషల్ ఇష్యూస్, ఇంగ్లీష్ రైటింగ్, ఫైనాన్స్ ఆండ్ మేనేజ్మెంట్ ఇలా 3 పేపర్లు ఉంటాయి.
ఫేజ్ 3 - ఇంటర్వ్యూ - 50 మార్కులకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. నాలెడ్జ్, కమ్యూనికేషన్స్, కాన్ఫిడెంట్ ను చెక్ చేస్తారు.
ఈ ఆర్బిఐ గ్రేడ్ బి ఉద్యోగాలకు జనరల్ కేటగిరీ అభ్యర్థులు కేవలం 6 సార్లు మాత్రమే అంటెప్ట్ చేయవచ్చు. తర్వాత వారికి అవకాశం ఉండదు. ఇక ఎస్సి, ఎస్టి, PwBD అభ్యర్థులు ఎన్నిసార్లయినా ప్రయత్నించవచ్చు.
RBI గ్రేడ్ బి ఉద్యోగులకు శాలరీ
జీతం ₹78,450 నుండి ₹1,14,900 వరకు ఉంటుంది. 16 ఏళ్లలో సాలరీ అత్యధికంగా ₹1,41,600 చేరుతుంది. ఇక డిఏ, హెచ్ఆర్ఏ, ఫ్యామిలీ, కన్వినెన్స్ వంటి అలవెన్సులు ఉంటాయి.