రూ.67,000 జీతంతో గెజిటెడ్ పోస్టులు : మీకు ఈ అర్హతలుంటే సుప్రీం కోర్టులో ఉద్యోగం
సుప్రీం కోర్టులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మీకు ఈ అర్హతలుంటే వెంటనే దరఖాస్తు చేసుకొండి.
Supreme Court Jobs
Supreme Court Jobs : భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఉద్యోగాన్ని పొందే అద్భుత అవకాశం. మీరు డిగ్రీ పూర్తిచేసి వుంటే చాలు... ఈ ఉద్యోగాలను పొందవచ్చు. ఇప్పటికే మొత్తం 107 ఉద్యోగాల భర్తీకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేయడమే కాదు దరఖాస్తు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. మీరు డిగ్రీ పూర్తిచేసి నోటిఫికేషన్ లో పేర్కొన్న అన్ని అర్హతలు కలిగివుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
సుప్రీం కోర్టులో భర్తీ చేసే ఉద్యోగాలు :
కోర్ట్ మాస్టర్ (షార్ట్ హ్యాండ్) - గ్రూప్ ఏ గెజిటెడ్ పోస్టులు - 31 ఖాళీల భర్తీ
సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ - గ్రూప్ బి నాన్ గెజటెడ్ పోస్టులు - 33 ఖాళీల భర్తీ
పర్సనల్ అసిస్టెంట్ - గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టులు - 43 ఖాళీల భర్తీ
అర్హతలు :
కోర్ట్ మాస్టర్ ఉద్యోగాలు :
1. గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి లా డిగ్రి పూర్తిచేసి వుండాలి.
2. షార్ట్ హ్యాండ్ (ఇంగ్లీష్) లో నైపుణ్యం కలిగివుండాలి. స్పీడ్ 120 w.p.m గా వుండాలి.
3. కంప్యూటర్ ఆపరేటింగ్ పై అనుభవం వుండాలి. టైపింగ్ స్పీడ్ 40 w.p.m గా వుండాలి.
4. కనీసం ఐదేళ్ల అనుభవం వుండాలి. ప్రైవేట్ లో గాని ప్రభుత్వంలో గానీ సీనియర్ పిఎ, పిఎ, సినీయర్ స్టెనోగ్రాఫర్ గా పనిచేసి వుండాలి.
సీనియర్ పర్సనల్ అసిస్టెంట్
1. గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తిచేసి వుండాలి.
2. షార్ట్ హ్యాండ్ (ఇంగ్లీష్) లో నైపుణ్యం కలిగివుండాలి. స్పీడ్ 110 w.p.m గా వుండాలి.
3. కంప్యూటర్ ఆపరేటింగ్ పై అవగాహన కలిగివుండాలి. టైపింగ్ స్పీడ్ 40 w.p.m వుండాలి.
పర్సనల్ అసిస్టెంట్ :
1. గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తిచేసి వుండాలి.
2. షార్ట్ హ్యాండ్ (ఇంగ్లీష్) లో నైపుణ్యం కలిగివుండాలి. స్పీడ్ 100 w.p.m గా వుండాలి.
3. కంప్యూటర్ ఆపరేటింగ్ పై అవగాహన కలిగివుండాలి. టైపింగ్ స్పీడ్ 40 w.p.m వుండాలి.
వయో పరిమితి :
కోర్ట్ మాస్టర్ (షార్ట్ హ్యాండ్) ; 30 నుండి 45 ఏళ్లలోపు వయసు కలిగివుండాలి.
సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ : 18 నుండి 30 ఏళ్లలోపు వయసు వుండాలి.
పర్సనల్ అసిస్టెంట్ : 18 నుండి 30 ఏళ్లలోపు వయసు వుండాలి.
అన్ని పోస్టులకు ఎస్సి,ఎస్టి, ఓబిసి, దివ్యాంగులు, మాజీ సైనికులకు సడలింపు వుంటుంది.
సాలరీ :
కోర్ట్ మాస్టర్ : రూ.67,700
సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ : రూ.47,600
పర్సనల్ అసిస్టెంట్ : 44,900
దరఖాస్తు ప్రక్రియ :
నోటిఫికేషన్ లో పేర్కొన్న అర్హతలు, వయసు కలిగిన అభ్యర్థులు సుప్రీం కోర్ట్ వెబ్ సైట్ www.sci.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఆన్ లైన్ ద్వారానే దరఖాస్తులు స్వీకరిస్తారు. డిసెంబర్ 4 అంటే గత బుధవారం నుండే అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది.
జనరల్, ఓబిసి అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1000. ఇక ఎస్సి, ఎస్టి, మాజీ సైనికులు, దివ్యాంగులకు కేవలం రూ.250 మాత్రమే. ఈ అప్లికేషన్ ఫీజు రీపండ్ చేయబోరు.
ఎంపిక విధానం :
ముందుగా కంప్యూటర్ లో టైపింగ్ స్పీడ్ టెస్ట్ చేస్తారు. అందులో అర్హత సాధించినవారికి స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. వీటన్నింటి ఆధారంగానే అభ్యర్థులను ఫైనల్ చేస్తారు.
టెస్టింగ్ సెంటర్లు :
అహ్మదాబాద్, అంబాలా, బెంగళూరు, బోపాల్, భువనేశ్వర్, చెన్నై, డిల్లీ, ఎర్నాకులం, గౌహతి, హైదరాబాద్, జబల్ పూర్, జైపూర్, కాన్పూర్, కోల్ ్తా, లక్నో, ముంబై, మైసూరు, నాగపూర్, పాట్నా, ప్రయాగ్ రాజ్, పూణే, ఉయయ్ పూర్, విశాఖపట్నం నగరాల్లో ఏవయినా మూడింటిని టెస్ట్ సెంటర్లుగా ఎంచుకోవాలి.వాటిలో ఏదో ఒకచోట పరీక్ష రాయవచ్చు. ఎక్కడనేది అధికారులు నిర్ణయిస్తారు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులు ప్రారంభ తేదీ ; 04-12-2024
దరఖాస్తుల చివరి తేదీ ; 25-12-2024