రాత పరీక్ష లేదు, ఫ్రీ అప్లికేషన్ .. పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు
Government Jobs : కేంద్ర ప్రభుత్వ సంస్థ ఓఎన్జిసి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ అనుభవం, కెరీర్ ఎదుగుదల కోరుకునే అభ్యర్ధులు వెంటనే అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, దరఖాస్తు ఫీజు లేదు.

యువతకు అద్భుత అవకాశం
Jobs : భారత ప్రభుత్వరంగ సంస్థలో శిక్షణ పొందేందుకు యువతకు అద్భుత అవకాశం... ఆయిల్ ఆండ్ నేచురల్ గ్యాస్ (ONGC) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ అనుభవంతో పాటు శిక్షణ అందించి ఆయా విభాగాల్లో అనుభవజ్ఞులుగా మారే అవకాశాన్ని కల్పిస్తోంది ఓఎన్జిసి. మరి ఇంకెందుకు ఆలస్యం... మీకు తగిన అర్హతలుంటే వెంటనే కేంద్ర ప్రభుత్వ సంస్థలో అప్రెంటిస్ షిప్ చేయండి... మీ కెరీర్ ను మెరుగుపర్చుకోండి.
ఓఎన్జిసి ఉద్యోగాల భర్తీ ప్రకటన
ONGC సంస్థలో మొత్తం 2623 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. 10వ తరగతి నుంచి బిటెక్ వరకు చదివిన యువతీయువకులకు అవకాశం కల్పిస్తున్నారు... అంటే అతి తక్కువ విద్యార్హతలు కలిగినవారు కూడా ఓఎన్జిసిలో అప్రెంటిస్ షిప్ చేయవచ్చు. ఎలాంటి రాతపరీక్ష లేదు... కేవలం మెరిట్ ఆధారంగా ఉద్యోగావకాశం కల్పిస్తున్నారు.
భారతదేశం అంతటా ఓఎన్జిసి కార్యకలాపాలు సాగిస్తుంటుంది... కాబట్టి అన్ని ప్రాంతాల్లోనూ యువతకు ఈ అప్రెంటిస్ షిప్ అవకాశం కల్పిస్తున్నారు. మొత్తం 2623 పోస్టుల్లో నార్తర్న్ సెక్టార్ లో 165, ముంబై సెక్టార్ లో 569, వెస్టర్న్ సెక్టార్ లో 856, ఈస్టర్న్ సెక్టార్ 458, సౌతర్న్ సెక్టార్ 322, సెంట్రల్ సెక్టార్ లో 253 పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు
ఎలక్ట్రిషన్, ఫిట్టర్, సివిల్ ఎగ్జిక్యూటివ్, కెమిస్ట్, మెకానిక్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ తో పాటు మరికొన్ని పోస్టులకు ONGC అప్రెంటిస్ షిప్ అవకాశం కల్పిస్తోంది.
విద్యార్హతలు :
ONGC లో అప్రెంటిస్ షిప్ కోసం పదవ తరగత, ఇంటర్మీడియట్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, B.E/B.Tech అర్హత ఉండాలి.
వయో పరిమితి :
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి (06.11.2025 నాటికి). ఎస్సి, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబిసిలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు (PwBD) 10 నుండి 15 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంది.
దరఖాస్తు ప్రక్రియ
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 17 అక్టోబర్ 2025
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ : 06 నవంబర్ 2025
ఎంపికైన అభ్యర్థుల జాబితాను 26 నవంబర్ 2025 లో ప్రకటిస్తారు.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://ongcindia.com లేదా https://apprenticeshipindia.gov.in లేదా https://nats.education.gov.in అధికారిక వెబ్‌సైట్స్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు. దరఖాస్తు చేసే ముందు, అధికారిక నోటిఫికేషన్‌లోని అన్ని అర్హతలు, షరతులను పూర్తిగా చదివి నిర్ధారించుకోవాలి.
ఎంపిక ప్రక్రియ
ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు. అభ్యర్థులను కేవలం మార్కుల మెరిట్ జాబితా ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి నేరుగా ఎంపిక చేస్తారు. ఎంపిక తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
సాలరీ
ONGC సంస్థ అప్రెంటిస్ పోస్టుల కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. ఈ పోస్టులకు నెలవారీ జీతం రూ.8,200 నుంచి రూ.12,300 వరకు ఉంటుంది. సాలరీతో పాటు ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - రూ.12,300
డిప్లోమా అప్రెంటిస్ : రూ.10,900
ట్రేడ్ అప్రెంటిస్ (10, ఇంటర్మీడియట్) : రూ.8,200
ట్రేడ్ అప్రెంటిస్ (ఐటిఐ, 1 ఇయర్) : రూ.9,600
ట్రేడ్ అప్రెంటిస్ (ఐటిఐ, 2 ఇయర్స్) : రూ.10,560