నెలకు రూ.177500 సాలరీ, ఇతర అలవెన్సులు ... భారత వాయుసేనలో ఉద్యోగాల భర్తీ
Air Force Jobs : లక్షల జీతంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దేశభక్తిని చాటుకుంటూనే మంచి సాలరీని పొందవచ్చు. కాబట్టి యువతకు ఇది అద్భుత అవకాశం.

భారత వాయుసేనలో ఉద్యోగాలు
India Air Force Recruitment 2025 : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్... భారత వాయుసేనలో ఉద్యోగాలను పొందే అవకాశం వచ్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 280 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. దేశానికి ప్రత్యక్షంగా సేవ అందించడంతోనే పాటు మంచి కెరీర్ ను కోరుకునేవారికి ఇది అద్భుత అవకాశం. అన్ని అర్హతలుండి వాయుసేనలో ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకొండి.
వాయుసేనలో భర్తీచేయనున్న ఖాళీల వివరాలు
AFCAT (Air Force Common Admission Test) ఎంట్రీ (ప్లైయింగ్)
AFCAT ఎంట్రీ గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)
AFCAT ఎంట్రీ గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్)
NCC స్పెషల్ ఎంట్రీ (ప్లైయింగ్)
వాయుసేన ఉద్యోగాల భర్తీకి ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 10 నవంబర్ 2025
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ : 09 డిసెంబర్ 2025
దరఖాస్తు ఫీజు రూ. 550 (జనరల్, ఎస్సి, ఎస్టి, ఓబిసి అభ్యర్థులందరికీ)
afcat.cdac.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
వయో పరిమితి
ఫ్లయింగ్ బ్రాంచ్ : 20 నుండి 24 ఏళ్లు వయసు అభ్యర్థులు
గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ ఆండ్ నాన్ టెక్నికల్) : 20 నుండి 26 ఏళ్ల వయసు గలవారు అర్హులు.
ఎస్సి ఎస్టిలకు 5 ఏళ్లు, ఓబిసిలకు 3 ఏళ్లు , పిడబ్ల్యుడి గరిష్టంగా 15 ఏళ్లు సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ కు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
విద్యార్హతలు, ఎంపిక ప్రక్రియ
ఇంటర్మీడియట్ తో పాటు డిగ్రీ అర్హతలతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ తో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
వాయుసేన ఉద్యోగుల సాలరీ
AFCAT ఎంట్రీ (ప్లయింగ్) – రూ.56,100/- నుండి రూ.1,77,500/-
AFCAT ఎంట్రీ గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్) – రూ.56,100/- నుండి రూ.1,77,500/-
AFCAT ఎంట్రీ గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్) – రూ.56,100/- నుండి రూ.1,77,500/-
NCC స్పెషల్ ఎంట్రీ (ఫ్లయింగ్) – రూ.56,100/- నుండి రూ.1,77,500/-
అనుభవం, ప్రమోషన్‌ను బట్టి పెరుగుతుంది. బోనస్, HRA, TA, DA లాంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి.
దేశ రక్షణలో పాలుపంచుకోవాలనుకునే అర్హులైన యువత దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం afcat.cdac.in ను సందర్శించండి. ఈ అవకాశంతో మీ కలల ఉద్యోగం పొందండి.