ఇంటర్ చదివుంటే చాలు... 2006 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒకటి మీదే కావచ్చు...
కేవలం ఇంటర్మీడియట్ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందే అద్భుత అవకాశం.... భారీ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.. పూర్తి డిటెయిల్స్ కోసం ఈ కథనం పూర్తిగా చదవండి....
Staff Selection Commission
ప్రభుత్వ ఉద్యోగం... ఎందరో నిరుద్యోగుల కల. డిగ్రీలు, పీజీలు, పిహెచ్‌డిలు చేసినవారు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాస్తుంటారు. అయితే చాలా ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్ విద్యార్హతగా వుంటుంది. చాలా తక్కువ ఉద్యోగాలు తక్కువ విద్యార్హతతో వెలువడతాయి. ఇలా కేవలం ఇంటర్మీడియట్ విద్యార్హతతో తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Staff Selection Commission
కేంద్ర ప్రభుత్వంలోని పలు ఉద్యోగాలను స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఇలాంటి ఉద్యోగాల్లో స్టెనోగ్రాఫర్ ఒకటి... ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. స్టెనోగ్రాఫర్ గ్రెడ్ సి, గ్రేడ్ డి ఉద్యోగాల భర్తీకి SSC నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2006 స్టెనోగ్రాఫర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
Staff Selection Commission
దరఖాస్తు ప్రక్రియ :
స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి గత నెలలోనే నోటిఫికేషన్ జారీచేసింది స్టాఫ్ సెలక్షన్ కమీషన్. అంటే జూలై 26 నుండే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది. ఈ నెల (ఆగస్ట్) 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్ సైట్ www.ssc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Staff Selection Commission
ఈ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు ఎస్సి, ఎస్టి, దివ్యాంగులు ఎలాంటి ఫీజు లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ మరియు ఓబిసి అభ్యర్థులు రూ.100 రూపాయలు దరఖాస్తు పీజు చెల్లించాల్సి వుంటుంది.
Staff Selection Commission
వయసు :
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు 18-30 ఏళ్లలోపు వుండాలి. అంటే అభ్యర్థి 02.08.1994 నుండి 01.08.2006 మధ్య జన్మించి వుండాలి. అంటే 01.08.2024 నాటికి 18 ఏళ్లకు తక్కువ కాకుండా, 30 ఏళ్లకు ఎక్కువ కాకుండా వయసు వుండాలి.
Staff Selection Commission
ఇక స్టెనోగ్రాఫర్ డి పోస్టులకు పోటీపడే అభ్యర్థుల వయసు 18-27 ఏళ్ళలోపు వుండాలి. అంటే 02.08.1998 నుండి 01.08.2007 మధ్య జన్మించి వుండాలి. అంటే 01.08.2024 నాటికి 18 ఏళ్ల నుండి 27 ఏళ్ల మధ్య వయసుండాలి.
అయితే ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబిసిలకు 3 ఏళ్లు వయసు సడలింపు వుంటుంది. పీడబ్యుడి లకు 10-15 ఏళ్ల వయో పరిమితి సడలింపు వుంటుంది.
Staff Selection Commission
పరీక్షా విధానం :
జనరల్ ఇంటెలిజెన్స్ ఆండ్ రీజనింగ్, జనరల్ అవేర్ నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆండ్ కాంప్రహెన్షన్ టెస్ట్ వుంటుంది. ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్ష. జనరల్ అవేర్ నెస్ 50 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ ఆండ్ రీజనింగ్ 50 ప్రశ్నలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆండ్ కాంప్రహెన్షన్ 100 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 200 మార్కులుంటాయి. 2 గంటల పాటు పరీక్ష వుంటుంది.
Staff Selection Commission
ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ వుంటాయి. ఇంగ్లీష్ తో పాటు హిందీలో ప్రశ్నలు వుంటాయి. ఈ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ వుంటుంది. అంటే తప్పుడు జవాబుకు 0.25 మార్కులు కట్ చేస్తారు... అంటే నాలుగు తప్పుడు జవాబులకు ఒక మార్కు కట్ అవుతుంది.
Staff Selection Commission
ఇప్పటికే స్టెనోగ్రాఫర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది... ఇది ముగిసిన తర్వాత వీటిని పరిశీలన వుంటుంది. అభ్యర్థులకు అక్టోబర్ లేదా నవంబర్ లో కంప్యూటర్ పరీక్ష వుంటుంది. పరీక్ష తేదీ ఖరారు తర్వాత హాల్ టికెట్లను విడుదల చేస్తారు.