Jobs: హైదరాబాద్ లో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా.?
చెన్నై ఉద్యోగాల పరంగా అగ్రస్థానంలో ఉండగా, జీతాల పరంగా హైదరాబాద్‌కి వెరే లెవెల్ గౌరవం దక్కింది. భవిష్యత్తులో కూడా ఈ నగరాలు దేశ ఉద్యోగ రంగానికి మద్దతుగా నిలిచే అవకాశముంది.
- FB
- TW
- Linkdin
Follow Us

ప్రెషర్స్ కి బెస్ట్ చెన్నై
దేశవ్యాప్తంగా ఉద్యోగాల కోసం పోటీ కొనసాగుతున్న సమయంలో, చెన్నై నగరం మరో కీలకమైన మైలురాయిని చేరింది. జులై 2025లో దేశంలోని ప్రధాన నగరాల మధ్య ఉద్యోగ అవకాశాల పరంగా చెన్నై అగ్రస్థానాన్ని సాధించింది. కొత్తగా ఉద్యోగంలో చేరాలి అనుకునే వారికి చెన్నై నగరం 30 వేల రూపాయల జీతంతో స్వాగతం పలుకుతోంది.ఇతర నగరాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.
పెద్ద సంఖ్యలో అవకాశాలు
ఈ గణాంకాలు ప్రముఖ ఉద్యోగ వెబ్‌సైట్ విడుదల చేసిన తాజా నివేదిక ఆధారంగా వెల్లడయ్యాయి. పలు సంస్థలు వివిధ రంగాల్లో ఉద్యోగాలను ప్రకటించగా..ముఖ్యంగా ఐటీ, బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్), హెల్త్‌కేర్, ఎడుటెక్, లాజిస్టిక్స్, రీటెయిల్ వంటి విభాగాల్లో పెద్ద సంఖ్యలో అవకాశాలు ఎదురు చూస్తున్నాయి.
హైదరాబాద్ టాప్
ఉద్యోగాల సంఖ్య కంటే జీతాల పరంగా హైదరాబాద్ అన్ని నగరాల కంటే టాప్ లో నిలిచింది.హైదరాబాద్‌లో మిడ్ సీనియర్ స్థాయి ఉద్యోగాలకు నెల జీతం సగటున రూ.69,700గా ఉంది. ఇది ఈ స్థాయి ఉద్యోగాల్లో దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే అత్యుత్తమం. మిడ్ సీనియర్ స్థాయి అంటే అనుభవం కలిగి ఉండే, మెటీరియల్ హ్యాండ్లింగ్ చేయగల ఉద్యోగులు. ఐటీ రంగంతో పాటు, డేటా అనలిటిక్స్, ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్, డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ అనాలిసిస్ వంటి విభాగాల్లో ఈ స్థాయి ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది.
తరువాత బెంగళూరు
హైదరాబాద్‌కు తరువాత బెంగళూరులో ఇదే స్థాయి ఉద్యోగానికి నెల జీతం సగటున రూ.67,800గా ఉంది. ముంబయిలో రూ.65,000, చెన్నైలో రూ.62,900గా నమోదు అయింది. ఈ గణాంకాలు నగరాల మధ్య జీతాల్లో గల తేడాలను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఉద్యోగాల పరంగా చెన్నై ముందుండగా, జీతాల్లో మాత్రం హైదరాబాద్ మెరుగ్గా ఉంది.ఇంకా జూనియర్ స్థాయి ఉద్యోగాల విషయానికి వస్తే, బెంగళూరులో మొదటి స్థానం ఉంది. అక్కడ నెల జీతం సగటున రూ.36,200గా ఉంది. అదే సమయంలో, చెన్నైలో రూ.34,800, హైదరాబాద్‌లో రూ.34,100, ముంబయిలో రూ.33,900గా నమోదయ్యాయి.
మిడ్ సీనియర్ స్థాయిలో
జాబ్ ట్రెండ్స్ విశ్లేషణలో భాగంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉద్యోగ అభివృద్ధి వేగంగా జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. కొత్త టెక్నాలజీలు, స్టార్టప్‌లు పెరుగుతుండటంతో, IT, AI, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో డిమాండ్ పెరుగుతోంది.ఇక కంపెనీలు ఉద్యోగులను ఆకర్షించేందుకు జీతాల్లో స్పష్టమైన పెరుగుదలని చూపిస్తున్నాయి. ముఖ్యంగా టాలెంట్‌ను నిలుపుకునేందుకు, మిడ్ సీనియర్ స్థాయిలో ఉన్న ఉద్యోగులకు బోనస్‌లు, పనికి అనుగుణంగా ఫ్లెక్సిబుల్ వర్క్ ఆప్షన్లు వంటి ప్రయోజనాలను కల్పిస్తున్నాయి.
ఉద్యోగాల్లో 60% వరకు
ఈ నివేదిక ప్రకారం, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఉద్యోగాల కోసం వెతుకుతున్నవారి సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 18% పెరిగింది. అలాగే, కంపెనీలు రిమోట్ వర్క్, హైబ్రిడ్ మోడల్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మరిన్ని ఉద్యోగాలు వెలువడుతున్నాయి.చివరిగా, 2025 ప్రారంభం నుండి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కొత్తగా వచ్చిన ఉద్యోగాల్లో 60% వరకు సాంకేతిక రంగంలోనే నమోదయ్యాయి. ఇది టెక్ రంగంలో భారతదేశం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నదానికి అద్దం పడుతోంది.