సింగరేణి ఉద్యోగ నోటిఫికేషన్ 2021 విడుదల.. ఐటిఐ అర్హత ఉన్న వారు వెంటనే ధరఖాస్తు చేసుకోండీ.
ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న దేశంలోని అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి కేంద్రంలో ఒకటైన సింగరేణి బొగ్గు గణిలో (ఎస్‌సిసిఎల్)వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రెయినీ పోస్టుల భర్తీకి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రారంభ తేదీ 22 జనవరి 2021 నుండి 4 ఫిబ్రవరి 2021 వరకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది.
ఈ పోస్టులకు లోకల్, నాన్‌లోకల్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే జూనియర్ స్టాఫ్ నర్స్ పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు మరింత పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://scclmines.com/చూడొచ్చు.ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలను లోకల్ గా పరిగణిస్తారు. అలాగే తెలంగాణలోని మిగతా అన్నీ జిల్లాలను నాన్-లోకల్ గా పరిగణిస్తారు.
మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య : 372
ఫిట్టర్- 128 (లోకల్ 105, జనరల్ 23)
ఎలక్ట్రిషియన్- 51 (లోకల్ 43, జనరల్ 8)
వెల్డర్-54 (లోకల్ 44, జనరల్10)
టర్నర్ లేదా మెషినిస్ట్ ట్రైనీ- 22 (లోకల్ 18, జనరల్ 4)
మోటార్ మెకానిక్ ట్రైనీ-14 (లోకల్ 12, జనరల్ 2)
ఫౌండర్ మెన్/మౌల్డర్ ట్రైనీ-19 (లోకల్ 16, జనరల్ 3)
జూనియర్ స్టాఫ్ నర్స్-84 (లోకల్ 67, జనరల్ 17)
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. దరఖాస్తు చేసేటప్పుడు సర్టిఫికెట్ల సాఫ్ట్‌కాపీలను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి.
దరఖాస్తు చేసుకునే విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్ లైన్ మోడ్ ధరఖాస్తులు స్వీకరించబడవు.
దరఖాస్తుల ప్రారంభం తేదీ : 22 జనవరి 2021
దరఖాస్తు చివరితేదీ: 4 ఫిబ్రవరి 2021
అధికారిక వెబ్‌సైట్:https://scclmines.com/
గమనిక: ధరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్ధులు అర్హత, వయో పరిమితులను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.